.
పార్థసారథి పొట్లూరి......
ఎఫ్35 … ఒకసారి లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం… వీటినే కదా మనకు అమెరికా అంటగట్టడానికి ప్రయత్నిస్తోంది… తిరువనంతపురంలో దిగి, ఇక ఎగరలేక నీలుగుతున్న ఫైటర్…
1.ఇంజిన్, సాఫ్ట్ వేర్ మరియు హెల్మెట్ లో ఉండే డిస్ప్లె సిస్టమ్ ( Helmet Mounted Display System – HMDS) లలో చాలా లోపాలు ఉన్నాయి.
2.ALIS ( Autonomic Logistic Information System) లో లోపాలు ఉన్నాయి. ALIS అనేది F-35 ని ఆపరేట్ చేయడానికి చాలా కీలకంగా వ్యవహారిస్తుంది. నిర్వహణ మరియు స్పెర్ పార్ట్స్ రవాణాలో విపరీతమైన జాప్యం వలన F-35 లని కొన్న దేశాలు తీవ్ర ఇబ్బందులకి గురవతున్నాయి అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Ads
3.F-35 స్టెల్త్ టెక్నాలజీ విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి. F-35 ఒక సార్టీ పూర్తి చేస్తే యాంటి రాడార్ పెయింట్ ( Anti Radar Material – ARM) వేయాల్సి ఉంటుంది మరియు ఇది చాలా సమయం తీసుకుంటుంది. అత్యవసర సమయంలో ఒకసారి సార్టీ పూర్తయిన తరువాత ARM వేయకుండా వెంటనే గాల్లోకి ఎగరడానికి వీలులేదు, అలా అని ARM వేయకుండా వెళితే శత్రు దేశపు గ్రౌండ్ లేదా విమాన రాడార్లు F-35 ని డీటేక్ట్ చేయగలుతాయి. ఈ చర్య అన్ని స్టెల్త్ ఫైటర్ జెట్స్ కి తప్పని సరి!
4. ARM సప్లై చేయడంలో లాక్ హీడ్ మార్టిన్ విపరీతమైన జాప్యం చేస్తున్నదని విమర్శలు ఉన్నాయి.
5. తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయిన రాయల్ నావీ F-35 B ఫోటో చూడండి. ANTI AIR మిసైల్స్ కింద పైలాన్ కి అమర్చి ఉన్నాయి అంటే అది స్టెల్త్ మోడ్ లో లేదని అర్ధమవుతుంది. నిజానికి మిసైల్స్ F-35B పొట్ట ( BELLY – Weapon Bay) లో ఉండాలి. మిసైల్ ప్రయోగించేప్పుడు బెల్లీ తలుపులు తెరుచుకొని మిసైల్ ఫైర్ అవగానే డోర్స్ మూసుకుపోతాయి. ఇది స్టెల్త్ మోడ్ అవుతుంది కానీ విమానం రెక్కల కింద మిసైల్స్ ఉన్నాయి అంటే ARM సప్లై చేయకపోయి ఉండవచ్చు. ARM కోటింగ్ వేయనప్పుడు మిసైల్స్ బెల్లీలో ఉంటే ఏమిటీ రెక్కల కింద ఉంటే ఏమిటీ! రాడార్ కి తేలికగా దొరికిపోతుంది.
6. F-35B లో తరుచూ హైడ్రాలిక్ సిస్టమ్ లో లోపాలు వస్తున్నాయి దీని వలన ఒక్కో సారి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఉన్నట్లుండి అమాంతం కుప్పకూలిపోతుంది. మూడు నెలలక్రితం ఒక F-35 గాల్లో ఎగురుతునే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
7. F-35 లో మెకానికల్ ఫెయిల్యూర్స్ అనేవి సాధారణ విషయం అయిపొయింది.
8.F-35 ఫైటర్ జెట్స్ అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఎగరలేవు. ఎక్కువ వేడి అంటే 40c కంటే వేడి ఎక్కువ ఉన్నా మరియు భారీ వర్షంలో వెళ్ళాల్సి ఉన్నా ఇబ్బందులు తప్పవు.
9. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇప్పటికే ఆపరేషన్ లో ఫైటర్ జెట్స్ లలో సాఫ్ట్వేర్ లో బగ్స్ ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఉన్న లోపాలు సరిదిద్దకుండా కొత్త అప్డేట్స్ ఇస్తున్నది Lockheed Martin. బగ్స్ ని తీసివేసి కొత్త అప్డేట్స్ ఇస్తే కొత్త సమస్యలు వస్తున్నాయి. వాటిని సరిచేయమని కోరితే మరో అప్డేట్ లో వాటిని సవరిస్తామని అంటున్నా నెలలకొద్ది జాప్యంతో వాటిని రెక్టిఫై చేస్తున్నది.
10. తిరువనంతపురంలో ఆగిపోయిన F-35B లో సాఫ్ట్వేర్ ప్రాబ్లమా లేక హర్డ్ వేర్ ప్రాబ్లమా అనేది ఇంజినీర్లు పసిగట్టలేకపోయారు!
11. అమెరికన్ నావీ, మేరైన్ కార్ప్స్ వాడే F-35 ఫైటర్ జెట్స్ మీద పెంటగాన్ ఆంక్షలు విధిస్తూ F-35 లని సూపర్ సానిక్ వేగంతో వెళ్ళవద్దని కోరింది. సూపర్ సానిక్ వేగంతో వెళితే ఇంజిన్ ఎగ్జాస్ట్ నుండి విపరీతమైన వేడి పుట్టి తోక భాగం కాలిపోయే అవకాశం ఉండడంతో ఈ ఆంక్షలు విధించింది. ఈ సమస్యని పరిష్కరించమని పెంటగాన్ లాక్ హీడ్ మార్టిన్ మీద ఒత్తిడి తేవావాల్సింది పోయి వేగం మీద పరిమితి విధించి నడపమని పైలట్ల ని కోరడం విచిత్రంగా ఉంది!
12. తరుచూ F-35 కాక్ పిట్ లో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే జెనరేటర్ కొద్ది నిముషాల పాటు పనిచేయకపోవడం, మళ్ళీ ఆటోమేటిక్ గా పనిచేయడం జరుగుతున్నదని పైలట్స్ కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదని తెలుస్తున్నది!
13.సూపర్ సానిక్ వేగంతో వెళితే F-35 జెట్ ఫైటర్ మీద వేసిన యాంటి రాడార్ మెటీరియల్ తో చేసిన పెయింట్ కొట్టుకు పోతున్నది కాబట్టి సూపర్ సానిక్ వేగంతో వెళ్ళవద్దని ఆంక్షలు విధించింది పెంటగాన్!
14. రాత్రిపూట F-35 ని నడుపుతున్న సమయంలో హఠాత్తు గా కాక్ పిట్ లోని డిస్ప్లె లు ఆన్ ఆఫ్ అవడం మరో సమస్య. అయితే ఇది సాఫ్ట్వేర్ బగ్ వలన ఏర్పడుతున్నట్లుగా తెలుస్తున్నది కానీ ఇంతవరకూ దానిని పరిష్కరించలేదు LOCKHEED MARTIN.
15.రాత్రిపూట F-35 ని నడుపుతున్నప్పుడు చీకట్లో చూడడానికి అని నైట్ విజన్ డిస్ప్లె ని ఏర్పాటు చేసినా అప్పుడప్పుడు దృశ్యం మాయమైపోయి అడ్డంగా గీతలు ( Horizontal Lines) ఏర్పడుతున్నాయని పైలట్లు కంప్లైంట్ చేస్తున్నా ఇంతవరకు దానిని పరిష్కరించలేదు.
16. అమెరికన్ నావీ వాడే F-35B లు సముద్రం మీద టార్గెట్స్ గుర్తించడానికి వీలుగా రాడార్ ని అప్ గ్రేడ్ చేయమని గత రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు పైలట్స్ కానీ పెంటగాన్ ఆ డిమాండ్ ని పట్టించుకోవట్లేదని ఆరోపణలు ఉన్నాయి.
17. అమెరికన్ మేరైన్ కార్ప్స్ అనేది స్పెషల్ ఆపరేషన్స్ కోసం ఏర్పాటు చేశారు. సముద్రంలో, ఎడారిలో ఎక్కడైనా అత్యవసర ఆపరేషన్ ని పూర్తిచేయాల్సి ఉంటుంది మేరైన్ కార్ప్స్ కానీ F-35B ని తీవ్రమైన వేడి లేదా చల్లటి ప్రదేశాలలో వాడవద్దు అని పెంటగాన్ ఆంక్షలు విధించింది.
18. ఒక ఆపరేషన్ కోసం అలస్కాలో డ్రిల్స్ నిర్వహిస్తుండగా F-35B లోని బాటరీ చల్లబడిపోయి పైలట్ కి వార్నింగ్ ఇవ్వడంతో ఆ డ్రిల్ లో పాల్గొంటున్న మిగతా F-35B లని అలస్కా నుండి కొంచెం వేడిగా ఉండే ప్రదేశానికి తరలించింది ఎయిర్ ఫోర్స్!
రష్యా అలస్కా ని స్వాధీనం చేసుకోవచ్చనే భయంతో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ తమ F-35B ఫ్లీట్ ని అలస్కాకి తరలించిన సందర్భంలో జరిగింది ఇది!
******************
ప్రస్తుతం తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో ఉన్న F-35B ని దాని రెక్కలు తీసేసి మిలిటరీ రవాణా విమానంలో లండన్ లేదా అమెరికా కి తరలించాల్సి రావొచ్చు! రేపో మాపో ఈ పని చేస్తారు! ఎందుకంటే లాక్ హీడ్ మార్టిన్ ఇంజినీర్లు భారత్ కి వచ్చి రిపేర్ చేయలేని పరిస్థితిలో ఉంది!
*******************
F-35 ఫైటర్ జెట్ లో ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టే చాలా దేశాలు NEXT BEST అయిన రాఫెల్ వైపు మొగ్గు చూపుతున్నాయి!
ఆపరేషన్ సిందూర్ లో రాఫెల్ జెట్లు కూలిపోయాయి అని ప్రచారం చేయడం వెనుక F-35 లో ఉన్న లోపాలని కప్పిపుచ్చడానికే! కానీ మన దేశంలోని ప్రతిపక్షం తప్పితే మిగతా దేశాలు నమ్మలేదు!
Martin Baker Ejection Seat!
జెట్ ఫైటర్ కి ప్రమాదం జరిగినప్పుడు పైలట్ క్షేమంగా తప్పించుకోవడానికి ఏజెక్షన్ సీట్ ని అమరుస్తాయి జెట్ ఫైటర్ లని తయారు చేసే సంస్థలు.
రాఫెల్ కి మార్టిన్ బేకర్ తయారుచేసిన Mk. 16 ఎజెక్షన్ సీట్ ని అమర్చారు. ఒకవేళ రాఫెల్ జెట్ కూలిపోయి ఉంటే పైలట్ వెంటనే eject అయిపోయి ఉండేవాడు. రాఫెల్ నుండి పైలట్ eject అయిన వెంటనే ఆ విషయం Martin Baker సంస్థ ప్రధాన కార్యాలయ వెబ్సైటులో నమోదు అవుతుంది. ఎలాంటి పక్షపాతం లేకుండా ఎజెక్షన్ సీటుకు ఉండే సాటిలైట్ ట్రాన్సమిటర్ వెంటనే సాటిలైట్ ద్వారా నేరుగా మార్టిన్ బేకర్ సర్వర్ కి మెసేజ్ పంపిస్తుంది అది వెంటనే నమోదు చేస్తుంది!
కానీ ఇంతవరకు మార్టిన్ బేకర్ వెబ్సైటు లో ఎలాంటి ఎజెక్షన్ కౌంట్ నమోదు కాలేదు. అసలు రాఫెల్ కూలిపోయిందా లేదా అన్నది ఇతర దేశాల రక్షణ శాఖ అధికారులు may 10 న మార్టిన్ బేకర్ వెబ్సైటు ని చూసేవుంటారు!
***************
అయిందేదో మనమంచికే అయింది!
ఇక ముందు డోనాల్డ్ ట్రంప్ F-35 లని కొనండి అంటూ మోడీకి ఆఫర్ ఇచ్చే అవకాశం ఉండదు!
లాక్ హీడ్ మార్టిన్ కూడా లాబీయింగ్ చేసి మన మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవచ్చు!
ఇంతకీ రాయల్ నావీ తమ F-35 లకి ఇన్సూరెన్స్ చేసిందా లేదా అన్నది తెలియరాలేదు. ఒక వేళ ఆన్ సైట్ వారంటీ ఉంటే తిరువనంత పురం నుండి అమెరికా కి F35B ని air lift చేయడానికి 10 లక్షల డాలర్లు + పది రోజులు తిరువనంతపురం air పోర్ట్ లో పార్కింగ్ చేసినందుకు మరో లక్ష డాలర్లు అదనంగా చెల్లించాలి రాయల్ నావీ!
Share this Article