.
ఎహె, జనం నన్ను చూడటం మానేసిన రోజున ఎంచక్కా బార్సిలోనా వెళ్లిపోయి క్యాబ్ డ్రైవర్ అయిపోతా అంటాడు ఫహాద్ ఫాజిల్… ఇప్పుడే కాదు, 2022లోనూ ఇదే మాటన్నాడు…
ఒక్కొక్క హీరో కోట్లకుకోట్లు ఖర్చుపెట్టి థియేటర్లు కట్టుకుని, ఇతర వ్యాపారాల్లోకి ప్రవేశిస్తూ… భావి ప్రణాళికల్ని భారీగా రచించుకుంటూ ఉంటే… ఈయనేమిటి..? అదేదో దేశం వెళ్లి క్యాబ్ నడిపించుకుంటాను అంటాడేంటి..? ఆశ్చర్యంగా ఉందా..? తను అంతే…
Ads
భార్య నజ్రియా నజీం కూడా నటే… ఇద్దరూ తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తుంటారు అప్పుడప్పుడూ… అయితే మరి బార్సిలోనా స్పెషాలిటీ ఏమిటి..? ఏమీలేదు… స్పెయిన్‌లో రెండో అతి పెద్ద పట్టణం… అవును, పట్టణమే, 16-17 లక్షల జనాభా… మన మల్కాజిగిరి జనాభాలో సగంకన్నా తక్కువ… స్వయంప్రతిపత్తి ఉంది…
ప్రశాంతంగా… అందంగా… సముద్రపు ఒడ్డున… కల్చర్, నేచర్, ఫుడ్, హిస్టరీ, ఎడ్యుకేషన్, ఆర్కిటెక్చర్… ఏ రంగం చూసుకున్నా అది ఫేమసే… ప్రజారవాణాకు ప్రాధాన్యం… క్యాబ్స్‌కు కూడా పెద్ద ప్రయారిటీ ఉండదు… కాకపోతే ఆ నగరంలో డ్రైవ్ చేస్తూ ఎప్పుడూ తిరగొచ్చుననేది ఫాజిల్ ఆలోచన… అదొక టేస్ట్…
ఐతే… తన భిన్నమైన ఆలోచనల వెనుక ఓ ఆరోగ్యపరమైన కారణమూ ఉందట… తనకు ADHD (Attention Deficit Hyperactivity Disorder)… అంటే… అదొక మానసిక బలహీనత… లక్షణాలు ఇవీ అని నిర్దిష్టంగా చెప్పలేం… చికిత్స కూడా ఉండదు… కంట్రోల్ చేసుకోవడమే… పిల్లలకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ చేస్తుంటారు…
హైపర్ యాక్టివిటీ… హైపర్ ఫోకస్… క్రియేటివ్ థాట్స్… కొందరిలో కనిపిస్తాయి… అసలు చాలామందికి ఈ వ్యాధి ఉన్నా సరే డయాగ్నయిజ్ చేయలేం… తనకు ఈ సమస్య ఉన్నట్టు తనే వెల్లడించాడు… ఐతే బార్సిలోనా- క్యాబ్ డ్రైవర్ ఆలోచనల వెనుక ఇదే కారణమని చెప్పగలమో లేదో గానీ… తను కాస్త డిఫరెంట్ కేరక్టరే…
తను నటించిన కుంబలంగి నైట్స్, ట్రాన్స్, నార్త్ 24 ఖాతమ్ వంటి సినిమాల్లో కాస్త మెంటల్లీ డిజార్డర్ రోల్స్ కూడా చేశాడు… తనకున్న సమస్య తనకు తెలుసు, సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి… ఎప్పటికప్పుడు తనే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడట..!! ఇంట్రస్టింగు…
సెలబ్రిటీలు తమ వ్యాధుల్ని, ఆరోగ్య సమస్యల్ని పెద్దగా బయటికి చెప్పుకోరు… సమంత మయోసైటిస్ గురించి చెప్పుకుంది… తనకు చిన్నప్పుడు ప్లస్ పెద్దయ్యాక టీబీ సోకిందని సుహాసిని చెప్పుకుంది ఇటీవల… అమితాబ్ కూడా ఈ వ్యాధి పీడితుడే ఓ దశలో… తనకు myasthenia gravis (నాడీసంబంధ వ్యాధి) కూడా… సల్మాన్ trigeminal neuralgia (ఫేస్‌కు సమస్య).., యామీ గౌతమ్ keratosis pilaris (స్కిన్ డిసీజ్)… ఇలా చాలామంది…
అంతెందుకు..? మనీషా కొయిరాలా, సొనాలీ బింద్రే కేన్సర్ రక్షితులు… హృతిక్ రోషన్ chronic subdural hematoma… ఫాతిమా సనా షేక్ epilepsy … వరుణ్ ధావన్ vestibular hypofunction… అనుష్క శర్మ bulging disc… ఇవి మరికొన్ని ఉదాహరణలు…
Share this Article