Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ జాతీయ సర్వే నిర్వహించి- ఆర్టిస్టులను ఎంపిక చేయాల్సిందేమో !!

October 28, 2026 by M S R

.

విచిత్రం- ఐరనీ ఏమిటంటే..? రామాయణ కథను భ్రష్టుపట్టించి, నవ్వులపాలు చేసిన ‘ఆదిపురుష్’ను చూడండి, ఎంకరేజ్ చేయండి అని మోసిన సోకాల్డ్ సోషల్ యాక్టివిస్టులు ఇప్పుడు… హాలీవుడ్‌కు ఏమాత్రం తగ్గని సాంకేతిక, క్రియేటివ్ జ్ఙానంతో ప్రపంచానికి రామాయణం విశిష్టతను అందించాలని ప్రయత్నించే ప్రస్తుత రామాయణ సినిమాను ద్వేషించడం, నెగెటివ్ ప్రచారానికి పూనుకోవడం..!

అన్నీ పిచ్చి సాకులు… యానిమల్ రణబీర్ రాముడా..? ఓ బక్కపలుచని డాన్సర్ సాయిపల్లవి సీతా..? డబ్బు తప్ప మరేదీ పట్టని యశ్ రావణబ్రహ్మా..? తనను రాముడికి దీటుగా ప్రొజెక్ట్ చేస్తారా..? తన మతం కారణంగానే అవకాశాలు రానివ్వడం లేదని లబలబలాడిన రెహమాన్ ఖవాలీ సంగీతం ఇస్తాడా..? ఇవన్నీ ఆ రాముడికి అవమానమే అన్నంతగా నెగెటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు…

Ads

నవ్వొచ్చింది… సైఫ్, కరీనా తమ కొడుకులకు హిందూ-సిక్కులను ఊచకోత కోయించిన తైమూర్, జహంగీర్ పేర్లు పెట్టుకుంటే మాత్రం ఈ క్యాంపెయినర్లలో ఒక్కడూ కిక్కుమనలేదు… 4 వేల కోట్లతో ఓ బృహత్ ప్రయత్నం జరుగుతుంటే వీళ్లు దిష్టి తీస్తున్నట్టుంది… ఎవరిని ఏ పాత్రకు తీసుకోవాలనేది నిర్మాత- దర్శకుల టీమ్ నిర్ణయం… సోషల్ మీడియా పక్షపాత యాక్టివిస్టులు కాదు…

ఆర్టిస్టుల వ్యక్తిగతం వేరు- తమకు అప్పగించిన పాత్రల్ని కథానుసారం ఎంత ప్రతిభావంతంగా పోషిస్తారనేదే ప్రధానం… రణబీర్ బీఫ్ తింటాడు, సాయిపల్లవి పాకిస్థానీ ప్రేమికురాలు, రెహమాన్ ముస్లిం… ఏమిటివన్నీ..? సో వాట్..? వాళ్లను దర్శకుడు తను అనుకున్నట్టుగా చిత్రీకరించాడా లేదా… ఇదొక్కటే ప్రధానం…

ఒకాయన మరీ నాలుగు అడుగులు ముందుకేసి కంగనా రనౌత్ వంటి ఫిమేల్ యాక్టర్స్ సీత పాత్రకు బెటర్ అనేశాడు… ఒకవేళ ఆమెను తీసుకున్నా నెగెటివ్ క్యాంపెయినర్లు ఆమె పాత వెగటు, రోత ఫోటోలు పెట్టేసి, ఈమె సీతా..? అని కబడ్డీ ఆడుకునేవారు కాదా..!

ram

మరో విమర్శ కాస్త ఇంట్రస్టింగ్… నిజమే కదా అనిపించింది… రాముడు నీలమేఘ శ్యాముడు… అంటే చామనఛాయ… మేఘవర్ణం అంటే అంతే కదా… దక్షిణ సినిమాలన్నీ రాముడిని ఎంతోకాలంగా ఇలాగే చూపించాయి… కాకపోతే నీలి రంగు పులిమారు… మరీ శ్రీరామరాజ్యంలో బాలయ్యకు బాపు దట్టమైన బ్లూకలర్ దట్టించాడు… ఆడ్‌గా ఉంది…

అసలు నీలి వర్ణం పులమడమే తప్పు… మరీ నార్త్ ఇండియన్ వైట్ గాకుండా కాస్త ఛాయ తక్కువగా ఉంటే చాలు… నో, నో, రాముడు మాంసం తినేవాడా..? మీసాలుండేవా..? రావణుడికి బావురు గడ్డం దేనికి..? ఆ చర్చల జోలికి పోవడం లేదిక్కడ… జస్ట్, స్కిన్ కలర్ టోన్… నార్త్ ఇండియన్ ఫిలిమ్ మేకర్స్ రాముడిని ఫెయిర్ స్కిన్ దేవుడిని చేసేశారు… అదీ తప్పే…

నిజానికి ప్రాచీన భారతదేశ ఇతిహాసాలలో, నలుపు ఒక లోపం కాదు… అది అవతారాలు, వీరులు, ఋషుల శరీర ఛాయ… రాముడు నలుపే, కృష్ణుడు నలుపే… అసలు కృష్ణ అంటేనే అర్థం నలుపు… ద్రౌపది నలుపే కానీ ప్రపంచ సుందరి… ఆమె ఒరిజినల్ పేరు కూడా కృష్ణ… అంతెందుకు ( మహాభారత రచయితకు కూడా అతని నల్లని చర్మం కారణంగా కృష్ణ ద్వైపాయనుడు (వ్యాసుడు) అని పేరు పెట్టారు)…

నలుపులో అందం లేదనే పిచ్చి భావనతో నార్త్ ఇండియన్ సినిమా రాముడికి ఫెయిర్ స్కిన్ ప్రసాదించింది… మొన్న ఓ పోస్టు చూశాను… జంధ్యం లేని రాముడిని మొదటిసారి చూస్తున్నాను అంటూ ఆ సినిమాలోని ఓ ఫోటోను జతచేశారు… అందులో రాముడి దేహం మీద ఆభరణాలున్నాయి కానీ జంధ్యం లేదు… కానీ కొన్ని సీన్లలో జంధ్యం కనిపిస్తోంది…

ఎహె, జంధ్యం ఉంటేనేం, లేకపోతేనేం, అప్పట్లో రాముడు జంధ్యం ధరించేవాడా, ఎవరు చూడొచ్చారు అనే ప్రశ్నలు వద్దు ఇక్కడ… రామాయణం విడుదల తేదీ దగ్గరయ్యే కొద్దీ ఇంకా ఇలాంటి రంధ్రాన్వేషణలు ఎన్ని చూడాలో మనం..!! ఆ గ్రాఫిక్ క్వాలిటీ, ఆ గ్రాండియర్ జనానికి నచ్చితే ఈ నెగెటివ్ క్యాంపెయిన్ గాలికి కొట్టుకుపోతుంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ జాతీయ సర్వే నిర్వహించి- ఆర్టిస్టులను ఎంపిక చేయాల్సిందేమో !!
  • KCR – సొంత బిడ్డనే కాదన్నాడు – ఈ ‘బిడ్డ’నూ గాలికి వదిలేశాడు !!
  • పులివెందుల కంచుకోట బద్ధలు – వై నాట్ సిరిసిల్ల? వై నాట్ సిద్దిపేట?
  • కార్పొరేట్ వైద్య మాఫియా ! సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అక్షరసత్యాలు !!
  • డ్రగ్ డాన్ వెళ్లిపోయాడు – ఆ నీడలు పెరిగి భయపెడుతున్నయ్ !!
  • హేట్సాఫ్ అమెరికా… 1930 లోనే 13 నెలల్లో 102 అంతస్తుల అద్భుతం !!
  • 418 … కేజీఎఫ్ దర్శకుడి సినిమా అంటే ఎక్కువ ఊహించాం… కానీ..?
  • జిలపురుగుల ఎఫెక్ట్..? అదే నిజమైతే మరి ‘వారణాసి’ మాట..?!
  • కైసే కహూఁ కుచ్ కెహనా సకూఁ … మహేంద్రన్ సినిమాల తీరే వేరు !!
  • అయ్యా, నేతాజీ మునిమనవడు గారూ..! ప్రభాస్ గ్లింప్స్‌లో తప్పేం లేదు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions