Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీవీక్షణం పడిపోతోంది… టీవీలకూ గడ్డురోజులు… సీరియస్ విశ్లేషణ ఇదీ…

January 9, 2023 by M S R

సగానికి సగం ప్రేక్షకుల సంఖ్య పడిపోయినా సరే, ఈరోజుకూ డెయిలీ సీరియళ్లలో నంబర్ వన్‌గా పరిగణించబడుతున్న కార్తీకదీపం సీరియల్‌ను అర్ధంతరంగా ఎందుకు ఎత్తిపారేస్తున్నారు… ఈ ప్రశ్నకు జవాబు దొరికితే చాలు, టీవీ ప్రేక్షకుల సంఖ్య దారుణంగా పడిపోతున్న విషయం, వినోద చానెళ్లు కలవరపడుతున్న వైనం అర్థమవుతుంది… నిజం… టీవీక్షణ సమయం ఘోరంగా పడిపోతోంది… అన్ని చానెళ్ల రేటింగ్స్ పడిపోతున్నయ్…

ఇన్నాళ్లూ స్టార్‌మాటీవీ కేవలం ఫిక్షన్, అంటే సీరియళ్ల బలంతో ఎక్కువ జీఆర్పీలను సాధిస్తోంది… వాటిల్లో కార్తీకదీపం కూడా ఒకటి… కానీ అది రాను రాను ఇంకా దిగజారిపోతోంది… కొన్నిసార్లు కార్తీకదీపం దాటేసి గుప్పెడంత మనసు, ఇంటింటి గృహలక్ష్మి వంటి సీరియళ్లు దూసుకొస్తున్నాయి… ఇక కార్తీకదీపానికి ప్రైమ్ టైమ్ ప్రసారం కాదుకదా, ఇక అది వట్టిపోతోంది కాబట్టి వదిలించుకుందామని మాటీవీ అనుకుంది… అంతే, ఎత్తిపారేస్తున్నారు…

దిగువన టేబుల్స్ చూడండి… ఇంటికి దీపం ఇల్లాలు, కృష్ణా ముకుందా మురారి, మల్లి, జానకికలగనలేదు సీరియళ్లు కూడా కొద్దోగొప్పో బాగానే రేటింగ్స్ సాధిస్తున్నాయి… కానీ మాటీవీకి బలం సీరియళ్లయితే, ఫిక్షన్ అయితే… అదే కేటగిరీలో జీతెలుగు పోటీగా దూసుకొస్తోంది… ఈ ధోరణి ఇలాగే సాగితే మాటీవీ తన ఫస్ట్ ప్లేసు పోగొట్టుకోవాల్సి వస్తుంది… అందుకని తన బలమైన సీరియళ్ల విషయంలో మాటీవీ పునరాలోచనలో పడింది… ఏవి ఎత్తిపారేయాలి, ఇంకా కొత్త సీరియళ్లు ఏం ప్రవేశపెట్టాలి అన..!

Ads


trp

జీతెలుగు సీరియళ్లు కూడా నాణ్యత కోణంలో మాటీవీకి నకళ్లే… అన్నీ భ్రష్టుపట్టిన కథనాలే… కానీ జీతెలుగు సీరియళ్లు పికప్ అవుతుండేసరికి మాటీవీ బెంబేలెత్తిపోతోంది… త్రినయని జీఆర్పీల్లో దంచి కొడుతోంది… అలాగే పడమటి సంధ్యారాగం, రాధమ్మ కూతురు, కల్యాణం కమనీయం తదితర సీరియళ్లు మాటీవీ సీరియళ్లకు పోటీనిస్తున్నాయి… పదిలోపు జీఆర్పీలు మాటీవీ సీరియళ్ల పతనాన్ని సూచిస్తున్నాయి… ఒక్కసారి దిగువన టేబుల్ చూడండి… ఫిక్షన్ కేటగిరీలో మాటీవీకి, జీటీవికి నడుమ తేడా చాలా స్వల్పం… అందుకే మాటీవీ గంగవెర్రులెత్తుతోంది…



trp


ఫిక్షన్‌లో ఈటీవీ కొద్దిగా పికప్ అవుతోంది… పైగా నాన్ ఫిక్షన్ అంటే రియాలిటీ షోలలో ఇప్పటికీ ఈటీవీదే పైచేయి, అవే ఈటీవీని నిలబెడుతున్నాయి… జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ దాన్ని ఆదుకుంటున్నాయి… వావ్, క్యాష్, పాడుతా తీయగా, ఢీ, ఆలీతో సరదాగా ఫ్లాప్… వీటిల్లో ఆలీతో సరదాగా ఆగిపోయింది… క్యాష్ స్థానంలో సుమ అడ్డా అని కొత్త షో స్టార్ట్ చేశారు… ఇంకా చాలా మార్పులు చేయాల్సి ఉంది ఈటీవీ… లేకపోతే చివరకు జెమిని టీవీకన్నా దిగువకు పడిపోయే ప్రమాదం ఉంది… (దిగువన టేబుల్ చూడండి…)

trp

స్థూలంగా చూస్తే జీఆర్పీలకు సంబంధించి జీటీవీకి, మాటీవీకి నడుమ తేడా 100 లోపే… ఇదంతా ఒక కోణం… మరోకోణం ఏమిటంటే..? ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి ఎందుకు బద్దకిస్తున్నారో, సేమ్, టీవీల ఎదుట సీరియళ్ల టైమ్‌కు కూర్చోవడానికి కూడా ఇష్టపడటం లేదు… తమకు టైమ్ ఉన్నప్పుడు, పనులు చేసుకుంటూనే యాప్స్‌లో సీరియళ్లు చూస్తున్నారు… జీ5, హాట్ స్టార్ యాప్స్‌లో ఈ సీరియల్ వీక్షణం ఎక్కువ… దీంతో టీవీ రేటింగ్స్‌కు దెబ్బ… రేటింగ్స్ పడిపోతే రెవిన్యూకు దెబ్బ…

దీంతో మాటీవీ వాడు తన సీరియళ్లను పొద్దున్నే యాప్‌లో షెడ్యూల్ చేయడం లేదు… అనివార్యంగా టీవీ ఎదుట కూర్చుకుని చూడమంటున్నాడు… ఏమో, ఈ దెబ్బకు ప్రేక్షకులు అవీ మానేసి, వెబ్ సీరిస్ వైపు మళ్లే ప్రమాదం ఉంది… అదే జరిగితే టీవీలు మరింత నష్టపోయి, దిక్కులు చూడటం ఖాయం… ప్రింట్ మీడియా పరిస్థితి ఎదుర్కోవాల్సిందే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….
  • ఒక గొప్ప ఫోటో..! దీని వెనుక ప్రతి లీడర్ తప్పక చదవాల్సిన ఓ కథ..!!
  • నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ కథ…
  • గొప్పల తిప్పలు తరువాత… ముందు నీ గోచీ సరిచూసుకోవయ్యా ట్రంపూ…
  • ఇది ఆ పాత కాంగ్రెస్ కాదు… ఈ జుబ్లీ గుట్టల్లో కొత్తగా స్ట్రాటజిక్ అడుగులు…
  • ‘‘కేసీయార్‌వి ప్రచార నాటకాలు- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు’’
  • మొన్నటి అమ్మాయిల విజయం వెనుక ఓ అలుపెరుగని గురువు..!!
  • ఓ సుదీర్ఘ వీక్షణం… ఆ పాత వైబ్స్ లేవు, ఆ గూస్ బంప్స్ లేవు…
  • అదే రవితేజ… అదే మొనాటనీ… అదే యాక్షన్… అదే ‘మాస్ జాతర’…
  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions