Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కార్తీకదీపం దర్శకుడికి కర్రు కాల్చి వాతలు పెట్టిన టీవీ ప్రేక్షకులు..!!

September 8, 2022 by M S R

ప్రేక్షకులు హౌలాగాళ్లు… పిచ్చోళ్లలాగా మేం ఏం చూపించినా సరే, కళ్లప్పగించి చూస్తారు అనుకునేవాళ్లకు ప్రేక్షకులు కర్రు కాల్చి వాతలు పెట్టడం కొత్తేమీ కాదు… ప్రేక్షకులు అంత ఎడ్డోళ్లు కూడా కాదు… కాకపోతే ఆ టైం రావాలి… కార్తీకదీపం నిర్మాతలకు, దర్శకుడికి ఇప్పుడు ఆ అనుభవం ఏమిటో అర్థమవుతోంది… ప్రేక్షకులు ఛీకొడుతున్నారు… ఫోఫోరా ఎడ్డీస్ అని వెక్కిరిస్తున్నారు… నిజం…

తాజాగా బార్క్ రేటింగ్స్ చెబుతున్న చేదు నిజం అదే… సరే, సీరియల్ మార్పుల గురించి ఓసారి సంక్షిప్తంగా చెప్పుకుందాం… మలయాళంలోని ఓ హిట్ సీరియల్‌కు తెలుగులో కార్తీకదీపం రీమేక్… ఆందులోని లీడ్ కేరక్టర్ ప్రేమి విశ్వనాథ్ ఇందులోనూ ప్రధాన పాత్రధారి… మొదట్లో అదే లైన్‌లో నడిచినా సరే, తరువాత ఇష్టారాజ్యంగా కథను మలుపులు తిప్పుతూ పోయాడు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర… నిర్మాత గుత్తా వెంకట్ కావచ్చు బహుశా… (వంటలక్క, దేవత సీరియళ్లకూ నిర్మాత తనేనట…)

మోహన్‌బాబు శివశంకర్, అల్లరి నరేష్ రాంబాబుగాడి పెళ్లాం సినిమాల్ని కూడా డైరెక్ట్ చేశాడట… పవన్ కల్యాణ్ సినిమా చేసే చాన్స్ తృటిలో తప్పిందట… అంతటి రాజేంద్రుడు ఏం చేశాడంటే, ఓ కీలకదశలో కార్తీకదీపం సీరియల్‌లోని ముఖ్యపాత్రల్ని చంపేసి, సెకండ్ జనరేషన్‌లోకి కథను అమాంతంగా తీసుకుపోయాడు… అబ్రకదబ్ర అన్నాడు…

Ads

కార్తీకదీపం

నిజానికి సీరియల్‌కు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన దశ అది… కానీ దేశంలోకెల్లా బంపర్ రేటింగ్స్‌తో నడుస్తున్న సీరియల్‌ను ఎవడు చంపుకుంటాడు..? అందుకే ఇలా కొత్త ఎత్తుగడ వేసి, మరో ఏడాదో రెండేళ్లో నడిపించేయవచ్చు అనుకున్నాడు… ఇక కథను ఎటెటో తీసుకుపోవడం స్టార్ట్ చేశాడు… ప్రేక్షకులకు చిర్రెత్తింది… ఇదేం పైత్యంరా నాయనా, బుర్రలో ఏదో పురుగు మెసిలినట్టుంది అనుకున్న ప్రేక్షకులు ఆ సీరియల్ వైపు చూడటం మానేశారు… ఫలితంగా రేటింగ్స్ పడిపోయాయి…

kartika deepam

అరెరె, సీరియల్‌ను కోతిని చేయబోతే ఇంకేదో అయ్యిందనుకున్న దర్శకుడికి ప్రయోగం దారుణంగా వికటించిందని అర్థమైంది… అప్పటికే ప్రేమి విశ్వనాథ్, పరిటాల నిరుపమ్, శోభాశెట్టిలను తీసిపడేశాడు కదా సీరియల్‌లో… సీరియల్‌కు ప్రాణంగా ఉంటూ వచ్చిన హిమ సౌర్య పాత్రల వయస్సు పెంచేశాడు… ఈ పాత్రల్ని పోషిస్తున్న కృతిక, సహృదలను కూడా తీసేసి… వాళ్ల ప్లేసులో వయస్సొచ్చిన పాత్రల్ని ప్రవేశపెట్టాడు… పాపులర్ టీవీ నటులు కీర్తి భట్, అమూల్య గౌడలను తీసుకొచ్చాడు…

వాళ్లెవరు..? ఇంకెవరు..? తెలుగు టీవీ సీరియళ్లు అంటేనే కన్నడ కస్తూరీలు కదా… వీళ్లలో కీర్తి భట్ మొన్నమొన్నటిదాకా అదే స్టార్‌మాటీవీలో మనసిచ్చి చూడు సీరియల్‌లో ప్రధానపాత్ర చేసింది… సహజంగానే అదొక చెత్త పాత్ర, కానీ ఈమె మాత్రం అదరగొట్టింది… సీరియల్‌కు ఈమే ప్రాణం… నిజజీవితంలో చాలా కష్టాలు పడింది… ఓ యాక్సిడెంటులో ఒకేసారి తల్లిదండ్రుల్ని, అన్నయ్యను పోగొట్టుకుంది… ధైర్యాన్ని కూడదీసుకుని, ఒంటరిగానే నెగ్గుకొస్తున్నది… పాత్ర ఎలా ఉన్నా సరే, తను మాత్రం మ్యాగ్జిమం ఇచ్చేది… ఆ సీరియల్‌ను అర్థంతరంగా ఎందుకోగానీ ఉరితీశారు…

మరొకామె పేరు అమూల్య ఓంకార్ గౌడ… కన్నడ సీరియల్ కమాలితో ఫేమస్… చాలామంది బెంగుళూరు బేస్డ్ టీవీ తారలు తెలుగు టీవీల్లో పాపులర్ అయిపోవడంతో తనూ హైదరాబాద్ బాటపట్టింది… ఎప్పుడైతే ప్రేక్షకులు ఛీత్కరించడం స్టార్ట్ చేశారో, దర్శకుడికి కళ్లు తెరుచుకున్నాయి… తీసేసిన ప్రేమిని, నిరుపమ్‌ను, శోభను మళ్లీ పిలిచాడు… అంతేకాదు, సహృద, కృతికలను కూడా రమ్మన్నాడు… అమూల్యను, కీర్తిని తీసేశాడు… సెకండ్ జనరేషన్ కథను గిరగిరా వెనక్కి తిప్పాడు… అనగా గడియారాన్ని వెనక్కి తిప్పాడు… మళ్లీ పాత కథలోకి వెళ్లాడు… ఇష్టారాజ్యం… టైం మెషిన్‌లో ప్రేక్షకుల్ని తీసుకుపోయి, మళ్లీ పాతకాలంలోని కథలో కూర్చోబెడతాను అనుకుని భ్రమపడ్డాడు పాపం…

kartikadeepam

చేస్తే చేశాడు, జాగ్రత్తగా కన్విన్సింగుగా చేసి ఉండాల్సింది… అదే ఉంటే తను టీవీ దర్శకుడు ఎందుకవుతాడు..? అది టీవీ సీరియల్ ఎందుకు అవుతుంది..? ‘‘ఆల్‌రెడీ పెద్దవాళ్లయిపోయిన సౌర్య, హిమ మళ్లీ పిల్లలుగా కనిపించడం ఏమిట్రా’’ అని ప్రేక్షకులు చీదరించుకుంటారని ఊహించలేకపోయాడు… తీసేయబడిన కీర్తిభట్ ఇప్పుడు బిగ్‌బాస్ ఆరో సీజన్ హౌజులో తేలింది… అమూల్య గౌడ సంగతి తెలియదు… మరి సీరియల్‌లో ఈ పిచ్చి మార్పుల్ని ప్రేక్షకులు అంగీకరించారా..? అస్సలు లేదు..!

kartikadeepam

పైన టేబుల్ చూశారు కదా… రీసెంట్ బార్క్ రేటింగ్స్ పట్టిక ఇది… టాప్ 30 ప్రోగ్రాం లిస్టు… ఎస్, ఇప్పటికీ కార్తీకదీపం టాపే… జాగ్రత్తగా పరిశీలిస్తే కార్తీకదీపం రేటింగ్స్ పతనం అర్థమవుతుంది… ఓ బుధవారం రోజున దానికి వచ్చిన రేటింగ్స్ కేవలం 8.84 మాత్రమే… అంటే ఒకప్పుడు 16, 18, 19 దాకా రేటింగ్స్ ఎంజాయ్ చేసిన కార్తీకదీపాన్ని ప్రేక్షకులు ఎలా ఛీకొడుతున్నారో అర్థమవుతోందిగా…

ఓ శనివారం 9.80, మరో గురువారం రోజు 9.92 రేటింగ్స్… అసలు పదిలోపు నమోదు అవుతుందంటే, ఇక ఆ సీరియల్ దరిద్రం ఏమిటో తెలుస్తోంది… ఏమోలెండి, దర్శకుడు ఇంకేమైనా ఇకారాలకు పాల్పడి, చేతిలో మంత్రదండంతో మళ్లీ అబ్రకదబ్ర అనేసి, మళ్లీ ప్రధాన పాత్రల టైంజోన్ మార్చేస్తాడేమో అంటారా..? అప్పుడు కర్రు కాల్చి వాతపెట్టడం కాదు, ఇంకాస్త డ్యాష్ డ్యాష్ కూడా జరగొచ్చు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions