కార్తీకదీపం… ఎవరొప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సరే… ఇండియన్ టీవీ సీరియళ్ల హిస్టరీలో నెంబర్ వన్… ఆ రేంజ్ టీఆర్పీలు బహుశా ఇక ఏ సీరియల్ సాధించదేమో… (టీవీ రామాయణం, టీవీ మహాభారతం గాకుండా…) ప్రత్యేకించి ప్రాంతీయ భాష సీరియళ్లలో ఆ స్థాయి సక్సెస్ ఓ రికార్డు… సూపర్, బంపర్ హిట్ సినిమాల ప్రీమియర్ల ప్రసారం టీఆర్పీలకన్నా కార్తీకదీపం రేటింగ్స్ ఎక్కువ… దానికి ప్రధాన కారణం ప్రేమి విశ్వనాథ్…
దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క పాత్రలో అనితర సాధ్యంగా నటించడమే కాదు, తెలుగు నాట ఇంటింటికీ చేరువైంది… ఇక ఆమెకు జతగా టీవీ శోభన్‌బాబు పరిటాల నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ సరేసరి… ఈ సీరియల్ మీద పిచ్చి పిచ్చి ప్రయోగాలు ఎన్ని చేసినా, చివరకు ఘనంగా ముగింపుకొచ్చింది… వచ్చే శనివారం లాస్ట్ ఎపిసోడ్… ఆ ప్లేసులో బ్రహ్మముడి సీరియల్ వేయబోతున్నారు…
Ads
మొదటిసారిగా ఓ టీవీ సీరియల్ సిబ్బందికి, సీరియల్‌కు, ప్రత్యేకించి ఆ సీరియల్ నటికి ఘనంగా వీడ్కోలు పలికిన తీరు ఆసక్తికరంగా అనిపించింది… స్టార్ మా పరివారం అని ఓ రెగ్యులర్ షో వస్తుంది కదా… ఈసారి కార్తీకదీపానికి దాదాపు అంకితం చేశారు… సాధారణంగా ప్రేమి విశ్వనాథ్ టీవీ ప్రోగ్రాములకు రావడం అత్యంత అరుదు… ఒక్కసారి సుమకు ఇంటర్వ్యూ ఇచ్చింది… మరోసారి అమ్మవారి వేషం వేసింది ఏదో షోలో…
ఈసారి కార్తీకదీపం వీడ్కోలు షో కోసమే హైదరాబాద్ వచ్చినట్టుంది… వంటలక్క కదా ఆమె పాత్ర పేరు… వంటలు చేసి, షోలో అప్పటికప్పుడు వడ్డించారు… సీరియల్‌తో బాగా కనెక్టయిన వారి అభిప్రాయాలు చూపించారు… (మోనిత పాత్రధారి శోభిత శెట్టి లేకపోవడం ఒక లోటు)… అక్కడున్న వారి అభిమానంతో ప్రేమి కన్నీళ్లు పెట్టుకుంది… స్థూలంగా ఈ ఎపిసోడ్ బాగుంది… ‘‘బాధపడకండి, మళ్లీ వస్తా’’ అని ప్రేమి ముక్తాయింపు హైలైట్…
నిజంగానే ప్రేమి పాపులారిటీని సొమ్ము చేసుకోవడం కోసం మరో ఎమోషనల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్టుంది… కాకపోతే ఈ కార్తీకదీపం దర్శకుడు రాజేంద్ర గాకుండా ఉంటే బాగుండు… చివరి వంద, రెండొందల ఎపిసోడ్లను భ్రష్టుపట్టించాడు… అన్నట్టు, ఈ షోకు తనను కూడా పిలిచారు… ‘‘నన్ను బాగా తిట్టుకున్నారు, కరోనా కాలంలో వీడు కూడా పోతే బాగుండేదన్నారు…’’ అని చెప్పుకొచ్చాడు ఆయన… ఈ ఎపిసోడ్‌లో మొత్తమ్మీద చికాకు పెట్టింది శ్రీముఖి అరుపులు, కేకలు… ఎక్కడ అరవాలో, ఎక్కడ మామూలుగా మాట్లాడాలో బేసిక్ సోయి లేదు…)
Share this Article