కని పెంచిన తల్లిదండ్రులను కాటికి పంపించిన కొడుకుల్ని, బిడ్డల్ని చూశాం… ఎక్కడికో తీసుకెళ్లి, కాటకలిపి అగాధం చేసిన పిల్లన్నీ చూశాం… నిర్బంధంగా ఓల్డేజీ హోమ్స్ పాలుచేసిన వాళ్లను, బయటికి నెట్టేసి తలుపులు మూసుకున్నవాళ్లను, సజీవంగా స్మశానాల్లో పారేసివచ్చినవాళ్లను కూడా చూశాం… కలికాలం… కాలమహిమ అనుకుంటున్నాం… కానీ అదే సమయంలో…
పెంపుడు జంతువులకు సొంత పిల్లలుగా ప్రేమించేవాళ్లనూ చూశాం, ఆస్తులు రాసిచ్చి వైభోగంగా బతికే ఏర్పాట్లు చేసినవాళ్లనూ చూశాం… ప్రస్తుత వార్త విషయానికొస్తే… సాధారణంగా వ్యవసాయం పనుల్లో తోడ్పడే ఎద్దులతో రైతులకు మంచి దోస్తీ ఉంటుంది… పాలిచ్చే బర్రెల్ని, ఆవుల్ని కూడా ప్రేమిస్తుంటారు… మరణిస్తే కుటుంబసభ్యుల్ని కోల్పోయినట్టే బాధపడతారు… మధ్యప్రదేశ్, కాస్‌గంజ్ జిల్లా, సోరోస్‌కు చెందిన ఇద్దరు రైతులు తమ ఎద్దుల్లో తండ్రులను చూసుకున్నారు…
భవానీసింగ్, ఉల్ఫత్ సింగ్ అనే ఇద్దరు సోదరులు… రెండు ఎడ్లున్నయ్… వాటికి మానా, శ్యామ అని పేర్లు పెట్టుకున్నారు… వాళ్ల బంధం పనిబంధంకన్నా మించి పెరిగింది… 30 ఏళ్ల బంధం… ఈనెల 16న మరణించాయి… తండ్రి మరణిస్తే అంత్యక్రియల్ని ఎలా చేస్తారో ఈ ఇద్దరు సోదరులు ఆ ఎడ్లకు అన్ని రకాల కర్మలు శ్రద్ధగా చేశారు…
Ads
వాటి అస్థికలను తీసుకెళ్లి గంగానదిలో నిమజ్జనం చేశారు… మంగళవారం ఏకంగా 3 వేల మందిని పిలిచి పెద్ద కర్మ చేస్తున్నారు… ప్రత్యేకంగా శోెకపత్రికలను ముద్రించి, పంపిణీ చేశారు… ఇదే ఉల్ఫత్ సింగ్‌కు మరో రెండు ఎడ్లు ఉండేవి… 8 ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తూ బావిలో పడ్డాడు వాటితోపాటు… అవి చనిపోయాయి, ఆయన లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు… వాటి అస్థికలనూ అలాగే భద్రపరిచి పెట్టాడు ఇన్నాళ్లూ…
(ఇదీ ఆ సోదరులు ఆ ఎడ్ల పెద్ద కర్మ కోసం ముద్రించిన శోక పత్రికలు… ఆ ఎడ్ల ఫోటోలు కూడా పెట్టి, మనం పెద్ద కర్మ పత్రికలను ముద్రిస్తుంటాం కదా, అచ్చు అలాగే ముద్రించి పంపిణీ చేశారు…)
ఇప్పుడు మరణించి రెండు ఎడ్ల అస్థికలతోపాటు పాత రెండు ఎడ్ల అస్థికలకూ ఆదివారం పిండప్రదానం నిర్వహించారు సోదరులు… ‘‘వాటిని లేగదూడల స్టేజ్ నుంచీ చూశాం, వాటితోపాటు మేమూ పెరిగాం… 30 ఏళ్ల బంధం మాది… క్రమేపీ అవి మా కుటుంబసభ్యులే అయ్యాయి… మొదట శ్యామా మరణించింది, తరువాత మానా… రెంటికీ కలిపే సనాతనధర్మం ప్రకారం అన్ని కర్మలూ నిర్వహించాం…’’ అంటున్నాడు భవానీ సింగ్…!!
Share this Article