Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

క్యాస్టింగ్ కౌచ్ సరే… ఛాన్సులు ఇప్పిస్తే పారితోషికంలో కమీషన్ అట..!

January 30, 2025 by M S R

.

కొంచెం కత్రినా కైఫ్ ఫీచర్స్ ఉండే నటి ఆమె… చేసినవి కొద్ది సినిమాలే… కానీ హిందీలో కాస్త తెలిసిన మొహమే… పేరు ఫాతిమా సనా షేక్…

ఆమధ్య వచ్చిన శామ్ బహదూర్‌లో ఇందిరాగాంధీ పాత్ర చేసి మెప్పించింది కూడా… ఒకప్పుడు బాలనటి… ముంబైలోనే పుట్టి పెరిగింది… దంగల్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ వంటి చిత్రాలే కాదు, ఓ తెలుగు సినిమా కూడా చేసిన అనుభవం ఉంది…

Ads

ప్రస్తుతం నాలుగైదు హిందీ సినిమాలు చేతిలో ఉన్నాయి… పర్లేదు, కెరీర్ బాగానే నడుస్తోంది… తల్లిది శ్రీనగర్, తండ్రిది జమ్మూ… ఫోటోగ్రఫీలో నైపుణ్యం ఉంది… మ్యూజిక్ వీడియోలు, టీవీ సీరీస్… ఏ చాన్స్ వస్తే అది…

నిన్నో మొన్నో ఎక్కడో మాట్లాడుతూ… తెలుగు నిర్మాతల క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది… అవకాశం ఇస్తే ఎవరెవరితో గడపాలో కూడా ఓ నిర్మాత పేర్లు చెప్పాడట… తెలుగు ఫీల్డ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి నిర్మాతలు స్వేచ్ఛగా, స్ట్రెయిట్‌గా అడిగేస్తారనీ, ముందుగానే షరతులు పెట్టేస్తారనీ చెబుతోంది…

సరే, కొందరు బయటపడతారు, కొందరు లోలోన దాచుకుని, భయపడి, బయటికి చెబితే తొక్కేస్తారనుకుని భరిస్తుంటారు.,. పదే పదే చెప్పుకునేదే కదా సినిమా ఫీల్డులో ఆడదాన్ని ఎలా అంగడి సరుకుగా ట్రీట్ చేస్తారో…

ఆ నిర్మాత ఎవడో ఆమె వెల్లడించలేదు గానీ… ఆ క్యాస్టింగ్ కౌచ్ విషయంకన్నా మరో అంశమే కాస్త ఆసక్తికరం అనిపించింది… ముంబైలో కొత్త తారల్ని హిందీలో గానీ, ఇతర భాషల్లోకి పరిచయం చేస్తే, వాళ్లకు ఇచ్చే పారితోషికం నుంచి 15 శాతం వరకూ రెఫరెన్స్ పేరిట కేస్టింగ్ డైరెక్టర్స్ లాగేసుకుంటారట…

ఇది మరో దోపిడీ అనలేమేమో… అది వాళ్ల కమీషన్… అది వాళ్ల వృత్తి… ఒకసారి ఈ తారలు ఆయా భాషల్లో క్లిక్కయ్యాక వాళ్ల సొంత మేనేజర్లే తదుపరి చాన్సుల్ని డీల్ చేస్తుంటారు… నిజానికి ఈ క్యాస్టింగ్ కౌచ్, రెఫరెన్స్ కమీషన్లు ఎట్సెట్రా అన్నీ తెలిసే బోలెడు మంది ఈ ఫీల్డులో మంచి అవకాశాల కోసం ప్రయాసపడిపోతూనే ఉంటారు… వీళ్ల అవసరాన్ని ఇక అందరూ దోపిడీ చేసేవాళ్లే… ఈసారి ఫాతిమా చెప్పింది, అంతే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక అంబానీ ఎదుగుదల..! కుబేర చూస్తుంటే ఏమీ గుర్తుకురాలేదా..?
  • పుడితే ఒక్కటి, చస్తే రెండు… అసలు ఆ మాటలో అర్థమేమిటో తెలుసా..?!
  • హీరో భారీ ఫోటోలతో హీరోయిన్ రొమాన్స్… విజయశాంతి ఆరబోత…
  • నగరం వదిలేశాడు… సొంతూరు చేరాడు… ఆ పల్లెకు మళ్లీ జీవకళ తెచ్చాడు…
  • మరీ సిల్క్ స్మిత మీద ప్రతీకారం, అదీ పునర్జన్మతో… నచ్చలేదు..!!
  • బనకచర్ల సినిమా కథలో మరో పెద్ద ట్విస్టు…! బస్తర్ టు బనకచర్ల..!!
  • జూన్ 20… నిజంగానే ఈ దినానికి ఇండియన్ క్రికెట్‌లో పవిత్రత ఉందా..?!
  • భార్యా చైతన్యవతీ శత్రు..! నిజమేనా..? స్త్రీలు అంత ప్రమాదకారులా..?!
  • ఓ మేనత్త కథ… ఓ కుటుంబ కథ… సొంత బిడ్డలూ కానని దుఖపు కథ…
  • వాడెప్పుడూ పాకిస్తానీ స్నేహితుడే… మనమెందుకు సాగిలబడుతున్నాం…!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions