Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

150 ఏళ్ల నాటి చట్టాలకు స్వస్తి… ఈ కొత్త నేరచట్టాల్లో ఏముందసలు..?

July 1, 2024 by M S R

అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు…. అమల్లోకి వచ్చిన ఈరోజు నుండి పలు పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదు… 150 ఏళ్ల తర్వాత మారిన బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు…

ఇండియన్ పీనల్ కోడ్- IPC స్థానంలో భారతీయ న్యాయ సంహిత- BNS.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌- CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- BNSS.. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌- IEA స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం- BSA చట్టాలు..

భారతీయ న్యాయ సంహిత చట్టంలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం పదం… ఎవరైనా అరెస్టయితే 14 రోజుల్లోపు మాత్రమే కస్టడీ కోరే ఛాన్స్… 60 రోజులల్లో తీర్పు, 40 రోజుల్లో అభియోగాలు నమోదు..

Ads

ఏడేళ్లకు పైగా శిక్ష పడే ఛాన్స్ అయితే ఫోరెన్సిక్‌ నిపుణులచే ఆధారాలు సేకరించాలి… 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు… 24 గంటల్లోనే FIR నమోదు చేయాలి… 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి…

అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి.. ఆ బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లోనే సిద్ధం చేయాలి..  పిల్లలను కొనడం, అమ్మడాన్ని కూడా కొత్త చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం..

మైనర్‌పై సామూహిక అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా మరణశిక్ష.. చరాస్తులను, స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం.. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలి.. బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి.. మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి..

అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా కేసు.. పోక్సో కేసుల్లో మాత్రం బాధితురాళ్ల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయవచ్చు…

క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్‌ సిస్టం సీసీటీన్స్… దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లు అనుసంధానం.. డిజి లాకర్‌ను ఇంటర్ ఆపరబుల్‌ క్రిమినల్ జస్టిస్ సిస్టం ICJSకు అనుసంధానం.. ఆధారాలు ఎవరూ కూడా మాయం చేయలేని వ్యవస్థ రూపకల్పన..

అనుమానాస్పద వస్తువులు జప్తు చేసినప్పుడు 48 గంటల్లో కోర్టులో సమర్పించాలి.. బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు.. ఫిర్యాదుపై పోలీసులు 3 రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాల సేకరణ..

మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, దివ్యాంగులు, 15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు తాము ఉండే చోటే పోలీసుల సాయం.. దర్యాప్తు, న్యాయవిచారణ సమన్లు SMS ద్వారా జారీ..

గెజిటెడ్ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం.. బాధితులకు, నిందితులకు ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఫ్రీ… పోలీస్ రిపోర్ట్, ఛార్జిషీట్‌, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్ల 2 వారాల్లో పొందే ఛాన్స్…

(ఈ వివరాల్ని ఎవరో క్రోడీకరించారు… వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతోంది… ఈ కొత్త నేరచట్టాల న్యాయన్యాయాలు, తప్పొప్పుల సమీక్షలోకి పోవడం లేదు ఇక్కడ… ఒక సమాచారంగా మాత్రమే ముచ్చట పాఠకులకు షేర్ చేయడం ఇది…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions