అయితే 1984 లో స్వాతి తన తల్లికి పెళ్లి చేసే ప్రయత్నంలో ప్రకటించిన ధైర్యం, చూపిన తెగువ ఇక్కడి కూతురిలో లేకపోవడం నాకెందుకో నచ్చలేదు. నిజానికి చివరికి కూతురే ఆ ఇద్దరినీ కలిపినప్పటికీ ఒక వ్యక్తి పట్ల తన ఇష్టాన్ని తల్లి కూతురితో స్పష్టంగా చెప్పినప్పుడు ఆ కూతురు సానుకూలంగా స్పందించక నిరసన వ్యక్తం చేయడం బాలేదు. అలగడం యాగీ చెయ్యడం, నీవల్ల నా బ్రేకప్ అయిందని తల్లిని నిందించడం బాలేదు. మలయాళీలు విప్లవాత్మక ప్రకటనలు చేయడానికి సిద్ధంగానే ఉంటారు కానీ ఇక్కడెందుకో కొంచెం వెనకడుగేసినట్టనిపించింది. తల్లిని అర్ధం చేసుకోవడానికి ఆ కూతురుకి చాలా కాలం పడుతుంది. 1984 కీ 2019 కీ ఈ తేడా ఉండడం మన తిరోగమనమా మన పలాయనమా మన సంస్కృతీ ఉద్ధరణా? ఏమో? శోభనకు ఫుల్ మార్కులు. సురేష్ గోపికీ అంతే. కల్యాణి, మోహిని అందరూ బాగా చేసారు. దుల్కర్ నిర్మాతే అయినప్పటికీ చిన్న పాత్రే వేసాడు. అక్కడక్కడా లాగ్ అవుతది. పర్లేదు చూడండి. సఫర్ కా ఫల్ మీఠా!
Share this Article
Ads