.
Mohammed Rafee
……. భారత ఉప రాష్ట్రపతి పదవి ఊ అంటే చంద్రబాబుకే అవకాశం… కానీ ఆయన చూపు రాష్ట్రపతి పీఠం వైపు… నితీష్ వద్దంటే ఓం బిర్లాకే… అదే జరిగితే స్పీకర్ గా పురందేశ్వరికి ఛాన్స్…
భారత ఉప రాష్ట్రపతి పదవి మళ్ళీ తెలుగు వారి తలుపులు తడుతోంది! రెండేళ్ల పదవీ కాలం ఉండగానే ధన్‌ఖడ్ తో రాజీనామా చేయించి, ఇప్పుడు రాజకీయ చదరంగం ఆడుతోంది బిజెపి! మరోవైపు ధన్‌ఖడ్ రాజీనామా ఉదంతం మర్యాదగా లేదని, ఉప రాష్ట్రపతిని ఇంత అవమానంగా సాగనంపుతారా అని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది!
తెలుగు వారిలో ఇద్దరు నేతల వైపు ఉప రాష్ట్రపతి పదవీ పీఠం ఎదురు చూస్తోంది! సరే అంటే వెంటనే నారా చంద్రబాబు నాయుడును ఆ పీఠంపై కూర్చోబెడతారు! కానీ, ఆయనకు ఇష్టం లేదు! గతంలో నేను చెప్పినట్లు ఆయన చూపు రాష్ట్రపతి పీఠం వైపు మాత్రమే వుంది! ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా సంతృప్తిగానే ఉన్నారు!
Ads
- అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కూడా అవకాశం వుంది! అయితే ఇక్కడ షరతులు వర్తిస్తాయి! కారణం ఆయన పార్టీకి ఒక్క ఎంపి కూడా లేరు! కానీ, తెలంగాణ లో 2029 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది! అలా రావాలంటే ఆ పార్టీకి బలమైన నేతలు కెసిఆర్ లేదా రేవంత్ రెడ్డి అవసరం వుంది!
లాక్కోవడం బిజెపికి చిటికె వేసినంత సులభం! కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ మచ్చ వెంటాడుతుందేమో అని ఆలోచనల్లో పడ్డారు! బిఆర్ఎస్ పార్టీని బిజెపిలో విలీనం చేస్తే కెసిఆర్ కు ఉప రాష్ట్రపతి లభిస్తుంది!
- బిజెపి ఇక్కడ అధికారంలోకి వస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనే కండిషన్ ను కెసిఆర్ పెట్టే అవకాశం కూడా వుంది! ఇదే జరిగితే అదే సమయంలో తిరిగి టిఆర్ఎస్ పార్టీ కవిత ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే అవకాశమూ వుంది!
రేవంత్ రెడ్డి ఇప్పట్లో పార్టీ మారడు! తదుపరి ఎన్నికల్లో బలాబలాలను బట్టి మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది! ఆయన పట్ల కేంద్రంలో ఉన్న బిజెపి మంత్రులు చాలా సానుకూలంగా ఉన్నారు! అడిగిందే తడవు అప్పాయింట్మెంట్స్ ఇస్తున్నారు. కోరిందే తడవు వరాలు కురిపిస్తున్నారు!
అధికారంలోకి వచ్చాక ఆయనకు ఇవాళ 49వ ఢిల్లీ ట్రిప్! ఈ పర్యటనల్లో కాంగ్రెస్ హై కమాండ్ కన్నా ఎక్కువగా బిజెపి మంత్రులనే కలిశారు.
మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారా…? ఒకవేళ ప్రస్తుతం జనంలో ఉన్న అసంతృప్తి ఇలాగే కొనసాగితే కావలసిన సీట్లు తగ్గుతాయి! అప్పుడే ఈక్వేషన్స్ మారతాయి!
- ఒకవేళ ఉప రాష్ట్రపతి తెలుగు వారు వద్దనుకుంటే బీహార్ నుంచి నితీష్ కుమార్ కు అవకాశం వుంది! ఆయన వద్దనుకుంటే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఉప రాష్ట్రపతి పదవి లభించవచ్చు. ష్… నితిన్ గడ్కరీ పేరు చాలా ఈక్వేషన్లలో ఫిట్ అవుతుంది… చూడాలిక…
ఒకవేళ ఓం బిర్లా ఆ పదవికి వెళితే స్పీకర్ గా దగ్గుబాటి పురందరేశ్వరికి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి రానున్న వారంలో రాజకీయాలు వేడెక్కనున్నాయి! – డా. మహ్మద్ రఫీ
Share this Article