Jagannadh Goud………………. రెండవ భాగం: కరోనా గురించి ప్రశ్నలు – సమాధానాలు
31. కోవిడ్ వచ్చి పోయింది, ఇప్పుడు వ్యాక్సిన్ వేపించుకోవచ్చా ?
సమాధానం: యస్, వేపించుకోవచ్చు. బూస్టర్ డోస్ లా పనిచేస్తుంది.
32. మొదటి డోస్ వేపించుకున్నాక కొన్ని రోజులకి కోవిడ్ వచ్చి ఇప్పుడు తగ్గింది. సెకండ్ డోస్ వేపించుకోవచ్చా..?
సమాధానం: యస్, ఖచ్చితంగా వేపించుకోవచ్చు.
33. టీకా మాత్రమే 100% రక్షణ ఇస్తుంది అని కొందరు డాక్టర్స్ మాట్లాడుతున్నారు, ఇంకొందరు టీకా వలన ఉపయోగం ఏమీ ఉండదు అంటున్నారు, ఏది కరక్ట్?
సమాధానం: రెండూ తప్పే. వ్యాక్సిన్ వేపించుకుంటే అది వైరస్ ని చంపదు కానీ మన శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి చేస్తుంది, టీకా వలన చాలా మేలు జరుగుతుంది కానీ దానివలన మాత్రమే 100% రక్షణ అనేది తప్పు.
34. కరోనా ఉధృతి బాగా పెరిగింది అంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
సమాధానం: నిజానికి కరోనా ఉధృతి ఏమీ పెరగలేదు. జనాల నిర్లక్ష్యం పెరిగింది, ప్రభుత్వాల నిర్లక్ష్యం పెరిగింది, అధికారుల నిర్లక్ష్యం పెరిగింది. అందుకే కరోనా కేసులు ఎక్కువ పెరిగి కరోనా వ్యాప్తి బాగా పెరిగినట్లు కనిపిస్తుంది.
35. కరోనా లేదు ఏమీ లేదు, వ్యాక్సిన్ కంపనీల వ్యాపారం కోసమే ఎక్కువగా ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారు అన్న వాదన పై మీ వ్యాఖ్యానం ఏమిటి?
సమాధానం: అలాంటివాళ్లు కొందరు ఎక్కడైనా ఉంటారు. అలాంటి వారి మాటలు, వ్యాఖ్యానాలపై నో కామెంట్స్.
36. కరోనా గాలి వలన కూడా వస్తుంది అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి ?
సమాధానం: కరోనాని పక్కన పెట్టండి. సాధారణ జలుబు వచ్చిన వ్యక్తి మీరూ ఆరు బయట దూరంగా కూర్చుని 2 గంటలు మాట్లాడి చూడండి. మీకు జలుబు రాదు కానీ క్లోజ్ చేసిన ఏసీ గదిలో కూర్చొని 20 నిమిషాలు మాట్లాడండి, ఆ జలుబు మీకు కూడా రావటానికి అవకాశం ఉంటుంది. కరోనా కూడా అంతే.
37. పిత్తు వలన, సంభోగం వలన వస్తుందా?
సమాధానం: కొన్ని TV లు, మరికొన్ని పత్రికలు, కొందరు డాక్టర్స్ వాళ్ళ నోటికి వచ్చినది వాళ్ళు వాగుతారు. వాళ్ళ వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉంటై. అది పక్కన పెడితే పేపర్ వలన వస్తుందా, పిత్తు వలన వస్తుందా, కూరగాయల వలన వస్తుందా, సంభోగం వలన వస్తుందా, ఫ్రూట్స్ వలన వస్తుందా…. ఇలా వందలు, లక్షలు మాట్లాడుకోవచ్చు. కరోనా అనేది అతి సూక్షమైన చిన్న ఇటుక పెల్ల. స్వతహాగా దానికదే కదలదు, మెదలదు. మనమే దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్తున్నాం. శరీరంలోకి వెళ్ళిన తర్వాత కూడా దానికదే విభజన జరిగి కొత్త కరోనా పిల్లలు రావు. మన శరీర సెల్స్ ని హైజాక్ చేసి మన కణాలతో కలిసి దాని కణాలని పెంచుకొని కొత్త కరోనా పిల్లలని తయారు చేస్తుంది. సో బేసిక్ గా ఏ ఆబ్జెక్ట్ వలన అయినా కరోనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వస్తుంది. ఫలానా వలన మాత్రమే వస్తుంది లేదా ఫలానా వలన రాదు అని చెప్పటం కరక్ట్ కాదు.
38. వ్యాక్సిన్ వలన వచ్చిన యాంటీ బాడీస్ ఎన్ని రోజులు ఉంటై?
సమాధానం: మనిషికీ మనిషీ తేడా ఉంటుంది. వారి వారి హెల్థ్ ప్రొఫైల్స్, వయస్సు, ఆహారం తీసుకునే విధానం మొదలగు వాటిని బట్టి ఉంటుంది. కానీ సాధారణ జవాబు చెప్పాలంటే 7 – 9 నెలలు. కొందరిలో దీర్ఘకాలం ఉంటుంది, కొందరిలో స్వల్పకాలం ఉంటుంది, నేను అన్నది ఏవరేజ్ తీసుకొని 7-9 నెలలు.
39. ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ ఉంది, వ్యాక్సిన్ వేపించుకోవచ్చా?
సమాధానం: నో. వద్దు, వేపించుకోకూడదు
40. లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ ఏదో ఒకటి పెట్టాలి అని అంటున్నారు. దీనిపై ఏమంటారు?
సమాధానం: పన్నులే ప్రభుత్వాలకి రక్తమాంసాలు. నాకు తెలిసి ప్రభుత్వాలు అవసరం అయినా కానీ లాక్ డౌన్ పెట్టవు. కానీ కర్ఫ్యూ అయినా పెట్టాల్సిన అవసరం ఉంది.
41. అసలు సెకండ్ వేవ్ ఎలా వచ్చింది?
సమాధానం: ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు లాక్ డౌన్స్ పెట్టారు. దాదాపు అన్నీ క్లోజ్ చేశారు. మెజార్టీ జనాలు జాగ్రత్తగా ఉన్నారు. ఈ మధ్య పెతోడూ నాకు అన్నీ తెలుసు కరోనా లేదు గిరోనా లేదు అని చెత్త వాగుడు మొదలు పెట్టటం, కరోనాని తక్కువ చేసి మాట్లాడి అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. అందుకే మళ్ళీ కరోనా దాదాపు అన్ని ఊర్లకి, ప్రతి చోటా వ్యాపించింది.
42. కరోనా వచ్చి తగ్గినవాళ్ళు చెప్పిన జాగ్రత్తలు వినొచ్చా?
సమాధానం: వాళ్ళ సలహాలు , సూచనలు మంచివే కానీ వాళ్ళు ఏదో చేస్తే తగ్గింది అని మనం అది మాత్రమే చేస్తే సరిపోకపోవచ్చు. అందుకే కరోనా వచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా డాక్టర్స్ సలహాలు కూడా పాటించాలి.
43. మొదటి వేవ్ కోవిడ్ లక్షణాలకి , సెకండ్ వేవ్ కోవిడ్ లక్షణాలకి తేడా ఉంటుంది అంటున్నారు. దీనిపై క్లారిటీ ఇస్తారా?
సమాధానం: మొదటి వేవ్ లో వచ్చిన వారికే సెకండ్ వేవ్ లో కూడా కోవిడ్ వచ్చి కొత్త లక్షణాలు వస్తే అప్పుడు తేడా ఉంది అని చెప్పొచ్చు. కానీ మనిషికి మనిషి కీ మరియూ కరోనా ఎఫెక్ట్ చేసిన భాగానికి సంబంధించి లక్షణాలు కనపడ్తాయి. అంతే కాని తేడాలు ఉన్నై అనేది పూర్తి కరక్ట్ కాదు.
44. కరోనా మ్యుటేషన్ చెంది కరోనా-2 వచ్చిందేమో అంటున్నారు, దీనిపై ఏమంటారు
సమాధానం: సైంటిఫిక్ గా మాట్లాడితే కరోనా వైరస్ లో 11 జీన్స్ అంటే జన్యువులు ఉన్నై. నాకు తెలిసి ప్రమాదకరమైన వైరల్ జీన్స్ అయితే ఏమీ మారలేదు, ఉత్పరివర్తనం చెందలేదు. బయట కనపడే స్పైక్స్ లో మాత్రం కొన్ని మార్పులు చెంది ఈజీగా అంటుకోటానికి అవకాశం ఉంది. ప్రస్తుతం, అందుకే ఎక్కువగా వ్యాపిస్తుంది. కోవిడ్ వచ్చిన వాళ్ళలోని కరనా వైరస్ ని జీనోం సీక్వెన్స్ చేస్తే ఖచ్చితం గా తెలుస్తుంది. బయట జనాలు, TV లు, పత్రికలు, కొందరు డాక్టర్స్ చెప్పేవి కరక్ట్ కాదు.
45. ప్రభుత్వానికి ఏమైనా సలహాలు ఇస్తారా.?
సమాధానం: చాలా ఉన్నై. కానీ ఇమ్మీడియట్ గా సినెమా హాల్స్, మాల్స్ లాంటి క్లోజ్ డ్ గా ఉండే వాటిని మూసివేయాలి. ఒకవేళ సినెమా హాల్ డోర్స్ ఓపెన్ చేసి ఆడించుకుంటానంటే ఒకే. లేదా క్లోజ్ గా ఉండే సినెమా హాల్స్ లో ఒకరికి ఇద్దరికి ఉన్నా ఆ గాలి అక్కడ అక్కడే తిరిగి కనీసం 37 మందికి రావటానికి అవకాశం ఉంది. వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ అపార్ట్మెంట్స్ లో 15 మందికి అంటిస్తారు. ఈ విధంగా సినెమా హాల్స్ లో ఒకరికి ఉన్నా అది అనేక మందికి వ్యాపించే అవకాశం ఉంది. అందుకే క్లోజ్ డ్ గా ఉండి జన సంచారం ఉండే వాటిని వెంటనే మూసివేయాలి. ఒక 6 నెలలు. మరియూ కఠిన నిబంధనలు, కర్ఫ్యూ పెట్టాలి. అన్నిటికంటే ముందు ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేయాలి.
46. ప్రపంచంలో ఎవరూ బ్లడ్ గ్రూప్స్ మరియూ కరోనా సంబంధం గురించి మాట్లాడలేదు. మీ పోస్ట్ లల్లోనే చూశాం. దీనిపై వివరణ ఏమిటి?
సమాధానం: లోతైన సబ్జెక్ట్. చిన్నగా చెప్పాలంటే O బ్లడ్ గ్రూప్ లో యాంటీ – A, యాంటీ-B అనే యాంటీ బాడీస్ ఉంటై. మరియూ O బ్లడ్ గ్రూప్ లో వైరస్ వచ్చి అతుక్కునే యాంటీజన్స్ ఏమీ ఉండవు. కానీ A బ్లడ్ గ్రూప్ కి వచ్చేసరికి యాంటీ -A యాంటీ జన్స్ ఉండి వైరస్ వచ్చి అతుక్కోటానికి అనువుగా ఉంటుంది. అందుకే అన్నీ సమానంగా ఉండి ఒకే మొతాదులో వైరస్ అంటుకుంటే O బ్లడ్ గ్రూప్ కంటే A బ్లడ్ గ్రూప్ వారికి ప్రమాదం అని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రపంచంలో దీనిపై బాగా అధ్యయనం జరగాల్సి ఉంది కానీ ఎవరికి సమయం లేదు . నాకు ఇంట్రెస్ట్ ఉన్నా అవకాశం లేదు.
47. సాధారణంగా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ?
సమాధానం:
A. మాస్క్ ధరించాలి. డబల్ మాస్క్ అయితే బెటర్. లోపల సర్జికల్ మాస్క్ దానిపై క్లాత్ మాస్క్ బెస్ట్
B. సోషల్ డిస్టన్స్ పాటించాలి
C. అవకాశం ఉంటే వ్యాక్సిన్ వేపించుకోవాలి
D. క్లోజ్ డ్ గా ఉండే సినెమా హాల్స్, మాల్స్ కి దూరంగా ఉండి వెంటిలేషన్ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఎక్కువ ఉండాలి
E. బయట ఏది టచ్ చేసినా చేతులు శుభ్రపరచుకోవాలి
F. వాడు అది అన్నాడు, వీడు ఇది అన్నాడు అని కాకుండా మీకు మీరు సైంటిఫిక్ అవగాహన పెంపొందించుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే రైట్ పర్సన్, మంచి డాక్టర్స్ చెప్పింది వినాలి
48. ఎవరెవరు వ్యాక్సిన్ వేపించుకోకూడదు?
సమాధానం: కొవాక్సిన్ వాళ్ళు, కోవీషీల్డ్ వాళ్ళు వారి వ్యాక్సిన్ మరియూ వ్యాక్సిన్ లో ఉన్న రసాయనాలని బట్టి ఎవరెవరు వేసుకోకూడదో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు . ఉదాహరణకి కొవాక్సిన్ గైడ్ లైన్స్ ప్రకారం ఇమ్మునో కాంప్రమీజ్డ్ వ్యాధులు ఉన్నవాళ్ళు, వాళ్ళు వాడిన రసాయనాలకి ఎలర్జీ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్, పిల్లలకి పాలిచ్చే తల్లులు ఇలా కొందరు వేపించుకోకూడదు అని చెప్పారు.
49. కరోనా వచ్చినా అందరికీ ఏమీ చేయకుండానే పోతుంది, పిచ్చ లైట్ అని కొందరు ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడితే వందలు, వేల మంది వాటికి లైక్ చేసి అదే కరక్ట్ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
సమాధానం: అయితే థర్డ్ వేవ్ తొందరలోనే ఉంది
50. చివరిగా ఏమి చెప్తారు ?
సమాధానం: భయపడాల్సిన అవసరం లేదు కానీ 100% జాగ్రత్తగా ఉండాలి. ఇసుమంత నిర్లక్ష్యం కూడా మంచిది కాదు
ధన్యవాదాలు
– జగన్
(సామాన్యుడు)
పూర్తి వ్యక్తిగత అభిప్రాయం)
Share this Article