.
Pardha Saradhi Upadrasta …….. స్వేచ్ఛా హక్కుల నుంచి 370 రద్దు వరకు — CJI సూర్యకాంత్ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులు!
భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ ప్రమాణం చేయడంతో, న్యాయవ్యవస్థలో ఒక ముఖ్య అధ్యాయం ప్రారంభమైంది…
హర్యాణాలోని హిసార్‌లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి, చిన్న పట్టణంలో న్యాయవాదిగా మొదలైన ఆయన ప్రయాణం దేశ అత్యున్నత న్యాయస్థానం శిఖరానికి చేరడం అద్భుతమే.
Ads
📌 కీలక తీర్పుల పూర్తి జాబితా….
1. ఆర్టికల్ 370 రద్దు — చరిత్రలో నిలిచిపోయే తీర్పు
సూర్యకాంత్ ఉన్న బెంచ్, జమ్ము & కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసిన తీర్పును సమర్థించింది.
➡️ ఈ తీర్పు దేశ రాజకీయ పటంలో పెద్ద మార్పులకు దారి తీసింది.
2. బిహార్ ఓటర్ల జాబితా — 65 లక్షల ఓటర్ల ను తీసేసిన ప్రక్రియలో తీర్పు
బిహార్ ఎన్నికల సందర్భంలో ప్రత్యేక సవరణ (SIR)లో
➡️ 65 లక్షల మంది ఓటర్లను డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించిన విషయాన్ని మద్దతు ఇస్తూ, అది RC కు రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగ హక్కు, బాధ్యత, చేసుకోండి అని చెప్పిన బెంచ్ లో ఈయన సభ్యులు.
➡️ అలాగే ఎందుకు తొలగిస్తున్నారో కారణం పెట్టీ లిస్ట్ వెబ్సైట్ లో పారదర్శంగా చెప్పండి అని EC కు సూచన చేశారు. ముందు ముందు ఈ SIR ప్రక్రియకు ఒక రకంగా కోర్టు ఆమోద ముద్ర వేసింది ఈయన బెంచే…
➡️ అలాగే ప్రశాంత్ భూషణ్ తప్పుడు తడక అఫిడవిట్ వేస్తే ఆగ్రహంతో ఊగిపోయారు ఈయన కోర్టులో.
➡️ రేప్పొద్దున సర్ ప్రక్రియ మీద ఏ కేసు వచ్చినా ఈయన వద్దకి వెళ్తుంది.
3. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ — ‘స్వేచ్ఛ అంటే బాధ్యత కూడా’ అన్న గట్టి హెచ్చరిక
ప్రముఖ పోడ్ కాస్టర్ రణ్వీర్ అలహాబాద్ vs కామెడీయన్స్ సమయ్ రైనా & టీమ్ “India’s Got Latent” కేసులో
➡️ వికలాంగులపై అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది.
➡️ ఆన్లైన్ కంటెంట్ నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించమని కేంద్రాన్ని ఆదేశించింది.
➡️ “స్వేచ్ఛా హక్కు అనేది ఇతరుల గౌరవాన్ని తొక్కే లైసెన్స్ కాదు” — అన్నది ప్రధాన సందేశం.
మరో కేసులో,
➡️ MP మంత్రి విజయ్ షా చేసిన Colonel Sofiya Qureshi పై వ్యాఖ్యలను తీవ్రంగా తిడుతూ,
“మంత్రి మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత ఉంటుంది” అని స్పష్టం చేశారు.
4. గవర్నర్‌లు & రాష్ట్రపతి — బిల్లుల ఆమోదంపై స్పష్టమైన మార్గదర్శక తీర్పు
ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో భాగమైన సూర్యకాంత్
➡️ కోర్టు గవర్నర్ / రాష్ట్రపతికి టైమ్ లిమిట్ పెట్టలేమని చెప్పారు.
➡️ కానీ బిల్లులను నిరవధికంగా పెండింగ్‌లో పెట్టే హక్కు కూడా గవర్నర్‌కు లేదని స్పష్టం చేశారు.
5. దేశద్రోహ చట్టం (సెడిషన్) — వలస పాలనా చట్టంపై బ్రేక్
కాలానుగుణంగా మారాల్సిన ఈ చట్టంపై
➡️ కొత్త FIRలు నమోదు చేయొద్దని ఆదేశం
➡️ ప్రభుత్వం రివ్యూ పూర్తి చేసే వరకు అమలు నిలిపివేత
➡️ పౌరహక్కుల దృష్టిలో ఇది అత్యంత కీలక తీర్పుగా భావించబడింది.
6. మహిళా హక్కులు — న్యాయవ్యవస్థలో మైలురాయి తీర్పులు
సూర్యకాంత్ నేతృత్వం వహించిన బెంచ్
➡️ అన్యాయంగా తొలగించిన మహిళా సర్పంచ్‌ను తిరిగి నియమించింది.
➡️ బార్ అసోసియేషన్లలో 1/3 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాలని ఆదేశించింది.
➡️ మహిళా ఆఫీసర్లకు శాశ్వత కమిషన్ విషయంలోనూ మద్దతు.
7. మోదీ సెక్యూరిటీ బ్రీచ్ — న్యాయ విచారణకు కమిటీ
2022లో పంజాబ్‌లో PM Modi convoy ఘటనపై
➡️ జస్టిస్ ఇండూ మల్హోత్రా కమిటీని నియమించిన బెంచ్‌లో సూర్యకాంత్ కీలక పాత్ర.
8. OROP — సైనికులకు న్యాయం
One Rank-One Pension పథకం
➡️ రాజ్యాంగబద్ధమైనదే, సైనికులకు హక్కుగా రావాల్సిందే అని తీర్పు.
9. Pegasus పై విచారణ — “జాతీయ భద్రత” పేరుతో ప్రభుత్వం తప్పించుకోలేదని స్పష్టం
“ప్రతి విషయాన్నీ జాతీయ భద్రతగా ప్రకటించి న్యాయపరిశీలన తప్పించుకోవద్దు” అని గట్టి సందేశం.
➡️ ముగ్గురు సభ్యుల సైబర్ నిపుణుల కమిటీ నియమించిన బెంచ్‌లో కూడా కాంత్ ఉన్నారు. తరువాత ప్రతిపక్ష నాయకుల మీద నిఘా పెట్టారు. దాని మీద సాక్ష్యాలు లేవు అని కోర్టు నిర్ధారించింది.
10. హౌస్ లోన్స్ స్కామ్ — హోమ్ బయ్యర్లకు రక్షణ
200+ హౌసింగ్ స్కామ్ కేసులపై
➡️ “బ్యాంకులు – బిల్డర్లు కలిసి ప్రజలను మోసం చేస్తున్న ప్రమాదకర ధోరణి” అని వ్యాఖ్య.
➡️ 28 కేసుల్లో CBI విచారణ ఆదేశం.
15 నెలల పదవీకాలం ఉంది, ఇంకా చాలా ప్రధావ కేసులు ఆయన వద్దకొస్తాయి… ఆయన తీర్పుల ప్రభావం దీర్ఘకాలం భారత న్యాయ చరిత్రలో నిలిచిపోతుంది….. — ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #CJI #SuryaKant #IndianJudiciary #Article370 #FreedomOfSpeech #SeditionLaw #OROP #WomenRights #CBI #Pegasus #SupremeCourt #India #JudiciaryUpdates
Share this Article