.
పత్రికల్ని నడపడానికి సాధనసంపత్తి మాత్రమే కాదు… పత్రిక అనిపించుకోవాలంటే ప్రొఫెషనల్ థరస్ట్… అంటే, వృత్తిపరమైన తృష్ణ అవసరం… క్షణక్షణం వార్తలు పలకరిస్తున్న టీవీ, డిజిటల్, సోషల్ యుగంలో పత్రికల్లో అచ్చేసే చద్ది వార్తలు ఎవరు చదవాలి..? ఈ ప్రశ్నకు జవాబును ఇంకాస్త వివరంగా వెతుకుదాం…
ఈరోజు పత్రికల్లో కనిపించాల్సిన ప్రధాన స్పోర్ట్స్ వార్తలు ఏమిటి..? పీవీ సింధు జపాన్ ఓపెన్ టైటిల్ బ్యాడ్మింటన్ టైటిల్… వన్డే సిరీస్ ఇంగ్లండ్‌కు సమర్పయామి… అర్జెంటీనాపై స్పెయిన్ విజయం, వరల్డ్ కప్ కైవసం… ఇవే కదా…
Ads
పీవీ సింధు మన తెలుగు క్రీడాకారిణి… జపాన్ ఓపెన్ టైటిల్ సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్… సో, మనం ఓన్ చేసుకోవాలి… ఎర్లీగానే వచ్చిన వార్త కాబట్టి అందరూ రాశారు… పర్లేదు, మంచి ప్రాధాన్యమే ఇచ్చారు… వన్డే సిరీస్ సమర్పయామి, రోహిత్ శతకం కూడా క్రికెట్ ప్రేమికులకు ఆసక్తి కలిగించే వార్త కాబట్టి అదీ రాశారు, మంచి ప్రాధాన్యమే ఇచ్చారు… కానీ ఫుట్‌బాల్ వరల్డ్ కప్..?
ఈనాడులో మాస్ట్ హెడ్ కింద ఫుల్ లెంత్ స్టోరీ, ఫోటోలు, ఛాంపియన్ పేజీలో వివరాలు… ఎక్స్‌టెన్సివ్ కవరేజీ కనిపించింది… (ఈ-పేపర్లు, హైదరాబాద్ ఎడిషన్ చదివాక పోలికె)… సాక్షి కూడా పర్లేదు, బాగానే కవర్ చేసింది… మరి ఆంధ్రజ్యోతి..? దానికేం తక్కువైంది..? నమస్తే తెలంగాణ కూడా నేను పత్రికనే అని చెప్పుకునే విఫలప్రయత్నం చేస్తుంటుంది కదా, దానికేం తక్కువైంది..? చివరకు ప్రజాశక్తి అనే ఓ చిన్న పత్రిక కూడా బ్యానర్ చేసుకుంది… సరే, మిగతా పత్రికల్ని వదిలేద్దాం…
సొంతంగా ప్రింటింగ్ యూనిట్లు ఉన్న పత్రికలు ఈ వరల్డ్ కప్ వార్త కవరేజ్ కోసం డెడ్‌లైన్‌ను ఎందుకు మార్చుకోలేకపోయాయి నిన్న రాత్రి..? మరీ ఆంధ్రజ్యోతిలో ఒకటికి నాలుగుసార్లు వెతికినా కనిపించలేదు… మూడో స్థానం కోసం పోటీపడిన ఫ్రాన్స్, ఇంగ్లండ్ మ్యాచ్ కవరేజీ ఉంది, అంతే… ఎప్పుడో ఓసారి అవకాశం, అవసరం వస్తుంది, దానికోసం నిరీక్షించి, అవసరమైతే డెడ్‌లైన్ మార్చి, రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని కనీసం ఫ్లాష్ ఫ్లాష్ అని కూడా వేయలేకపోతే… ఇక ఈ స్పీడ్ యుగంలో పత్రికల మనుగడ ఎలా..?
రాత్రి 12.30కు మొదలైన ఉత్కంఠ… మొదటి గంటన్నర అయిపోయి, ఫలితం తేలక, మరో అరగంట పొడిగించబడి… మధ్యలో విరామం కూడా కలిపితే… 3 గంటల దాకా హోరాహోరీ పోరు… అప్పటివరకు ఆగి, ఫోటోలు, మ్యాచ్ వివరాలను పబ్లిష్ చేసిన పత్రికలకు అభినందనలు… చేయలేని పత్రికల పట్ల సానుభూతి… అంతే… చిన్న టాస్కేమీ కాదు, కానీ లక్షల మంది నిద్ర ఆపుకుని, టీవీలకు అతుక్కుని మరీ చూసిన మ్యాచ్ అది… ప్రపంచంలోని 60, 70 దేశాలు ఉర్రూతలూగిపోయిన మ్యాచ్ అది… దాని ప్రాధాన్యం దానిదే…
ఎంతసేపూ ఎదుటి పార్టీ మీద బురద, రాళ్లు, తిట్లు, వక్రబాష్యాలు, క్షుద్ర కథనాలే కాదు… అప్పుడప్పుడూ ప్రొఫెషనలిజం కూడా కనబర్చాలనేది ఈ కథనం నీతి… కొన్ని చానెళ్లు మ్యాచ్ మొదలైన దగ్గర నుంచి స్పెయిన్ విజయోత్సవాల దాకా బ్రహ్మాండమైన కవరేజీ ఇచ్చాయి… కొన్ని ఎప్పటిలాగే ముసుగు తన్ని పడుకున్నాయి..!! (ఈ కథనంలోని అంశాలు సబ్జెక్ట్ టు కరెక్షన్స్)
Share this Article