.
అంటే అన్నాడు గానీ, ఆ ఊహ ఎంత బాగుందో అని ఓ ఫేమస్ సినిమా డైలాగ్… కెనడా మీద, దిగిపోయిన ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో మీద, ఆ ప్రభుత్వ విధానాల మీద అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అలాగే అనిపిస్తున్నాయి సగటు భారతీయుడికి…
తన స్వార్థం కోసం, తన అధికారం కాపాడుకోవడం కోసం ట్రూడో కొన్నాళ్లుగా ఇండియా మీద విషం కక్కుతున్నాడు… ఖలిస్థానీ శక్తులకు అడ్డాగా మార్చాడు ఆ దేశాన్ని… తమ పార్టీ అంతర్గత రాజకీయాలతో చివరకు కుర్చీ దిగిపోయాడు… ఈ ఇండియన్ ఎనిమీ తరువాత ప్రధాని ఎవరనేది ఇక తరువాత సంగతి…
Ads
ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా పోస్ట్ చేశాడు… అసలు కెనడా అమెరికాలో విలీనమైపోయి, 51వ రాష్ట్రంగా మారితే బెటర్ అని నిర్మొహమాటంగా, ఏ దాపరికం లేకుండా తన ఒపీనియన్ బహిరంగపరిచాడు…
అమెరికాలో కలిసిపోవడం కెనడా ప్రజలకు కూడా ఇష్టమే… ఇంకా ఇంకా రాయితీలు ఇస్తూ కెనడా కోసం మేమెందుకు నష్టపోవాలి..? అమెరికాలో విలీనమైపోతే సుంకాలు ఉండవు, పన్నులు తగ్గుతాయి… అంతేకాదు, రష్యా, చైనా షిప్పుల నుంచి ప్రమాదం కూడా ఉండదు అని వివరించాడు…
కెనడాయే కాదు, మెక్సికో మీద కూడా 25 శాతం సుంకాలు వేస్తానంటూ ఈమధ్య చెప్పాడు కదా… తరువాత ట్రూడో తనను కలిసినప్పుడు కూడా ఇదే చెబుతూ… సరిహద్దుల్లో వలసలు, డ్రగ్స్ ఆగకపోతే సుంకాలు పెంచుతాను, లేదా 51వ రాష్ట్రంగా కలిసిపొండి అన్నాడు ట్రూడోతో… అంతేకాదు, గవర్నర్ ఆఫ్ కెనడా అనీ పిలిచాడు ట్రూడోను…
సింపుల్‌గా చెప్పాలంటే… ట్రంపు బెత్తం పట్టుకుని నిలుచుంటే, తన దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డాడు ట్రూడో… ఇలాంటి విషయాల్లో ట్రంపు అరమరికలు లేకుండా, డిప్లొమాటిక్ సంభాషణలకు దిగడు… టఫ్, స్ట్రెయిట్… ట్రంపు ఇండియాతో సంబంధాల పట్ల కాస్త సానుకూలతతో ఉన్నా సరే, కెనడాలోని భారతీయ వ్యతిరేకత తగ్గుతుంది…
అంతేకాదు, నిజంగానే… ఒకవేళ కెనడా 51వ రాష్ట్రం అయిపోతే కెనడాలో ఉన్న ప్రవాస భారతీయులకూ నయమే… వలసలు, వీసాలు, కొలువులు, రక్షణ కోణాల్లో… ఐతే ఇది రఫ్‌గా ఓ సగటు భారతీయుడి ఆలోచన… అదీ దూరం నుంచి చూసేవాళ్లకు… ఆచరణలోని అసాధ్యతలు, సంక్లిష్టతల మాట వేరు… అందుకే మొదట్లోనే అనుకున్నట్లు… ‘‘అంటే అన్నాడు గానీ ఆ ఊహ ఎంత బాగుందో’’…
Share this Article