వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించింది… ఫిలింఫేర్ అవార్డ్ విజేతల జాబితా…
ముందు ఈ జాబితాను ఓసారి లుక్కేయండి…
ఉత్తమ చిత్రం: బలగం
Ads
ఉత్తమ దర్శకుడు: వేణు ఎల్దండి (బలగం)
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్య (హాయ్ నాన్న)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): బేబి
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబి)
ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటి: రూపలక్ష్మి (బలగం)
ఉత్తమ సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్ (బేబి)
ఉత్తమ గేయ రచయిత: అనంత్ శ్రీరామ్ (బేబి – ఓ రెండు ప్రేమ మేఘాలిలా)
ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (బేబి – ఓ రెండు ప్రేమ మేఘాలిలా)
ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (సార్ – మాస్టారు మాస్టారు)
ఉత్తమ నృత్య దర్శకుడు: ప్రేమ్ రక్షిత్ (దసరా – ధూమ్ ధామ్ దోస్తాన్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సత్యన్ సూరన్ (దసరా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్ల అవినాష్ (దసరా)
చిన్నాచితకా సంస్థలు ఇచ్చే అవార్డుల దగ్గర నుంచి ఆస్కార్ దాకా… అవార్డుల ఎంపికలో అనేక రాగద్వేషాలు, ఆర్థిక ప్రయోజనాలు, ప్రలోభాలు, పైరవీలు, లాబీయింగ్ గట్రా పనిచేస్తుంటాయి… ప్రత్యేకించి ప్రభుత్వం ఇచ్చే అవార్డులయితే మరీనూ… అన్నీ మరీ స్కోచ్ అవార్డుల్లాగే అయిపోయాయి… నాటునాటు పాటకు లాబీయింగుతో రాజమౌళి అవార్డు తెప్పించుకున్నాక ఆ ఆస్కార్ విలువ ఏమిటో కూడా తెలిసిపోయింది…
కానీ ఫిలిమ్ ఫేర్ అవార్డులకు కొంత విలువ ఉంది చాన్నాళ్లుగా… అఫ్‌కోర్స్, ఈ అవార్డులనూ ప్రభావితం చేసే అంశాలు ఉండవచ్చుగాక, కాదని కొట్టిపారేయలేం, కానీ స్థూలంగా కొంత రీజనబుల్ ఎంపికలే అనిపిస్తాయి… ఈసారి ప్రకటించిన తెలుగు సినిమాల్లో బలగం సినిమాకు ఉత్తమ సినిమా అవార్డు రావడం సరైన ఎంపికే… క్రిటిక్స్ బేబి సినిమాను ఎంపిక చేసినా బలగంతో పోలిస్తే దాని రేంజ్ తక్కువే…
ఎందుకంటే… బలగం సినిమాలో కుటుంబబంధాల విలువను మనిషి అంత్యక్రియలకు జోడించి దర్శకుడు చెప్పిన తీరు బాగుంటుంది… అనేక ఊళ్లల్లో జనం సామూహిక ప్రదర్శనలు ఏర్పాటు చేసుకుని, కన్నీళ్లు పెట్టుకున్నారు… ఒక సినిమా ఈ ఉద్వేగం కలిగించడం, కదిలించడం అసాధారణం… దసరాలో హీరో కేరక్టరైజేషన్, హింస తదితరాలు చికాకు పుట్టిస్తాయి… నాని, కీర్తి సురేష్‌లకు ఉత్తమ నటీనటుల అవార్డులు రావడం వాజీబే… ప్రత్యేకించి నానికన్నా కీర్తి బాగా చేసింది…
క్రిటిక్స్ జాబితాలో ఉత్తమ నటుడిగా ప్రకాష్ రాజ్‌కు అట… ప్చ్, నిజానికి బ్రహ్మానందం బాగా చేశాడు, అదే సినిమాలో… ప్రకాష్ రాజ్ అదే మొనాటనీ… బేబి సినిమాకు చాలా అవార్డులు వచ్చాయి గానీ పరిగణనలోకి తీసుకోవడానికి వేరే మంచి సినిమాలు కనిపించకపోవడం దానికి అనుకూలించిందేమో… ఎటొచ్చీ, నటనను ఏనాడో మరిచిన మన మహానటులు, స్టార్ తారలకు, సోకాల్డ్ పెద్ద పెద్ద సినిమాలకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడం బాగనిపించింది…!! తమిళంలో కూడా చిత్త అనే సినిమా చాలా అవార్డుల్ని గెలుచుకుంది…
Share this Article