Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ స్వర జతుల నడుమ… జబర్దస్త్ తరహా రోత స్కిట్లు దేనికి..? ఆ డాన్సులెందుకు..?!

August 8, 2022 by M S R

కాస్త తాపీగా చదవాల్సిన స్టోరీ ఇది… ఓ క్రమపద్ధతిలో… టీవీల్లో తెలుగు సినిమా పాట స్థానమెంత..? ఎంత అని అడుగుతారేమిటండీ…? ఆ పాటలు, పాటలకు తగిన గెంతులు, చివరకు సీరియళ్లలోనూ అవే పాటలు… అసలు పాటల్లేకుండా తెలుగు టీవీ ఎక్కడిది..? ఆ పాటలో ఏముంది..? ఆ పాట సందర్భమేమిటి..? ఔచిత్యమేమిటి..? అనేది ఎవడికీ అక్కర్లేదు…

అది ఏ షో అయినా సరే… బ్యాక్ గ్రౌండ్ నుంచి పాట వినిపిస్తూ ఉండాలి… జడ్జీలు, కంటెస్టెంట్లు, కమెడియన్లు, ఆర్టిస్టులు, సింగర్స్… ఎవరైనా సరే పిచ్చి గెంతులు వేస్తూ, వాటినే డాన్సు అని వాళ్లలో వాళ్లే చప్పట్లు కొట్టుకుంటూ… స్టేజీ మీదకు రావల్సిందే… చివరకు చిన్న చిన్న సందర్భాల్లో కూడా ఆ పాటలు తప్పవు, ఆ గెంతులు తప్పవు… సరే, అది మన ఖర్మ అనుకుందాం… పోనీ, ఆ పాటలకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ షో అయితే..?

అప్పట్లో బాలు పాడుతా తీయగా షో చేసేవాడు… తెలుగులో కొత్త గాయకులు వచ్చేయడం, సంగీత దర్శకులు బాలును విస్మరించడంతో ఆయనకు కూడా పెద్దగా పనేమీ లేక, రామోజీరావును కన్విన్స్ చేసి ఈటీవీలో ఆ షో స్టార్ట్ చేశాడు… కానీ కొన్ని ప్రమాణాలు, విలువలకు కట్టుబడ్డాడు… ట్రాకులకు పాడించేవాడు కాదు, లైవ్ ఆర్కెస్ట్రా వాడేవాడు… ప్రతి ఎపిసోడ్‌కు ఒక సినిమా గెస్టు… వాళ్ల అనుభవాలు, పాటకూపాటకూ నడుమ బాలు చెప్పే సినిమా పాటల పాత సంగతులు అందరికీ పాఠాలు… ప్రేక్షకులకు కూడా…! అన్నింటికీ మించి పోటీలకు వచ్చే గాయకులకు సున్నితంగా వాళ్లు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో వివరించి, అవి టీవీల ముందు కూర్చుని చూసే రసప్రేక్షకులకూ కనెక్టయ్యేలా చెప్పేవాడు…

Ads

ఆ షోను కొట్టింది లేదు… తరువాత మాటీవీ రేలారేరేలా వంటి ప్రోగ్రామ్స్, సూపర్ సింగర్ షోలు చేసింది… రేలారే ఫార్మాట్ వేరు, దాని కేరక్టర్ వేరు… దాన్ని కూడా సాంగ్స్ అనే బేసిక్ థీమ్ నుంచి డీవియేట్ కానివ్వలేదు… ఇక పలు సూపర్ సింగర్ షోలు కూడా పాట నాణ్యత, పరిశీలన, మార్కులు అనే ఫార్ములాను దాటి పోలేదు… కానీ రోజులు మారాయి… డాన్సులు గానీ, క్విజ్జులు గానీ, సరదా కిట్టీ పార్టీలు గానీ కామెడీ స్కిట్లను జతచేయడం మొదలైంది కదా… తెలుగు సినిమా పాటల టీవీ షోలలోకి కూడా దూరాయి…

గ్రాండియర్ పేరిట జీతెలుగు వాడు సరిగమ షోను దారుణంగా దెబ్బతీశాడు… బోలెడు మంది జడ్జిలు, మెంటార్లు, రెండు ఇంచుల మందం పూతలు, నడుమ నడుమ కంటెస్టెంట్ల మీద కూడా యాంకర్ ప్రదీప్ స్పాంటేనియస్ కామెంట్లు, వాటిల్లోని శ్లేషలు… ఇలా వినోదమే ప్రధానమై పోయింది… పాట పక్కదారి పట్టింది… ఎవరు ఎలా పాడినా సరే, ఆహా ఓహో అని డప్పు కొట్టడమే జడ్జిల బాధ్యత… అంతకుమించి ఇంకేమీ లేదు… ఆర్కెస్ట్రా బదులు ట్రాకులు వినిపిస్తూ పాడించసాగారు… ఇక కంటెస్టెంట్లు ప్రయోగాలు చేయడానికి ఏముంది..? తప్పొప్పుల పరిశీలన ఏముంది..? సో, తెలుగు సినిమా పాటల్లోనే డొల్ల సాహిత్యం కదా… ఆ డొల్లతనం టీవీ మ్యూజిక్ కంపిటీషన్ షోలలోకి మరింత భీకరంగా ప్రవేశించింది…

కొంచెం బెటర్… ఆహాలో ఇండియన్ ఐడల్ తెలుగు పేరిట షో చేశారు… నిత్య, సింగర్ కార్తీక్‌తోపాటు సంగీత దర్శకుడు థమన్ జడ్జిలు… మరో సింగర్, హిందీ ఇండియన్ ఐడల్ విజేత రామచంద్ర హోస్ట్… 12 మంది మంచి ప్రతిభ కలిగిన కంటెస్టెంట్లు దొరికారు… ఓ చిన్న ఆర్కెస్ట్రా టీం… మంచి మ్యూజిషియన్స్… ఒక ఎపిసోడ్‌లో మ్యూజిషియన్స్‌తో వాళ్ల ఇన్‌స్ట్రుమెంట్స్‌తో సింగర్స్‌కు కంపిటీషన్ పెట్టారు… అవీ ప్రయోగాలు అంటే… ఆర్కెస్ట్రాను కూడా గౌరవించడం అంటే… అంతేకాదు, ఒకవైపు సింగర్స్‌ను అభినందిస్తూనే… పలుసార్లు వాళ్ల తప్పొప్పుల్ని థమన్, కార్తీక్ ప్రస్తావించడానికి ఏమాత్రం ఇబ్బందిపడలేదు…

super singer

ఇక పరాకాష్ట ఏమిటంటే… మాటీవీలో వచ్చే సూపర్ సింగర్ జూనియర్స్ షో… ఒకప్పుడు ఉర్రూతలూగించిన సూపర్ సింగర్ షోయేనా ఇది అనిపించేలా భ్రష్టుపట్టించేస్తున్నారు… నిజానికి సుడిగాలి సుధీర్ హోస్టింగ్ వాళ్లకు ఓ అస్సెట్… అనసూయ సోసో… ఎలాగూ వాళ్లను అధిక రేట్లకు పట్టుకొచ్చాం కదాని వాళ్లతో జబర్దస్త్ తరహా స్కిట్లు చేయిస్తున్నారు పాటల నడుమ… అదీ పిల్లల సంగీతంలో… దారుణం….

ప్రతి పాటకు మధ్య ఓ స్కిట్… సరే, కొంత వినోదం పాలు ఉంటే తప్పేమిటి అనుకుందాం… సంక్షిప్తంగా వినోదం, హాస్యం ఉంటే పర్లేదు… కానీ అదే ప్రధానమైపోతే..? పాట పక్కకుపోతే..? దాన్ని ఏమనాలి..? భ్రష్టుపట్టిన పాట అనాలి…! ఆదివారం ఆ షో చూస్తే జాలేసింది… పిల్లలు పాట పాడుతుంటే వెనుక టీవీ సీరియళ్లలోని జంటలతో డాన్సులు చేయించారు… ప్రొఫెషనల్ డాన్సర్లతో గంతులు వేయించారు… యాంకర్లు పాడుతున్నారు… ఎవరెవరో పాడేస్తున్నారు…

ఫినాలే లేదా ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు కాస్త ఎక్కువ వినోదాన్ని అద్దడంలో అభ్యంతరాలు ఉండాల్సిన పనిలేదు… కానీ అసలు ప్రోగ్రామ్ బేసిక్ కేరక్టరే భ్రష్టుపడితే దాన్నేమనాలి..? ఈ సంగీత పోటీల కార్యక్రమాల్లో సైతం అప్పుడప్పుడూ యాంకర్లు చెత్తా డ్రెస్సులు వేసుకుని రావడం మరో దరిద్రం… సంగీతం, ఆ రస స్పృహ పూర్తిగా శూన్యమైపోయిన ఓ సంగీతకార్యక్రమం… సూపర్ సింగర్స్ జూనియర్స్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions