.
నిన్నటి ఒక ఫోెటో మనసుల్ని బరువెక్కించేది… సున్నిత మనస్కులైతే కన్నీళ్లు పెట్టించేది… ఈమధ్య కాలంలో ఇలాంటి ఫోటో చూడలేదు… అనగా ఆ దృశ్యం… వైరల్ వీడియో బిట్ కూడా…
.
Ads
ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్‌లో ఉన్న ఓ మహిళ… ఆమె వింగ్ కమాండర్… పేరు అఫ్షాన్ అఖ్తర్… కన్నీళ్లు ఆపుకుంటోంది… కర్తవ్య నిర్వహణలో భావోద్వేగాలను నియంత్రించుకోవాలి… కానీ కోల్పోయింది భర్తను… తన ఆశల్ని, కలల్ని…
ఆ భర్త పేరు నమాంశ్ స్యాల్… మొన్నటి తేజస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మన పైలట్… ఒక ఫైటర్ పైలట్‌ను తీర్చిదిద్దడానికి దేశం చాలా కష్టపడాలి, ఖర్చుపెట్టాలి… ఆ సాహసులు దొరకాలి, ఆ నైపుణ్యానికి పదును పెట్టాలి…
తీరా ఓ ప్రమాదంలో కోల్పోవాల్సి రావడం ఆ కుటుంబానికే కాదు, దేశానికీ నష్టమే… భార్యాభర్తలిద్దరూ ఎయిర్‌ఫోర్స్ కీలక వ్యక్తులే… ఆరేళ్ల బిడ్డ వాళ్లకు… పేరు ఆర్య… పఠాన్‌కోట్‌లో ఎయిర్‌ఫోర్స్ శిక్షణ క్యాంపులో ఆ భార్యాభర్తలిద్దరికీ పరిచయం, అది పెళ్లి దాకా దారి తీసింది…
నమాంశ్ తండ్రి కూడా ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి రిటైరయ్యాడు… మొత్తం కుటుంబం దేశసేవలోనే… ఆ ఫోటో విషయానికి వద్దాం…
ఆమె భర్తకు చివరి శెల్యూట్ సమర్పించాలి… కన్నీళ్లు ఆపుకుంటోంది… కానీ అవి ఆగనంటున్నాయి… తన్నుకొస్తున్నాయి… వాటికి తెలియదు కదా, నియంత్రణలో ఉండాలని… ఆమె యూనిఫామ్‌లో ఉంది, పక్కన తను పొదివి పట్టుకున్న తన ఆరేళ్ల బిడ్డ… ఆ పిల్ల చేతిలో ఓ బొమ్మ… చూస్తున్న వాళ్లందరి కళ్లూ చెమర్చాయి… ఇదీ ఆ ఫోటో.,.

మిగ్ ఫైటర్లు… ఎగిరే శవపేటికలు… ఎందరో మన సాహస పైలట్లను బలిగొన్నాయి… ఈరోజుకూ అవి పూర్తిగా డీకమిషన్ కాలేదు… తేజస్‌తో వాటిని రీప్లేస్ చేయాలని దశాబ్దాలుగా మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం… కానీ మన చేతకానితనంతో… మనకంటూ లైట్ వెయిట్ అప్‌డేటెడ్ స్వదేశీ వెర్షన్ ఈరోజుకూ గగన కుసుమమే… అదీ అసలైన విషాదమే…
Share this Article