గుడ్… మంచి ఆలోచనే… వినోదం కోసం… వినూత్నంగా… పాత మూడు బిగ్బాస్ సీజన్లలో స్టార్ కంటెస్టెంట్లుగా ఉన్నవాళ్లను పట్టుకొచ్చి, ఇప్పుడు హౌస్లో టాప్ ఫైవ్ ఫైనలిస్టులుగా ఉన్నవాళ్లతో మాట్లాడింపజేయాలనే ఆలోచన గుడ్… దీంతో వచ్చేది లేదు, పోయేది లేదు… కాకపోతే ఈ ఫైనల్ వీక్ పెద్దగా హౌస్లో ఊడబొడిచేదేమీ ఉండదు… ఎలాగూ నామినేషన్లు, కెప్టెన్సీ టాస్కులు ఉండవు… ఉన్నదే అయిదుగురు… లొల్లి లొల్లి కూడా తక్కువే… కావాలని బిగ్బాస్ కైలాట్కాలు పెడితే తప్ప, పెద్దగా ఇక తగాదాలకూ చాన్స్ ఉండదు… కానీ..?
Ads
ఇప్పటికే ప్రేక్షకుడు ఎవరిని వోట్లేసి గెలిపించాలో ఫిక్సయిపోయాడు… కాదు, కాదు, బిగ్బాస్ టీం ఆల్రెడీ ఫిక్సయిపోయింది… ఇక జరిగే తంతు అంతా జస్ట్, ఓ తంతు మాత్రమే… మొదట మూడు రోజుల ఫినాలే అనుకున్నారు కానీ కేవలం సండేకు పరిమితం చేశారు… సో, నాలుగైదు రోజులు ఏదో టైంపాస్ పల్లీ యవ్వారమే…
కాకపోతే మళ్లీ ఓ బిగ్బాస్ మార్క్ వృథా షో… పాత స్టార్ కంటెస్టెంట్లతో మాట్లాడింపజేస్తే… చూసే ప్రేక్షకులకు కూడా ఎవరికి వోట్లేయాలనే విషయంలో ఇంకా క్లారిటీ రావడానికి ఉపయోగపడుతుందీ అని ఓ షో… ఇక్కడ స్టార్ కంటెస్టెంట్లు అని అనుకోవడం ఎందుకంటే..?
వీళ్లు హరితేజ, గీతమాధురి, శ్రీముఖి, ఆలీ రెజా… హరితేజ తన సీజన్లో తను దుమ్మురేపింది… ఇక గీత మాధురి, శ్రీముఖి అయితే దాదాపు విన్నర్లు… ఈ వోట్లు, ఈ ఆర్మీలు, ఈ సోషల్ దందాలు, ఈ గ్రూపులు… చివరకు విజేతలు ఎవరు అనేది వదిలేస్తే… గీత గానీ, శ్రీముఖి గానీ గెలిచినట్టే ఫీలయ్యారు ప్రేక్షకులు కూడా… రన్నరప్పులు కూడా… ఆలీ రెజా కూడా వాళ్లతో ఈక్వల్ గేమ్ ఆడాడు… టఫ్ ఫైటర్…
అందరూ రిజర్వ్డ్ టైపు కాదు… జోవియల్, ఎనర్జిటిక్… సో, ప్రజెంట్ ఫైనలిస్టులతో హంగామా ఇంట్రస్టింగే… వీళ్లే అడిగారు, వాళ్లేం చెప్పారు అనేది వదిలేస్తే… ఆ మూడు సీజన్ల విన్నర్లతో ఓసారి భేటీ ఏర్పాటు చేయిస్తే బెటరేమో బిగ్బాసూ… ఎలాగూ రాహుల్ సిప్లిగంజ్ బిగ్బాస్ టీంతోపాటే ఉన్నాడు… కంటెస్టెంటు ఎలిమినేట్ అయిపోయి బయటికి రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసేది తనే… ఇక శివబాలాజీ, కౌశల్… ట్రై చేస్తే దొరక్కపోరు… పైగా ఎవరికీ ఇప్పుడు పెద్దగా వేరే పనులు కూడా ఏమీలేవు…
కానీ దయచేసి ఒక్క పనిమాత్రం చేయొద్దు… మళ్లీ అమ్మా రాజశేఖర్, మోనాల్, కల్యాణి గట్రా కేరక్టర్లను మళ్లీ పిలుచుకొచ్చి భేటీలు మాత్రం పెట్టకు బాబూ… ఇప్పటిదాకా చావగొట్టావు, చివరలోనైనా అలాంటి ఆలోచనలు చేయకుండా, ప్రేక్షకుల్ని కాపాడు…!!
Share this Article