కుర్చీలు మడతపెట్టే మన తమన్, మన ఇతర సంగీత దర్శకుల్ని ఎవరూ గట్టిగా తగుల్కోలేదు గానీ… పాటల చౌర్యం, పాటల కాపీరైట్స్ ఇష్యూస్ కన్నడ ఇండస్ట్రీలో సీరియస్ కేసులకే దారితీస్తున్నయ్… అంత తేలికగా ఎవరినీ వదిలిపెట్టడం లేదు ఎవరూ…
రక్షిత్ శెట్టి… ఈ హీరో పేరు వినగానే రష్మిక మంథాన గుర్తొచ్చేది… తన మాజీ ప్రేమికుడు, నిశ్చితార్థం దాకా వెళ్లి పెళ్లి కేన్సిలైంది… తరువాత చార్లి 777 అనే సినిమాతో తెలుగువాళ్లకు కూడా బాగానే పరిచయమయ్యాడు తను… తను హీరోగా గత జనవరిలో ఓ సినిమా వచ్చింది… పేరు బ్యాచిలర్ పార్టీ…
అది కామెడీ ఎంటర్‌టెయినర్… ఇందులో తమ రెండు పాటల్ని తమ అనుమతి లేకుండానే వాడుకున్నారని ఎంఆర్టీ మ్యూజిక్ బెంగుళూరులో ఫిర్యాదు చేసింది… పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కూడా… “Gaalimathu” “Nyaya Ellide” పాటలు అవి… ఆ సినిమాకు నిర్మాత కూడా రక్షిత్ శెట్టే… తన సొంత నిర్మాణ సంస్థ Paramvah Studios బ్యానర్ మీదే నిర్మించాడు…
Ads
ఈ కేసు పెట్టిన నవీన్ కుమార్ పాటల కాపీరైట్స్ వ్యవహారాలు చూస్తుంటాడు… రక్షిత్ శెట్టి మీద ఇదే మొదటిసారి కాదు ఇలాంటి ఆరోపణలు రావడం… తన సూపర్ హిట్ సినిమా కిరాక్ పార్టీ సినిమాలోని ‘శాంతి క్రాంతి’ పాట మీద కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి…
మొన్నామధ్య కాంతార సినిమాలోని బ్లాక్ బస్టర్ పాట వరాహరూపం మీద కూడా కొన్నాళ్లు రచ్చ నడిచిన సంగతి తెలుసు కదా… అది తాము రిలీజ్ చేసిన నవరసం అనే పాటకు కాపీ అని పాపులర్ కేరళ మ్యూజిక్ బాండ్ థైకూడమ్ బ్రిడ్జి కోర్టుకెక్కింది… సంగీత దర్శకుడు అజనీష్‌తోపాటు హీరో రిషబ్ శెట్టి, నిర్మాత విజయ్ కిరగందూర్‌ను కూడా కేసులోకి లాగారు…
కేరళ పోలీసులు సీరియస్ కేసు పెట్టారు… కొన్నాళ్లు సినిమా నుంచి అమెజాన్ స్ట్రీమ్‌లో ఆ పాటను తీసేసి, వేరే పాటను ఇరికించాల్సి వచ్చింది… బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లారు రిషబ్, విజయ్… ఐనా ఫలితం లేక కేరళ పోలీసుల విచారణకు హాజరయ్యారు… తరువాత ఏదో మధ్యేమార్గంలో కేసు తెగినట్టుంది…
మన తెలుగు సంగీత దర్శకులు ఈకోణంలో చూస్తే లక్కీయే… చాలా ట్యూన్లు కాపీలే అని సోదాహరణంగా సోషల్ మీడియా బయట పెడుతోంది… కానీ ఒరిజినల్ సంగీత స్రష్టలు సీరియస్‌గా తీసుకోకపోవడంతో అవన్నీ కోర్టుల దాకా రావడం లేదు..!!
Share this Article