Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ తెలుగు సినిమా… దటీజ్ కృష్ణ…

May 2, 2024 by M S R

Subramanyam Dogiparthi…..   యాభై ఏళ్ళ కిందే 125 దేశాల్లో రిలీజయిన మొట్టమొదటి ఇండియన్ Pan World సినిమా మన డేషింగ్ & డేరింగ్ సూపర్ స్టార్ కృష్ణ తీసిన మోసగాళ్ళకు మోసగాడు . తెలుగు సినిమా రంగంలో సాహసాలకు , మొండితనానికి , మంచితనానికి మారు పేరు కృష్ణ . ట్రెజర్ హంట్ టైటిల్ తో ఇంగ్లీషులోకి డబ్ చేసి తీసారు . తమిళంలోకి డబ్ అయితే మొత్తం సినిమా ఖర్చు ఆరు లక్షలూ అక్కడే వసూలు అయ్యాయట . హిందీలో రిలీజయితే అక్కడా కనక వర్షం కురిపించింది . 1972 లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది .


రాజస్థాన్ లోని థార్ ఎడారి , బికనీర్ కోట , శివబాడి దేవాలయం , దేవీకుండ్ సాగర్ , సిమ్లా , కుఫ్రీ , టిబెట్ కు సమీపాన గల నార్కందా స్నోఫాల్ తో పాటు సట్లెజ్ నదీ తీరాన తట్టా పానీ ప్రాంతాల్లో , ఆల్మోస్ట్ సినిమా అంతా ఔట్ డోర్లో తీసారు . గుర్రాలు , ఛేజింగులు , సాహసాలు , అయ్యబాబోయ్ అవన్నీ కృష్ణకే చెల్లు . నేను చూసిన ఓ డజను ఇంగ్లీషు సినిమాల్లో బాగా నచ్చింది మెకన్నాస్ గోల్డ్ . ఆ సినిమా స్థాయిలో సాంకేతికంగా అద్భుతంగా నిర్మించారు దీన్ని.

కె యస్ ఆర్ దాస్ – కృష్ణల కాంబినేషన్ లక్కీ కాంబినేషన్ . వి యస్ ఆర్ స్వామి ఫొటోగ్రఫీ , ఆదినారాయణరావు బేక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఎవర్ గ్రీన్ సినిమాగా తీర్చిదిద్దింది . చెప్పుకోవలసిన మరో వ్యక్తి ఆరుద్ర . ఆయనే కధతో పాటు మాటల్నీ చాలా రుచికరంగా వండారు .

ఈ సినిమా పేరు చెప్పగానే ఎవరికయినా ముందుగా గుర్తుకొచ్చేది నాగభూషణమే . జిత్తులమారి నక్క పాత్ర . అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే సిగ్గూశరం లేని పాత్ర . ఆరోజుల్లో అలాంటోళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టే సంఖ్యలో ఉండే వారు . ఇప్పుడు వాళ్ళ సప్లయి విపరీతంగా పెరిగిపోయింది .

సాధారణంగా కృష్ణ స్వంత సినిమాలలో భారీ తారాగణం ఉంటుంది . ఎక్కువ మందిని ఎకామడేట్ చేస్తారు. విశాల హృదయుడు కృష్ణ . అదే బాటలో ఈ సినిమాలో హేమాహేమీలందరూ నటించారు . విజయనిర్మల , జ్యోతిలక్ష్మి , యస్ వరలక్ష్మి , శాంతకుమారి , గుమ్మడి , సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి , రావు గోపాలరావు , ధూళిపాళ , మరెంతో మంది నటించారు .

పాటలూ హిట్టే . కోరినదీ నెరవేరినది , కత్తిలాంటి పిల్లోయ్ , ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా పాటలు బయటా హిట్టయ్యాయి . సినిమా అంత హిట్ కాదు పాటలు . అయితే బేక్ గ్రౌండ్ మ్యూజిక్ హాలివుడ్ లెవెల్లో ఉంటుంది . బోయపాటి శీనుని కట్టేసయినా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ఉండవచ్చు అని తెలిపేందుకు తప్పక చూపాలి . అతనికే కాదు ; డైలాగులు వినిపించకుండా ఢాం ఢాం బేక్ గ్రౌండ్ మ్యూజిక్ ని వినిపిస్తున్న దర్శకులకు , సంగీత దర్శకులకూ ఇలాంటి హిట్ సినిమాలు చూపాలి .

ఫస్ట్ రిలీజులోనే కాదు ; రిపీట్ రన్సులో కూడా ఇరగతీసేస్తున్న లెజెండరీ సినిమా ఈ మోసగాళ్ళకు మోసగాడు . మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసినట్లు గుర్తు . ఎన్ని సార్లు చూసానో గుర్తు కూడా లేదు . యూట్యూబులో ఉంది . చూడనివారు ఒకరోఅరో ఉంటే చూసేయండి . థియేటర్లో చూస్తే ఎంజాయ్ చేస్తారు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions