.
Yanamadala Murali Krishna …. ముందు మనిషిని… తరువాతే డాక్టర్‌ను…
ఈ సాయంత్రం ఆవిడ చెప్పారు… ఫలానా వాళ్ళ సర్జరీ పెద్దగా సక్సెస్ కాలేదట, మళ్ళీ సర్జరీ ఏదో సర్జరీ చెయ్యాలని అన్నారట.
Ads
విషయం ఏమంటే, కొన్ని నెలల క్రితం చర్చించిన తెలిసిన కుటుంబంలోని 60 ఏళ్ల పైబడ్డ మహిళ తాజా అనారోగ్యం గురించి… ఆవిడకి కొన్నేళ్ల క్రితం కాన్సర్ బయట పడితే రేడియోథెరపి, సర్జరీ అయ్యింది. తర్వాత రెండేళ్లకు వెన్నుపూస సర్జరీ అయ్యింది.
కొన్ని నెలల క్రితం కాలి రక్త నాళంలో రక్తం గడ్డ కట్టుకొని పోయింది. సర్జరీ అన్నారని తెలిసింది. అప్పటికే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా వుంది. ఈ బాధలు పడలేకున్నా ఎప్పుడు చనిపోతానో, నాకు అప్పుడే విముక్తి అని చాలాసార్లు వాపోయారు.
నేను ఆ పరిస్థితిలో ఆవిడకి సర్జరీ అనవసరం. తేరుకొనే అవకాశం తక్కువ. కంప్లికేషన్స్ వస్తాయి అనేసా… ష్, మీరు ఏమీ అనకండి, మిమ్మల్ని అడిగినా ఇలా చెప్పకండి అన్నది ఇంటామె. బంధువు ఒకతను అలాగే అంటే, అతని పరోక్షంలో పేషెంట్ తరపు వాళ్ళు బాగా తిట్టుకున్నారట.
మొత్తానికి హాస్పిటల్ వాళ్ళు రిస్కు అంటూ చెప్పిన విషయం, కొంతైనా ఆశావహ దృక్పథం ఉండడంతో సర్జరీకి ముందుకెళ్లారు. కొద్దికాలం కోలుకున్నట్టు కనిపించిన తర్వాత ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబం అనేక రకాలుగా అప్పుల పాలయ్యారు. బోలెడు కష్టాలు పడ్డారు.
పేషెంట్ కూడా చాలా చాలా బాధలు పడ్డారు. ఆరు వారాలు తిరగకుండా మళ్లీ ఇన్ఫెక్షన్స్ సోకి కాలిలో కొంత భాగం తీసేయాలని చెప్పారట. కొంచెం కొంచెంగా అట్లా తీసుకుంటూ పోవడం, పెద్ద వైద్యం, యాంటీ బయోటిక్స్ తో కొన్ని నెలలు పాటు బతికించడం తర్వాత చనిపోవడం. ఇది జరగబోయేది.
కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం అనుభవమే. నేను ముందుగా మనిషిగా ఆలోచిస్తాను. అందుకే ఇలాంటి సందర్భాల్లో నేను వృత్తి, చదువు మర్చిపోయి… నా పాండిత్య ప్రదర్శన కాకుండా సాధారణ మనిషి లాగా, పేషెంట్ పట్ల- వారి కుటుంబం పట్ల సహానుభూతితో ఉంటాను.
ఇలాంటి రిస్కులు ఉండి కోలుకునే అవకాశం దాదాపుగా లేని అంశాలలో, సందర్భాలలో వైద్యాన్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తాను. నిజమే, నేను ముందుగా మనిషిని. తర్వాతే డాక్టర్ నైనా మరొకటైనా. అందుకే చాలామంది నా పేషెంట్లు కూడా నన్ను పేరుతోనే మనిషిగా, తమ వాడిగా గుర్తిస్తూ ఉంటారు…. (యూజ్ చేసిన బొమ్మ మెటా ఎఐ ద్వారా కల్పితం…)
Share this Article