.
నిజమే… ఆమె వయసును జయించింది… 70 ఏళ్ల వయస్సులో కూడా ఆమె అబ్బురపరిచే ఫిట్‌నెస్ ఎక్సర్‌సయిజులతో 40 ఏళ్ల దానిలా కనిపిస్తుంది… ఆమె ఎవరో కాదు… పింకీ రోషన్…
తను ఇన్‌స్టాలో ఎక్కువగా కనిపిస్తుంది… సినిమా వార్తల తెర మీద ఎప్పుడూ కనిపించదు… ఇన్‌స్టాలో బోలెడు ఎక్సర్‌సయిజు వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది… చిట్కాలు చెబుతుంది…
Ads
అవును, ఆమె గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్‌గా పిలవబడే హృతిక్ రోషన్ తల్లి… తనే 51 ఏళ్లు… వార్-2 ప్రిరిలీజ్ సందర్భంగా మొన్న హైదరాబాద్ వచ్చాడు కదా… 42 ఏళ్ల జూనియర్ ఎన్టీయార్ కళ తగ్గిపోయి కనిపిస్తే హృతిక్ మాత్రం ఓ పదేళ్లు తక్కువగా కనిపిస్తాడు… ఈరోజుకూ హృతిక్ భారతీయ మహిళల కలల రాకుమారుడే… ప్రపంచ ఐదుగురు అందగాళ్లలో ఒకడిగా బాలీవుడ్ కీర్తిస్తుంటుంది తనను…
తల్లిలాగే కొడుకు కూడా ఫిట్‌నెస్ ఫ్రీక్ … ఇద్దరూ పక్కపక్కన నిలబడితే అక్కాతమ్ముళ్లలాగా కనిపిస్తారు… తరచూ ఆమె వీడియోలను ట్వీట్ చేస్తుంటాడు కూడా… అమ్మను చూస్తే తనకెప్పుడూ అబ్బురమే… రీసెంటుగా ‘నా జిమ్ పార్టనర్’ అంటూ అమ్మ ఫోటోను షేర్ చేశాడు…
కొత్తగా వస్తున్న వార్-2 సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేస్తున్న అమ్మ వీడియోను కూడా షేర్ చేశాడు… నిజంగా ఆమె ఫిట్‌నెస్ మీద చూపించే శ్రద్ధ ఓ ఇన్‌స్పిరేషనే మహిళలకు… 50 ఏళ్లకే ముసలివాళ్లలా కనిపించే చాలామందికి ఆమె 70 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి చేసే శ్రమ ఒక స్పూర్తే…
ఆమె భర్త రాకేష్ రోషన్ వయస్సు కూడా 75 ఏళ్లు… ఆమధ్య ఏదో సినిమా డబ్బుల వివాదంలో ఎవరో తన మీద కాల్పులు జరపడం, తరువాత త్రోట్ కేన్సర్ బయటపడటంతో డీలాపడిపోయాడు గానీ తనూ వ్యాయామ పురుషుడే…
దర్శకుడు, నిర్మాత, నటుడు… ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు అందించిన తనది ప్రధానంగా సినిమా కుటుంబం… తండ్రి రోషన్ సంగీత దర్శకుడు… తమ్ముడు రాజేష్ కూడా సంగీత దర్శకుడే… దర్శకుడు జే ఓం ప్రకాష్ బిడ్డ పింకీని పెళ్లి చేసుకున్నాడు… కొడుకు హృతిక్ గురించి తెలిసిందే…
పింకీ ఇన్‌స్టాలో తన బయో ట్యాగ్ లైన్ ఏమిటో తెలుసా..? ‘‘వయసును గెలుపుగా భావించే నేను, ఫిట్‌నెస్‌తో శరీరాన్ని, ప్రకృతితో మనసును పోషిస్తాను, గెలుస్తాను… భూమాత ఒడిలో సేద తీరుతూ, నా ప్రియమైన కుక్కపిల్లతో గడుపుతాను… కొత్త ప్రదేశాల అన్వేషణలో నా ఆత్మ ప్రయాణిస్తుంది… జీవితంలోని ప్రతి అడుగునూ ప్యాషన్, పర్పస్, కృతజ్ఞతలతో ముందుకు సాగిస్తాను…’’
Share this Article