ఒక చిన్న సంగతి చెప్పుకుందాం… 14 మందిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు… అసలు హౌజ్‌మేట్సే కాదు వాళ్లు, హౌజ్ మేట్స్ కాకముందే హౌజు నుంచి వెళ్లగొట్టడం ఏమిటి అంటారా..? వాళ్లే చెప్పుకున్నారు కదా… ఈసారి అంతా ఉల్టా పుల్టా… అచ్చంగా ఇదొక ఉల్టా ప్రోగ్రాం అయిపోయింది… నాగార్జునకు ప్రియమైన శివాజీ సహజంగానే హౌజ్‌మేట్ అయ్యాడు… అంతకుముందే ఆట సందీప్ కూడా హౌజ్ మేట్ అయ్యాడు… అంతే… వాళ్లు గాకుండా మిగిలిన 10 మందీ జస్ట్, కంటెండర్స్ మాత్రమే… అనగా హౌజ్ మేట్స్ కావడానికి పోటీపడుతున్న అనామకులు…
సరే, వాడి షో, వాడిష్టం అనుకుందాం… మొన్న శోభాశెట్టిని ఓ రూంలోకి పిలిచి, మోస్ట్ స్పైసీ చికెన్ ముక్కల్ని ముందు పెట్టి, మొత్తం తినాల్సిందే, లేకపోతే హౌజ్‌మేట్ పోటీలో ఉండవు అని బెదిరించాడు బిగ్‌బాస్… దిక్కుమాలిన టాస్క్… కిందామీదా పడుతూ, మూతీముక్కు తుడుచుకుంటూ, ఫాఫం, 27 వరకూ తిని, ఇక నావల్ల కాదుపో అని వదిలేసింది… ఇంకేముంది, బిగ్‌బాస్ గౌతమ్, ప్రశాంత్‌తోపాటు ఇంకెవరినో పిలిచి శోభాశెట్టి పెట్టిన 27 ముక్కల బెంచ్ మార్క్ ఎవరు వేగంగా దాటితే వాళ్లే శోభాశెట్టితో కంటెండర్‌గా ఉంటారు అన్నాడు… అంటే ఒక ముక్క అదనంగా, అంటే 28 అందరికన్నా ముందు తినాలన్నమాట…
తలతిక్కతనం అంటారు దీన్నే… పోనీ, దిక్కుమాలినతనం అనండి… ఆమె బోలెడంత టైమ్ తీసుకుని తిన్నది… పైగా ఆమె వీళ్లతో నేరుగా పోటీపడలేదు… పైగా సంచాలక్‌గా వ్యవహరించిన సందీప్‌కు దిమాక్ లేదు… ఫస్టేమో గౌతమ్ 28 ముక్కల్ని అందరికన్నా ముందే తిన్నాడు అని విజేత అన్నాడు… తీరా బయటికి వచ్చాక బిగ్‌బాస్ ప్లేటు ఫిరాయించాలని చెప్పినట్టున్నాడు… అబ్బే, గౌతమ్ సగం ముక్క వదిలేశాడు అని చావుకబురు చెప్పాడు… దీంతో శోభాశెట్టి విన్నర్ అని ప్రకటించారు… అసలు ఇదొక పోటీయా..? ఆమె విడిగా, సొంతంగా టైమ్ తీసుకుని తిన్న తీరుకూ, వీళ్లు వేగంగా తినడానికీ పోటీ ఏమిటి..? పైగా విజేత అని చెప్పాక కూడా ‘నువ్వు సగం ముక్క వదిలేశావోయ్’ అని సాకు చెప్పి శోభను విజేతగా ప్రకటించడం ఏమిటి..?
Ads
ఇదంతా ఎందుకు చెప్పాను అంటే… బిగ్‌బాస్ ఏమీ మారలేదు… పైగా పైత్యం ఇంకాస్త అధికంగానే ప్రకోపించిందీ అని చెప్పడానికి… జనం కూడా సేమ్ గత సీజన్‌ను ఎలా తిరస్కరించారో సేమ్ ఈ సీజన్‌ను కూడా అలాగే డిజాస్టర్ చేస్తున్నారని బార్క్ రేటింగ్స్ సాక్షిగా చెప్పడానికి… అంతటి నాగార్జున రొటీన్‌గా వస్తున్నాడు… ఏదో మమ అనిపించేసి వెళ్తున్నాడు… ఆ సండే షో కూడా జనానికి కనెక్ట్ కావడం లేదు… గత వారం బార్క్ హైదరాబాద్ రేటింగ్స్‌లో సండే షోకు జస్ట్, 5.07 టీఆర్పీలు రాగా… శనివారం 4.95 వచ్చాయి… ఇక వీక్ డేస్ అంటే ‘వీక్ డేస్’ మాత్రమే కదా… మంగళవారం 4.15, సోమవారం 3.69, శుక్రవారం 3.64, గురువారం 3.49, బుధవారం 3.28…
అంటే బిగ్‌బాస్ ఈ సీజన్‌ను కూడా ఎవ్వడూ దేకడం లేదనేగా అర్థం… ఈ మాత్రం భాగ్యానికి అయిదారుగురు నడమంత్రపు ఎంట్రీలు చేయిస్తారట… ఆల్‌రెడీ ఫిక్స్ చేశారట… పవర్ అస్త్ర అని ఏదో గడువుతో ఇమ్యూనిటీ వచ్చే పిచ్చి టాస్క్ నడుస్తోంది కదా… దాన్ని అలా కొనసాగిస్తూ ఈ సడెన్ ఎంట్రీలు చేయిస్తారట… ఉన్నవాళ్లకే నామినేషన్లు సరిగ్గా చేతకావడం లేదు… మంచి టాస్కులు లేవు… పోటీలు లేవు… ఇక కొత్తవాళ్లు వచ్చి ఏం చేయాలి..? ఏముంది..? హౌజులో ఉన్నవాళ్లలాగే గోళ్లు గిల్లుకోవాలి… యాణ్నుంచి వచ్చార్రా మీరంతా…!! లాంచింగుకు దునియా టీఆర్పీలు వచ్చినట్టు ప్రచారం చేసుకుంది ఈ టీం… గుర్తుంది కదా… అసలు దమ్ము ఇదీ…!!
Share this Article