.
Pardha Saradhi Upadrasta …. UAEలో తీవ్ర కలకలం! Flydubai Flight FZ1073ను హైజాక్ చేయడానికి జరిగిన విఫలయత్నం వెనుక ప్రధాన సూత్రధారులుగా 14 మంది యూఏఈ అధికారులు ఉన్నారనేది ఇప్పుడు విచారణ లో నెమ్మదిగా తేలుతున్న విషయం.
ఒమాన్‌కు చెందిన పైలట్ Hamam Alhamami ( మొదటి సారి అతని పేరు బయటకు వచ్చింది) తరచూ రాడికల్ ఇస్లామిక్ వెబ్సైట్లను సందర్శిస్తున్నాడనే కారణంతో 2024లో Oman Air అతడిని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత అదే ఏడాది అతడు దుబాయ్‌కు వెళ్లాడు. అనంతరం Flydubai అతడిని పైలట్‌గా నియమించుకుంది. Flydubai యూఏఈ ప్రభుత్వ ఆధ్వర్యములో నడిచే సంస్థ. నియామక ప్రక్రియలో అవకతవకల కోణంలో కూడా FlyDubai విచారణ జరుపుతోంది.
Ads
ఆ పైలట్‌కు ఉన్న తీవ్రవాద భావజాలం గురించి Oman Air, Flydubaiని హెచ్చరించిందని, అయినప్పటికీ ఆ హెచ్చరికలను Flydubai పట్టించుకోలేదను అని కూడా దుబాయ్, ఇజ్రాయిల్ మీడియా రిపోర్ట్ లు చెపుతున్నాయి.
అతడు ట్రైనీగా ఉన్న సమయంలోనే అతని వద్ద తీవ్రవాదానికి సంబంధించిన మెటీరియల్ దొరికిందని, అతడిని భద్రతాపరమైన ముప్పుగా పరిగణించారని కూడా చెబుతున్నారు. Al-Qaeda తో ఏడు వేర్వేరు సందర్భాల్లో అతడికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారని వార్తలు.
సిరియాలోని శిక్షణ శిబిరాల్లో పాల్గొన్న సమయంలో అతడిలో తీవ్రవాద భావజాలం మరింత పెరిగిందని కూడా కథనాలు. అతని సహచరులు అతడిని మతపరమైన తీవ్రవాదిగా అభివర్ణించారని, మహిళలతో కరచాలనం చేయడానికి కూడా నిరాకరించేవాడని చెబుతున్నారు.
అలాగే ‘Istishhad’ , మతపరంగా సమర్థించబడే ఆత్మాహుతి దాడులను , ప్రచారం చేసినట్లు అతడు దోషిగా తేలాడనే వాదనలు కూడా ఉన్నాయి.
ఇంతటి నేపథ్యం ఉన్న వ్యక్తిని ఇజ్రాయిల్ వెళ్ళే Flight FZ1073 నడిపేందుకు యూఏఈ అధికార సంస్థ ఎందుకు అనుమతించిందన్న ప్రశ్నలతో ఇప్పుడు భారీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయిల్ లోపలికి వెళ్ళే విమానాల సిబ్బంది విషయములో ఇజ్రాయిల్ చాలా కఠినంగా నిబంధనలు వుంటాయి.
విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని 9/11 తరహా దాడి చేయడానికి కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారా? అనే అనుమానాలు చాలా వరకు నిజాలు అవుతున్నాయి అని విచారణ సమాచారం చెబుతోంది.
Mossad, Shin Bet ఆ పైలట్‌ను ఇజ్రాయెల్‌కు అప్పగించాలని కోరుతున్నాయని, కానీ యూఏఈ విచారణ మధ్యలో మీకు ఇవ్వలేము నిరాకరిస్తోందట. సౌదీ అరేబియా ప్రాథమిక విచారణ కూడా పూర్తిచేయకముందే, బాహ్య ఒత్తిళ్ల కారణంగా ఆ పైలట్‌ను యూఏఈ కి తరలించింది.
ఈ హైజాకింగ్ ప్రయత్నం నెలల ముందే ప్రణాళిక వేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తంగా ఈ ఘటనను ‘inside job’ కోణంలో చూసి విచారణ చేస్తున్నారు. ఇజ్రాయిల్ ప్రధాని నిన్ననే మేము ప్రాథమికంగా ఎందుకు ఎలా జరిగిందో ఒక అంచనాకు వచ్చాము. వెనుక ఎవరు, ఏమిటి అనేది ఇంకా లోతుగా విచారిస్తున్నాం. ఎవరున్నా తీవ్ర చర్యలు తప్పవు అన్న ప్రకటన తో మిడిల్ ఈస్ట్ జియో పొలిటికల్ వాతావారణం ఇంకా వేడెక్కింది.
#Flydubai #FZ1073 #UAE #Dubai #AviationSecurity #Hijacking #FlightSecurity #BreakingNews #middleeast
Share this Article