.
నిన్న మరో జాగ్వార్ జెట్ కూలి ఇద్దరు యువ పైలట్లు దుర్మరణం పాలయ్యారు… గత అయిదు నెలల్లో ఇది మూడో జాగ్వార్… ఫిబ్రవరిలో ఒక మిరాజ్ కూలిపోయింది… ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమాన ప్రమాదాలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి… 2017- 2022 మధ్య 20 యుద్ధ విమానాాలు, ఏడు హెలికాప్టర్లు, ఆరు శిక్షణ విమానాలు, ఒక కార్గో విమానం కూలిపోయినట్టు ప్రభుత్వమే పార్లమెంటులో చెప్పింది…
ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో Chandrasekhar Vishnuvajhala
పోస్టు ఓ ఆందోళనకర సిట్యుయేషన్‌ను తెలియచెప్పుతోంది…
Ads
1963 లో ఇంపోర్ట్ తో మొదలై, తర్వాత కొన్నాళ్ళకి నాసిక్ HAL లో అసెంబుల్ చేసి చేసి అరగదీసి చివరికి లాస్ట్ మిగ్ 21 1985 లో చేసి ఆపేసారు.
అంటే ప్రొడక్షన్ ఆపేసి ఇప్పటికి నలభై ఏళ్ళు అయింది. వాటికే రంగులు పూసి, నట్లు బోల్టులు టైట్ చేసి, ఏవియానిక్స్ అప్డేట్ చేస్తూ వచ్చారు. టెస్ట్ సార్టీస్ చేస్తున్నప్పుడు చాలా మిగ్ 21 లు కూలిపోయాయి.
ఘోరం ఏంటంటే… యుద్ధాల్లోకన్నా ఈ టెస్ట్ ఫ్లయిట్లలోనే ఎక్కువ మంది సుశిక్షితులైన 170 మంది పైలెట్లు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కో పైలట్ ని సెలెక్ట్ చేసి, ట్రెయిన్ చేసి, ఫ్లై చేసే స్టేజికి తీసుకురావడానికి ఖర్చు దాదాపు 50 కోట్లు అవుతుందని అంచనా.
170 మంది పైలెట్లు పోయాకగానీ పాలకులకు కళ్లు ఓపెన్ అవలేదు, చివరికి ఫ్లయింగ్ కాఫిన్స్ (flying coffins) గా పేరు తెచ్చుకున్న మిగ్ 21 లను డిసెంబర్ 2025 కి పూర్తిగా సర్వీస్ లోంచి తీసేస్తారట. ఇక ఇప్పుడు మిగ్ 21 ల స్థానంలో జాగ్వార్లు చేరబోతున్నాయి, నిన్న మరో ఇద్దరు పైలెట్లు చనిపోయారు.
జాగ్వార్లు మొదటిగా 1979 లో ఇండక్ట్ చేసారు. మళ్లీ ఆ పాత ఇనప సామాన్ల కొట్టు HAL వాళ్ళే ఇంకో నలభై తయారుచేసి మెయింటెయిన్ చేస్తున్నారు. మొన్నమొన్నటి దాకా తయారు చేసారు. HAL మూసేస్తే సగం దరిద్రం వదులుతుంది.
పైలెట్ల ప్రాణాలు మిగలడమే కాకుండా మా బెంగళూరు ఓల్డ్ ఎయిర్పోర్టు రోడ్డులో పొద్దున్న 7 గంటలకి, మధ్యాహ్నం 2.30 కి ట్రాఫిక్ అయినా తగ్గుతుంది. వీళ్ళ పొడిచేదానికి వందలకొద్దీ బస్సులు. రూపాయికే టిఫిన్లు , ఐదు రూపాయలకి భోజనం .
When you can’t build, make a decision to buy Damn it.. HAL can never build anything more than doing sheet metal job..
70 ఏళ్ళ తర్వాత ఇంకా HAL ఇంకా ఏదో పొడుస్తుంది, 5th జనరేషన్ ఫైటర్ తయారు చేస్తుంది అంటే నవ్వొస్తోంది. HAL అంటే హిందుస్థాన్ ఆముదం లిమిటెడ్. ఇంకా ఆముదమే నయం, రెండు చెంచాలు తాగితే ఏదొకటి బయటికొస్తుంది. HAL నుంచి ఏదీ బయటికి రాదు… (పరుషంగా ఉన్నా వరుస ప్రమాదాల వార్తలు ఆందోళనకరంగానే ఉన్నాయి మరి)
Share this Article