Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆకాశంలో ఆత్మాహుతి డ్రోన్లు… రష్యా వాడుతున్న బ్రహ్మస్త్రం కుబ్-బ్లా…

October 31, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి …… Flying Kalashnikovs- ఎగిరే కలష్నికొవ్స్ ! కలష్నికొవ్ అంటే మనకి గుర్తుకి వచ్చేది AK-47 రైఫిల్ ! రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక మెషీన్ గన్ కి మామూలు గన్ కి మధ్యస్థంగా ఉండే రైఫిల్ ఉండాలి అనే ఆలోచనతో మిఖాయిల్ కలష్నికొవ్ అనే మాజీ సోవియట్ జెనెరల్ AK-47 రైఫిల్ ని తయారుచేశాడు. AK-47 లో AK అనే అక్షరాలకి అర్ధం avtomat kalashnikova. Avtomat అంటే రష్యన్ భాషలో ఆటోమాటిక్ అని అర్ధం. కలష్నికోవా మాజీ సోవియట్ జెనరల్ పేరుతో కలిపి AK-47 పేరుతో ఆటోమేటిక్ గన్ ఇప్పటికీ రక రకాల మోడల్స్ తో చెలామణి లో ఉంది ప్రపంచవ్యాప్తంగా ! ఆమాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడుపోయే మరియు చెలామణి లో ఉన్న ఆటోమాటిక్ రైఫిల్ AK-47 పేరుతో రికార్డ్ ఇప్పటికీ పదిలంగా ఉంది.

తాజాగా రష్యా దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న ఖేరోశాన్ ప్రాంతంలో ఉక్రెయిన్ టార్గెట్ల మీద కలిష్నికొవ్ సంస్థ తయారుచేసిన కుబ్ –బ్లా [KUB-BLA] కమికాజ్ [ఆత్మాహుతి ] డ్రోన్ లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో ఉన్న ఖేరోశాన్ ఇప్పటికే రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అయితే తాము కోల్పోయిన ఖేరోశాన్,డోన్ బాస్ ప్రాంతాలని తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నంలో రష్యన్ సైనికుల మీద దాడి చేస్తున్నది. రష్యా ఉక్రెయిన్ దళాల మీద ప్రతిదాడి కోసం కలష్నికొవ్ కుబ్-బ్లా డ్రోన్ల ని ప్రయోగించి సత్ఫలితాలని సాధిస్తున్నది ! కుబ్ బ్లా డ్రోన్లని కలిష్నికొవ్ సంస్థ తయారుచేసింది !

రష్యా ఇప్పటికే దాదాపుగా 3,000 క్రూయిజ్,షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్ళతో పాటు హైపర్సానిక్ మిసైళ్ళ ని ప్రయోగించింది గత 8 నెలల కాలంలో. ఇప్పటికే తన వద్ద ఉన్న మిసైల్ స్టాక్ లోని 40% మిసైళ్ళని వాడేసేంది రష్యా! ముందు ముందు నాటో దేశాలతో పోరాడవలసి వస్తే తన వద్ద ఉన్న మిగతా మిసైల్ స్టాక్ ని వాడుకోవడానికి రిజర్వ్ చేసి ఉంచింది. కానీ నాటోతో తలపడాలి అంటే అవి సరిపోవు. కాబట్టి రష్యాకి ఆత్మాహుతి డ్రోన్ల అవసరం ఏర్పడింది. ఒకవైపు కలష్నికొవ్ సంస్థ కామికాజ్ డ్రోన్లని తయారుచేస్తుండగానే ఇరాన్ నుండి షెహాద్ కామికాజ్ డ్రోన్ల ని దిగుమతి చేసుకొని వాటిని ఉక్రెయిన్ మీద ప్రయోగించింది. అవి సత్ఫలితాలని ఇచ్చాయి. అయితే ఇరాన్ డ్రోన్లు చాల తక్కువ వేగంతో వెళతాయి కాబట్టి సాధారణ మెషీన్ గన్లతో వాటిని కూల్చివేస్తున్నది ఉక్రెయిన్ సైన్యం !

Ads

Zela Aero [కలష్నికొవ్ అనుబంధ సంస్థ] కలష్నికొవ్ డ్రోన్ అయిన కుబ్ బ్లా లని తయారుచేసింది. ఇరాన్ కామికాజ్ డ్రోన్ల విషయంలో తలెత్తిన లోపాలు, విమర్శలకి సమాధానంగా చాలా వేగంగా జెలా ఏరో సంస్థ కామికాజ్ డ్రోన్ల ని తక్కువ కాలంలో తయారుచేసింది.

కలష్నికొవ్ kub –bla డ్రోన్లు గంటకి 130 km వేగంతో 30 km దూరం ప్రయాణించగలుగుతాయి. తనతో పాటుగా 3 kg ల హై ఎక్స్ ప్లోజివ్ పేలుడు పదార్ధాన్ని తీసుకెళ్లగలదు. ఇది రష్యాకి బాగా కలిసివచ్చే అంశం ! ఎందుకంటే రష్యా తాను ఆక్రమించుకున్న ఖేరోశాన్ ప్రాంతాన్ని ముళ్ళ కంచెలతో మూసి వేసింది ఉక్రెయిన్ సైన్యం అక్కడకి ప్రవేశించకుండా… కానీ వాటిని ఛేదించుకొని ఉక్రెయిన్ సైనికులు ఖేరోశాన్ లోకి వస్తున్నారు. ఈ సందర్భంలో అక్కడికి దూరంగా ఉన్న రష్యన్ పోస్ట్ ల నుండి కుబ్ బ్లా డ్రోన్ల ద్వారా ఉక్రెయిన్ సైన్యం మీద దాడి చేస్తున్నది రష్యన్ సైన్యం. వేగం ఎక్కువగా ఉండడం మరియు చాలా ఖచ్చితంగా టార్గెట్ ని ధ్వంసం చేస్తుండడం వలన ఉక్రెయిన్ సైన్యం కుబ్ బ్లా డ్రోన్ల ని నిరోధించలేకపోతున్నది.

ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కుబ్ బ్లా డ్రోన్లు తయారుచేయడానికి ఒక్కో దానికి 3 వేల డాలర్లు ఖర్చు అవుతున్నది రష్యాకి ! మిలటరీ ఆయుధాల లెక్కలో ఇది చాలా చిన్న మొత్తం ! పైగా చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నది. వీటిని ఎదుర్కోవాలి అంటే కనీసం 16 వేల డాలర్లు విలువ గల షార్ట్ రేంజ్ మిసైల్ ని వాడాల్సి ఉంటుంది… కానీ వందల సంఖ్యలో దాడికి వచ్చే కుబ్ బ్లా లాంటి డ్రోన్ల ని కూల్చివేయడానికి ఎన్ని షార్ట్ రేంజ్ మిసైళ్ళ ని ప్రయోగించగలదు శత్రు దేశం ?

చాలా ఖరీదు చేసే క్రూయిజ్,షార్ట్ రేంజ్ బాలిస్టిక్,హైపర్ సానిక్ మిసైళ్ళకి ప్రత్యామ్నాయం ఈ కలష్నికొవ్ కుబ్ బ్లా డ్రోన్లు. ప్రస్తుతం పరీక్ష కోసం వీటిని ప్రయోగిస్తున్నది రష్యా. మామూలుగా అయితే కృత్రిమ యుద్ధ వాతావారణాన్ని సృష్టించి వీటిని పరీక్షించాల్సి ఉంటుంది కానీ యుద్ధం వలన నేరుగా వాటిని పరీక్షిస్తున్నది రష్యా ! బహశా రాబోయే రోజుల్లో ప్రస్తుత యుద్ధం తాలూకు డాటా ని విశ్లేషించి మరింత దూరం వేగంగా వెళ్ళి దాడి చేయగల తక్కువ ఖరీదు చేసే డ్రోన్ల ని ఉత్పత్తి చేసి అమ్ముతుంది రష్యా. గతంలో కానీ ప్రస్తుతం కానీ AK -47 లు ఎలా అయితే అమ్ముడుపోతున్నాయో అలాగే కలష్నికొవ్ కుబ్ బ్లా డ్రోన్లని కూడా చవుక ధరలో అమ్ముతుంది.

అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో జరుగుతున్న పరిణామాలని చాలా దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. వాటిలో భారత్ కూడా ఒకటి. మనకి POK సరిహద్దు దగ్గర నుండి 30 km దూరంలో కల పాకిస్థాన్ ఉగ్ర గ్రూపుల స్థావరాలని ఇలాంటి రష్యన్ డ్రోన్ల ద్వారా చాలా తేలికగా టార్గెట్ చేయడానికి అవకాశం ఉంది. చాలా చవకగా మరియు ఎలాంటి ప్రాణ నష్టం మనవైపున ఉండకుండా ఇలాంటి డ్రోన్ల ద్వారా చాలా వరకు పనులు చక్కబెట్టవచ్చు !

వీటికి విరుగుడు ఉందా ? ప్రస్తుతానికి జిపిఎస్ ద్వారా ఆపరేట్ చేస్తూ వీటిని ప్రయోగిస్తున్నారు. శాటిలైట్ లింకు ద్వారా పనిచేస్తాయి. కానీ వీటిని S బాండ్ ఫ్రీక్వెన్సీ లో వాడుతున్నారు. S బాండ్ ఫ్రీక్వెన్సీ ని అడ్డుకోగల జామర్లని ఇప్పటికే వాడుతున్నాయి కొన్ని దేశాలు. అందుకే క్షణ క్షణం తమ ఫ్రీక్వెన్సీని మార్చుకుంటూ ఎగిరి వెళ్లగల డ్రోన్లని అభివృద్ధి చేస్తున్నాయి కొన్ని దేశాలు. ఎలాంటి జామర్లు ఉపయోగించినా ఆగకుండా వెళ్ళి టార్గెట్ ని నాశనం చేయగలవాటిని ! బహుశా DRDO ఇప్పటికీ వీటి అభివృద్ధి చేసే పనిలో ఉండవచ్చు. మన త్వరలో శుభవార్త వినే అవకాశం ఉంది !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions