సీమా హైదర్… పబ్జీ ఆడుతుండగా పరిచయమై, చాటింగ్ ద్వారా సచిన్ మీనా అనే భారతీయుడికి సన్నిహితుడై… ఆనక ప్రేమికుడై… తన కోసం పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా ఇండియా చేరింది ఈ పాకిస్థానీ మహిళ… అందరూ రాశారు… ప్రేమ శక్తిని కీర్తిస్తున్నారు… ఏ దేశ సరిహద్దులూ ప్రేమను అడ్డుకోలేవంటూ చప్పట్లు కొడుతున్నారు… కానీ ఒక్కడూ ఆ విపరిణామాల్ని పట్టించుకోలేకపోయారు…
పబ్జీ ప్రేమ గాఢత ఎంతో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు… నిజంగా ఆమె కేవలం ఓ ప్రేమికురాలేనా..? మన జాతీయ దర్యాప్తు సంస్థలు మాత్రం నమ్మడం లేదు… యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పలు కోణాల నుంచి పరిశోధిస్తోంది… నేపాల్‌లోని ఐఎస్ఐ హ్యాండ్లర్స్ ఆమెను ఇండియాలోకి క్షేమంగా ప్రవేశపెట్టాలయనేది ప్రాథమికంగా సందేహం… పాకిస్థాన్, ఇండియా సరిహద్దుల గుండా అయితే కష్టం… కాబట్టి చాలామంది ఉగ్రవాదుల్లాగే నేపాల్ మీదుగా వచ్చింది ఆమె…
Ads
మరి ఏటీఎస్ కన్ను ఎందుకు పడింది..? ఎందుకంటే… ఆమె రాకడ అనుమానాస్పదం… ఆమె అంకుల్, బ్రదర్ పాకిస్థాన్ ఆర్మీలో ఉన్నారు… పబ్జీలో కూడా 9 సార్లు తన యూజర్ నేమ్ మార్చుకుంది… ఆమె ఫోన్‌లో నలుగురు పాకిస్థానీయుల నంబర్లను డిలిట్ చేసింది వచ్చేముందు… ఢిల్లీలోని చాలామందితో పబ్జీ ద్వారా కంటాక్ట్ కోసం ప్రయత్నాలు చేసింది… అంటే ఆమె డెస్పరేట్‌గా ఇండియాలోకి ప్రవేశించడానికి ప్లాన్‌డ్‌గా ప్రయత్నాలు చేసింది తప్ప ఈ ప్రియుడు ఓ బకరా…
రాగానే తనకు ఇండియా ఆశ్రయం కావాలంటూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి పంపించుకుంది… పౌరసత్వానికి దరఖాస్తు చేసుకుంది… ఇలాంటి వాళ్లకు పౌరసత్వం ఇవ్వడానికి వీలుగా ఓ చట్టం తీసుకువస్తే దేశమంతా ఎంతటి ఆందోళనలు లేవదీశారో తెలిసిందే కదా… సరే, ఆ చర్చ జోలికి పోకుండా, ఈ సీన్ ఇక్కడ కట్ చేద్దాం… ఈమె వచ్చింది, బాగానే ఉంది…
ఆయ్ఁ ఈమె ఇండియాకు రావడం అక్కడ పాకిస్థాన్‌లో చాలామందిలో కోపాన్ని పెంచింది… అసలు కారణాలు వాళ్లకు ఏం తెలుసు..? మన నుంచి తప్పించుకుపోయిందే అని అహం దెబ్బతింది… దాంతో ఏం చేశారో తెలుసా..? రాకెట్లతో ఓ పురాతన హిందూ దేవాలయాన్ని కూల్చేశారు… హిందూ వ్యాపారి ఒకరి ముగ్గురు బిడ్డల్ని అపహరించారు… తరువాత మతం మార్చారు… పెళ్లిళ్లు చేసుకున్నారు… అక్కడి ప్రజలు ఏదనుకుంటే అదే చట్టం, అదే శాసనం… ఆ దిక్కుమాలిన దేశంలో ఓ ప్రభుత్వం అంటూ ఉండి ఏడిస్తే కదా…
ఆమె కుటుంబాన్ని బహిష్కరించారు… ఇన్నేళ్లలో ప్రతి హిందూ కుటుంబానికి పొగబెట్టారు… అలో లక్ష్మణా అనుకుంటూ లక్షలాది కుటుంబాలు వలస వెళ్లిపోయాయి… మిగిలిపోయిన ఒకటీ అరా కుటుంబాల దుర్గతి ఇదీ… ఈ వార్త హిందూ వ్యతిరేక సీపీఐ పత్రిక ప్రజాపక్షంలో వచ్చిందే… బంగ్లాదేశ్‌లో ఇంతే… అఫ్ఘనిస్థాన్‌లో ఇంతే… ఒకవైపు ఖలిస్థానీ శక్తులు కెనడా, ఆస్ట్రేలియాల్లో గుళ్ల మీద దాడులు చేస్తున్నయ్… రానురాను ఆప్ వంటి దిక్కుమాలిన పార్టీల మద్దతుతో అవింకా బలం పెంచుకుని హిందువులపై పడనున్నయ్…
మరోవైపు మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో చర్చి విద్వేష మంటల్ని రాజేస్తోంది… తెగల నడుమ పోరాటాల్ని పెంచుతోంది… ప్రస్తుతం ప్రపంచంలోని ప్రధాన మతాలకు హిందూ మతమే టార్గెట్… సొంత హిందూ సమాజంలోని హిందూ వ్యతిరేక పార్టీలు, వ్యవస్థలు, శక్తుల కారణంగా… రాబోయే కాలంలో హిందువులు మరిన్ని అవస్థలపాలు కావడం తథ్యం…!!
Share this Article