.
మన దేశంలో “కొందరు” అంబానీ, అదానీ, బిర్లా వంటి ప్రముఖ వ్యాపారవేత్తల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అంబానీ తన చిన్న కొడుకు పెళ్లికి బిల్ గేట్స్‌ని పిలిచి అత్యంత ఖర్చుతో వేడుక జరిపితే చూడలేరు. ఇలానే, అమెరికాలో కూడా ఇలాన్ మస్క్ వంటి వ్యాపారవేత్తల ఎదుగుదలపై కొందరు అసూయతో ఉంటారు, ఏడుస్తూ ఉంటారు.
ప్రపంచంలో ప్రతిచోటా ఇలా వేరే వాళ్ళ మీద ఏడ్చేవాళ్ళు ఉంటారు. వారి దృష్టిలో, ఈ ప్రముఖుల, వ్యాపారవేత్తల ఎదుగుదలకు ప్రభుత్వంలోని పెద్దల సహకారమే ప్రధాన కారణం అన్నది ఒక అభిప్రాయం.
Ads
కానీ, వారి ఎదుగుదలకు ప్రధాన కారణం వారి ఆలోచనా విధానం. ఉదాహరణకు, ఇలాన్ మస్క్ టెస్లా సంస్థ అధినేతగా ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉన్నాడు. కానీ, అతని వద్ద ఎక్కువ కార్ల ఉత్పత్తి సామర్థ్యం లేదు.
ఈ నేపథ్యంలో, మస్క్ ఫోర్డ్ కంపెనీకి వెళ్లి, “నా వద్ద ఉన్న టెక్నాలజీని మీకు అందిస్తా, మీ తయారీ సామర్థ్యాన్ని నా ప్రాజెక్టు కోసం ఉపయోగించుకుంటా, ఇద్దరికీ లాభం” అంటూ ఒక వ్యూహాత్మక ప్రతిపాదన చేశాడు. దాంతో, ఇప్పుడు, ఇద్దరూ కలిసి అమెరికాలో అత్యుత్తమ స్థాయికి చేరుకుంటున్నారు. ఇదే నిజమైన ఎదుగుదలకి ముఖ్య సూత్రం.
ఫోర్డ్ కంపెనీకి అమెరికాలో ఘనమైన చరిత్ర ఉంది. ఒక అమెరికన్ ఏ దేశానికైనా వెళ్ళినా , అక్కడ ఫోర్డ్ కార్లు కనిపిస్తాయా అని చూస్తాడు. అమెరికా జాతీయవాదులు కూడా ఫోర్డ్ కార్లనే ఎక్కువ ఉపయోగిస్తారు. అయితే, ప్రస్తుత పోటీ వాతావరణంలో, ఫోర్డ్ కొంత వెనుకబడింది, ప్రధాన పోటీదారుగా టెస్లా నిలబడింది మరియు ప్రస్తుతం ఫోర్డ్స్ కంపనీ నష్టాల్లో ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో మనం అయితే ఫోర్డ్‌ను పూర్తిగా ఓడించి, సర్వ నాశనం చేసి మనం సులభంగా ఎదగాలని అనుకుంటాం. కానీ, ఇలాన్ మస్క్ ఆ దిశలో ఆలోచించలేదు. కలిసి ఎదుగుదాం అన్నాడు…
ధనవంతులే కాదు, ఇద్దరు అడుక్కుతినేవాళ్ళు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటే కలిసి ఎదగవచ్చు అని ఒక రోమన్ తత్వవేత్త అంటాడు. అతను తన అనుభవంలో నేర్చుకున్న విషయాలు ఇవతల వ్యక్తికి, ఇతని అనుభవం అతనితో షేర్ చేసుకుంటే ఇద్దరూ మరింత మెరుగ్గా అడుక్కుని అత్యంత విజయం గా బతకవచ్చు.
సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ పిల్లలు సహజంగానే ఎదుగుతారు, ఎందుకంటే వారికి తల్లిదండ్రుల సహకారం, వాళ్ళ వర్గం నెట్ వర్క్& మద్దతు ఉంటుంది. కానీ, ఫస్ట్ జనరేషన్ వారికి తెలివితేటలు, కష్టపడే మనస్తత్వం ఉన్నప్పటికీ గైడెన్స్ లేకపోవడం వల్ల ఎదగాల్సినంత ఎక్కువ ఎదగలేరు. అందుకే, తమలాంటి ఆలోచన కలిగిన వారితో కలిసి ఒకరికి ఒకరు సాయం చేసుకుంటే, ఇద్దరూ కలిసి ఎదగవచ్చని పెద్దలు చెబుతారు.
ఇంకో ఉదాహరణ, శ్రీ చైతన్య – నారాయణ. అప్పట్లో ఇద్దరి మధ్య ఎంత పోటీ ఉందో మనకు తెలుసు. కానీ వీడు వాడ్ని, వాడు వీడ్ని లేపేయాలనుకోలేదు. ఇద్దరూ కలిసి జనాలని పిచ్చోళ్ళని చేసి కోటానుకోట్లు సంపాదించారు.
మళ్ళీ టెస్లా, ఫోర్డ్ విషయానికి వస్తే – టెస్లా తమ ఎలక్ట్రిక్ కార్లకి చార్జర్ యూనిట్లని ప్రతి చోటా పెట్టాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ఫోర్డ్ వాళ్ళకి కూడా విడిగా తమ ఎలక్ట్రిక్ కార్లకి చార్జర్ యూనిట్లని పెట్టాలి అంటే తమ స్థాయికి మించిన ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అదే ఇద్దరూ కలిసిపోయి కంబైండ్ చార్జర్ యూనిట్లని పెడితే తక్కువ ఖర్చుతో ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్లలో కలిసి ఎదగవచ్చు, ప్రపంచంలో ఎక్కువ ఎలక్ట్రిక్ మార్కెట్ సొంతం చేసుకోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం. మనం ఎదిగినా మనమే కారణం, మనం ఓడిపోయి సంక నాకిపోయినా మన ఆలోచనలు, మనమే కారణం. పనికిరాని వాళ్ళే వేరే వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు అంటాడు ఒక రోమన్ తత్వవేత్త…. (జగన్నాథ్ గౌడ్ పూర్తి వ్యక్తిగత అభిప్రాయం)
Share this Article