పార్ధసారధి పోట్లూరి………. హిండెన్బర్గ్ Vs గౌతమ్ ఆదానీ ! పార్ట్ -02……….. హిండెన్బర్గ్ గౌతమ్ ఆదానీ మీద ఆరోపణలు చేసిన సమయం గురించి మనం చెప్పుకోవాలి ! NDTV ని ఆదాని కొనడం, రబ్బీష్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం, NDTV ఇచ్చిన డాటా ని ఆధారం చేసుకొని బిబిసి మోడీ మీద వండిన డాక్యుమెంటరీ వివాదాస్పదం అయిన వారం రోజుల తరువాత హిండెన్ బర్గ్ ఆదానీ గ్రూపు మీద ఆరోపణలు చేయడం వరసగా జరిగిపోయాయి !
అయితే ఆదానీ గ్రూపు మీద వ్యూహాత్మకంగా గత సంవత్సరం నుండి దాడి మొదలయ్యింది ! ఆగస్ట్ 22, 2022 న అల్ జజీరా చానెల్ ఒక వార్తని ప్రసారం చేసింది ! దాని సారాంశం ఏమిటంటే ఆదానీ గ్రూపు లోని చాలా సంస్థలు అప్పులతో స్థాపించబడినవే ! ఎప్పుడో ఒకప్పుడు ఆదానీ గ్రూపు డీఫాల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ! ఆదానీ గ్రూపు లోని సంస్థల అప్పులు వాటి ఆస్థుల కంటే,అవి చేసే వ్యాపార పరిణామం కంటే ఎక్కువగా ఉన్నాయి అంటూ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణ. ఇదే జరిగితే చాలా బాంకులు కష్టాలలో పడుతాయి. ఇలా అల్ జజీరా 2022 ఆగస్ట్ నెల 22 న ప్రసారం చేసిన దానిలో పేర్కొంది ! చాలా వ్యూహాత్మకంగా ఆదానీ ని టార్గెట్ చేయడం మొదలయ్యింది 2022 నుండి అన్నమాట !
*********************************
Ads
ఆదానీ పాలక ప్రభుత్వం అయిన బిజేపితో సన్నిహతంగా ఉంటున్నాడు అనేది మరో విమర్శ ! పారిశ్రామిక వేత్తలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయా ప్రభుత్వాలతో సన్నిహితంగానే ఉంటారు తప్పితే అనవసర గొడవలకి దిగరు. అలా అయితే ధీరూభాయి అంబానీ ఎదిగిన తీరు చూస్తే కాంగ్రెస్స్ తో సన్నిహితంగా ఉండడం వలనే ఈ రోజు ఇలా ఉంది అని అంటే ఒప్పుకుంటుందా కాంగ్రెస్ ? పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు ఎవరూ కూడా ఒక రాజకీయ పార్టీతో సన్నిహితంగా ఉండి ప్రతిపక్ష పార్టీలతో వైరభావంతో ఉండరు. ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళతో మంచిగా ఉంటూ తమ పనులు ఆగకుండా చూసుకుంటారు తప్పితే వాళ్ళకి రాజకీయాలు, పార్టీలతో అంట కాగరు. ఒక్క బజాజ్ సంస్థ తప్పితే !
*************************************
భారత్ కి చెందిన బాంకులు మరియు అంతర్జాతీయ బాంకులు !
ఆదానీ గ్రూపుకి భారత్ కి చెందిన ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ బాంకులతో పాటు అంతర్జాతీయ బాంకులు కూడా అప్పులు ఇచ్చాయి… బాంకులు అప్పు ఇచ్చే విధానం ఇలా ఉంటుంది ! [కొన్ని విధాన పరమయిన మార్పులు ఉండవచ్చు ఆయా బాంక్ యాజమాన్యం యొక్క పాలసీ ని బట్టి కానీ బేసిక్ సిస్టమ్ మాత్రం దాదాపుగా కింద ఉదహరించిన విధంగా ఉంటాయి ]
1. స్టాక్స్ [Stock ]. స్టాక్ మార్కెట్ లో అప్పు కోరుతున్న సంస్థ షేర్లు వాటి విలువ అవి ఎలా ట్రేడ్ అవుతున్నాయి.
2. ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ [సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఇచ్చిన వివరాల ప్రకారం అవి : ఋణం కోరే వారి బిల్డింగ్స్, యంత్రాలు, ఫాక్టరీలు, ఇన్వెంటరీ , ఉత్పత్తులు, వగైరా ..
3. ప్రాజెక్ట్ లో ఏదయితే సూచించారో ఆ భూమి.
4. నగదు లావాదేవీలు [Cash Flow ] ప్రొజెక్షన్స్
5. పరపతి [Reputation ].
అప్పులు పెరిగే కొద్దీ ఆస్తుల విలువ [అప్పుతో పోలిస్తే ] తగ్గిపోతూ ఉంటుంది సహజంగానే. కానీ వ్యాపారం లేదా ఉత్పత్తుల సరఫరా, డిమాండ్ పెరుగుతూ ఉన్నట్లయితే బాంకులు అప్పులు ఇస్తూ పోతుంటాయి. ఇది మన దేశంతో పాటు ఇతర దేశాలలో కూడా ఫాలో అవుతున్న విధానం. ముఖ్యంగా నగదు లావాదేవీల ప్రవాహం కొనసాగుతూ ఉంటే దానితో పాటు స్టాక్ మార్కెట్ లో ఆ సంస్థ యొక్క ధర పెరుగుతూ ఉన్నట్లయితే దేశ, విదేశాల బాంకులు అప్పటికే ఆ సంస్థకి అప్పులు ఉన్నా ఇంకా ఇంకా ఇస్తూ పోతూ ఉంటాయి తప్పితే ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయి కాబట్టి ఇక ఇవ్వము అని అనవు!
**************************************************
ఆయా దేశాల ఆర్ధిక పురోగమనం వలన అప్పు తీసుకున్న సంస్థ యొక్క స్టాక్ మార్కెట్ షేర్ ధర పెరుగుదలతో పాటు నగదు ప్రవాహం [Cash Flow ] కూడా పెరిగినట్లయితే లేదా పెరుగుతూ ఉంటే ప్రాజెక్ట్ పరిణామం పెరుగుతుంది సహజంగానే, అలాగే తీసుకున్న అప్పు ఒక స్టాండర్డ్ గా ఉంటుంది. అప్పటికే తీసుకున్న అప్పు ఉండడం వలన ఆయా సంస్థలు ఈక్విటీ మార్కెట్ లోకి వెళ్ళి ప్రజలకి బాండ్స్ ఆఫర్ చేసి ధనం సమకూర్చుకుంటాయి. ఈ ప్రక్రియలో ప్రజలు లేదా ఇన్వెస్టర్లు ఆయా సంస్థల మీద విశ్వాసం చూపిస్తూ బాండ్స్ కనుక ఆశించినమేరకు కొంటే దీనిని బాంకులు రెప్యుటేషన్ కింద పరిగణిస్తాయి.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇక ఆదానీ గ్రూపు విషయానికి వస్తే పైన చెప్పినది అంతా సజావుగానే జరిగింది ! ఆదానీ గ్రూపు అప్పులు మన దేశ ప్రభుత్వ రంగ బాంకుల దగ్గర తీసుకున్నది 80,000 వేల కోట్లు ! ఆదానీ గ్రూపు మొత్తం అప్పులు వచ్చేసి ఒక లక్షా ఎనభై వేల కోట్లు [1,80,000 కోట్లు]. దీని ప్రకారం చూస్తే మన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బాంకుల దగ్గర తీసుకున్న అప్పు కంటే విదేశాల లోని బాంకుల దగ్గర తీసుకున్న అప్పు మొత్తం ఎక్కువగా ఉంది.
ఆదానీ గ్రూపు కి విదేశీ బాంకుల లో బార్కలేస్ [Barklays], డచ్ బాంక్ [Deutsche Bank], స్టాండర్డ్ చార్టెడ్ బాంక్ [Standard Charted Bank ], HSBC మరియు ఇతర బాంకులు కలిపి ఒక లక్ష కోట్ల రూపాయాల అప్పు ఇచ్చాయి.
గత సంవత్సరం స్విట్జర్లాండ్ దేశానికి చెందిన సిమెంట్ బిజినెస్ కంపనీ అయిన Holcim ని టేక్ ఓవర్ చేసింది ఆదానీ గ్రూపు. ఈ టేక్ ఓవర్ చేయడానికి గాను చాలా విదేశీ బాంకులు అప్పులు ఇచ్చాయి. అక్కడ Holcim సిమెంట్ ఫాక్టరీ, దాని తాలూకు బిజినెస్ ని తాకట్టు కింద తీసుకొని అప్పులు ఇచ్చాయి విదేశీ బాంకులు. ఒక స్విస్ కంపనీని భారత పారిశ్రామిక వేత్త టేక్ ఓవర్ చేయడం అనేదే ఇక్కడ పెద్ద ఇష్యూ !
*********************************************
గౌతమ్ ఆదానీ గ్రూపు విలువ $137.4 బిలియన్ డాలర్లు ! అంటే ప్రపంచంలోని 60 చిన్న దేశాల GDP కంటే ఆదానీ గ్రూపు ఆస్తుల [వాల్యుయేషన్] విలువ ఎక్కువ ! బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ లిస్ట్ లో మూడవ పెద్ద ఆర్ధిక వ్యవస్థ ఆదానీ గ్రూపు ! ఆఫ్ కోర్స్ ఇది స్టాక్ వాల్యు పడిపోక ముందు ఉన్న రాంక్ ! ఈ స్థితికి రావడం అనేది ఆసియాలోనే మొదటి వ్యక్తి అయ్యాడు గౌతమ్ ఆదానీ !
ఒక పటిష్టమయిన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే కొన్ని కష్టమయిన మరియు నష్టపరిచే అంశాలని కూడా భరించే శక్తి కావాల్సి ఉంటుంది అంటే రిస్క్ తీసుకునే శక్తి. గౌతమ్ ఆదానీ కూడా ఇలాంటి రిస్క్ తీసుకున్నాడు అనే చెప్పుకోవాల్సి ఉంటుంది! ఒక వ్యక్తి తన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని విస్తరించే దశలో కొన్ని తప్పులు కూడా చేస్తుంటాడు ఇది ఆదానీ మినహాయింపు కాదు. ఇక్కడ రిస్క్ తీసుకునే కొన్ని సంస్థలని ఏర్పాటు చేయడం లేదా ఆల్ రెడీ ఉన్న వాటిని టేక్ ఓవర్ చేయడం చేశాడు. అయితే భవిష్యత్తులో లాభాలు ఆర్జించపెట్టగలవు అనే ఆలోచనతోనే చేశాడు కానీ అవి సంవత్సరాలు గడిచే కొద్దీ లాభాలు ఇవ్వకపోగా నో లాస్ నో ప్రాఫిట్ దశలోనే ఉండిపోయాయి. వీటినే పాయింట్ అవుట్ చేస్తూ హిండెన్బర్గ్ తన నివేదికలో పొందుపరిచింది అవి వైరల్ అయ్యాయి. అలా అని హిండెన్బర్గ్ పాయింట్ అవుట్ చేసినవి అన్నీ నిజాలు కాదు ! చాలా వరకు తన షార్ట్ సెల్లింగ్ బిజెనెస్ కోసం వాడుకోవడానికి ఉద్దేశించి ఆరోపణలు చేసినవే ఎక్కువ !
Share this Article