నెలరోజుల క్రితం… ముచ్చట కూడా ప్రచురించిన ఓ కథనం ఇది… ముందుగా ఇది చదవండి… తరువాత కథ కూడా చెప్పుకుందాం… ఇంట్రస్టింగ్ స్టోరీ… హ్యూమన్ ఇంట్రస్టింగ్ స్టోరీ… అసాధారణం అని చెప్పలేను కానీ అరుదైన వార్తలు… పదండి వార్తలోకి…
ప్రపంచంలోకెల్లా అత్యంత దట్టమైనవి అమెజాన్ అడవులు… భీకరమైనవి కూడా… రోజూ వర్షం, పొడవైన దృఢమైన చెట్లు, విషసర్పాలు, క్రూరజంతువులు… ప్రతి అడుగూ ప్రాణాంతకమే… రనేక్ మకుటయ్ 11 నెలలు, 4 ఏళ్లు, 9 ఏళ్ల వయస్సున్న కుమారులు, 13 ఏళ్ల కుమార్తెతో కలిసి ఈనెల ఒకటిన ఓ చిన్న విమానంలో అమెజాన్ ప్రావిన్సులోని అరరాక్వారా నుంచి శానోస్ డెల్ గువియారేకు బయల్దేరారు…
ఇంజిన్ ఫెయిలైంది… (పాపం పసివాడు సినిమా గుర్తొస్తోందా..? అప్పట్లో ఇంగ్లిషులోనూ ఓ సినిమా వచ్చింది, ఇద్దరు పిల్లలు అడవిలో తప్పిపోవడం మీద…) విమానం కూలిపోయింది… ఇందులో రనోక్, ఆమె పిల్లలు మాత్రమే కాదు… మరొకరు కూడా ఉన్నారు… విమానం కూలిపోయిన దుర్ఘటనలో పైలట్, రనోక్, ఆ మరో వ్యక్తి కూడా మరణించారు… ఆ నలుగురు పిల్లలు మాత్రం ప్రాణాలు దక్కించుకున్నారు… లక్కీగా, అన్ లక్కీగా…
Ads
అడవిలో విమానం కూలిపోయిన సమాచారం తెలిసింది ప్రభుత్వానికి… పిల్లలు బతికి ఉంటారా..? తప్పిపోయి ఇంకా బతికే ఉంటారా..? ఆపరేషన్ హోప్ పేరిట సైనికులు వెతుకులాట ప్రారంభించారు… దక్షిణ కాక్వెటా ప్రాంతంలో సైనికులకు కర్రలు, కొమ్మలతో కూడిన ఓ షెల్టర్ కనిపించింది… ముందు ఆశ్చర్యపోయినా, పిల్లలు అక్కడ వసతి సమకూర్చుకున్నట్టు ఊహించి ఆ పరిసరాల్లోనే హెలికాప్టర్లు దింపి సెర్చింగ్ స్టార్ట్ చేశారు…
రనోక్ సహా ముగ్గురి శవాలూ కనిపించాయి… మరి పిల్లలు..? అన్వేషణ మరింత సీరియస్‌గా సాగింది… ఎలాగైతేనేం దొరికారు… అందరూ బతికే ఉన్నారు… 17 రోజులపాటు చిన్న చిన్న షెల్టర్లు వేసుకుంటూ, తలదాచుకుంటూ, దొరికిన పండ్లు తింటూ ప్రాణాలు నిలుపుకున్నారు… కాస్త పెద్ద వయస్సున్న పిల్లలు సరే, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆ 11 నెలల పిల్ల కూడా మొండిగా బతికింది… అదీ ఆశ్చర్యం…
అడవుల్లో ఎలా బతకాలనేది ఆ పిల్లల నెత్తుటిలో ఉంది… నిజం, కష్టకాలంలో ఆ నెత్తుటిలోని తమ వారసత్వ నైపుణ్యాలు బయటికొచ్చాయి… వాళ్లది హుయిటోటో తెగ… ఈ తెగ ప్రజలు తరతరాలుగా చేపలు పట్టడం, జంతువుల వేట వృత్తులుగా అడవుల్లోనే బతికేవారు… ఆ పిల్లల్ని సజీవంగా ఉంచినవి కూడా వాళ్ల నెత్తుటిలోని ఆ లక్షణాలు, నైపుణ్యాలు, ప్రతికూలతలను తట్టుకునే దైహిక తత్వమే కారణమని ఇప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు… సదరు ప్రావిన్స్ అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ పిల్లలు బతికి ఉండటాన్ని (జాయ్ ఆఫ్ ది నేషన్) అని వ్యాఖ్యానించాడు… నిజమే, సంతోషమే, అబ్బురమే…!!
ఇక్కడివరకూ ఇది పాతవార్త… వర్తమానంలోకి వద్దాం…
అసలు ట్విస్ట్ చెప్పుకుందాం… ఆ పిల్లలు బతికే ఉన్నట్టు పెట్రోస్ ప్రకటించాడు కదా… ఆ వెంటనే ఆ ట్వీట్‌ను డిలిట్ చేశాడు, అదేమిటయ్యా అనడిగితే ఆ పిల్లలు బతికి ఉన్నట్టు ధ్రువీకరణ ఏమీ లేదు… పిల్లలతో సైన్యానికి, రెస్క్యూ ఆపరేషన్ సిబ్బందికి కంటాక్ట్ దొరకలేదని, ఇంకా సెర్చింగు సాగుతోందనీ చెప్పాడు… నిజంగానే ఆ పిల్లలు బతికే ఉన్నట్టు ఎవరూ ధ్రువీకరించలేదు… పిల్లలు అప్పటికి దొరకలేదు కూడా…
నిజంగానే అబ్బురం… ఆ పిల్లలు మొండిగా ఆ అడవిలో దొరికినవి తింటూ, నీడ వెతుక్కుంటూ తిరుగుతూనే ఉన్నారు… 40 రోజులపాటు ఆ భీకరమైన అడవిలో క్రూరమృగాలు, విషసర్పాలకు చిక్కకుండా… ఒకరికిఒకరు నీడగా, తోడుగా ‘‘బతుకు’’ కోసం పోరాడుతూనే ఉన్నారు… తరువాత ప్రభుత్వం కూడా ఏ ప్రకటనా చేయలేదు… పిల్లల ఆచూకీ దొరికితే కదా… అప్పుడప్పుడూ లోకల్ మీడియా చురకలు పెడుతూనే ఉంది…
శుక్రవారం రాత్రి పెట్రో ప్రెస్‌మీట్ పెట్టి ఆ పిల్లల్ని కనిపెట్టామనీ, నలుగురూ బతికే ఉన్నారని చెప్పాడు… ఇదిగో ఈ ఫోటో కూడా మీడియాకు ఇచ్చారు… పిల్లలు ఎండుకుపోయినట్టుగా కనిపిస్తున్నా సరే, అందరూ బతికే ఉన్నారు… రెస్క్యూ సిబ్బందిలోనే ఉన్న మెడికల్ పర్సన్స్ అక్కడికక్కడ కొంత వైద్యసాయం అందించినా సరే, పూర్తి పరీక్షలు- అవసరమైన చికిత్స కోసం సమీపంలోని మెడికల్ మిలిటరీ సెంటర్‌కు తరలించారు…
సెర్చింగ్ టీమ్స్ ఓ మైలు రేడియస్‌లో వినిపించేలా పెద్ద స్పీకర్లలో పిల్లలను ఉద్దేశించి ధైర్యం చెప్పేవాళ్లు… పిల్లల అడుగుజాడల్ని బట్టి ట్రేస్ చేయడానికి ప్రయత్నించేవాళ్లు… పిల్లలు వేసుకునే టెంపరరీ షెడ్స్ ఆనవాళ్లు గమనిస్తూ తమ సెర్చింగ్ దారిని మార్చుకునేవాళ్లు… స్థానిక ఆదివాసీలు కూడా ఈ సెర్చింగులో సాయం చేసేవాళ్లు… ఎవరూ కనిపించని ఆ భీకరమైన అడవిలో ఆ పిల్లలు 40 రోజులపాటు తిరుగుతూ, వీలున్నచోటల్లా తలదాచుకుంటూ, ఏదో ఒకటి తింటూ బతకడం ఓ సినిమా స్టోరీలాగే ఉంది కదా… అన్నింటికీ మించి అడవిలో ఎలా బతకాలనేది వాళ్ల నెత్తురులో ఉంది… అదే ఈ ఆపదవేళ బయటికి వచ్చి, వాళ్లను అలా బతికించిందేమో…!!
Share this Article