మెగా కంపౌండ్ అంటేనే హీరోల ఉత్పత్తి ఫ్యాక్టరీ… కొందరు నిలదొక్కుకున్నారు… కొందరు పల్టీలు కొడుతూనే ఉన్నారు… మొత్తానికి ప్రొడక్షన్, మార్కెటింగ్, సేల్స్ అన్నీ ప్లాన్ ప్రకారం పర్‌ఫెక్ట్‌గా సాగుతుంటయ్… పాపులారిటీ విషయంలోనూ జనం, ప్రత్యేకించి నెటిజనం వాళ్లను అభిమానిస్తూనే ఉన్నారు… తాజా తార్కాణం ఏమిటంటే…?
ఆర్మాక్స్ మీడియా అనేది ప్రతి పదిహేను రోజులకోసారి, నెలకోసారి మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్, ఫిమేల్ స్టార్స్ అనే కేటగిరీలను అప్‌డేట్ చేస్తూ ఉంటుంది… అవేకాదు, వాళ్లకు ఏ టాపిక్ బుర్రలో మెదిలితే దాని మీద ఆన్‌లైన్ సర్వే పెట్టేసి, తమ డేటా బ్యాంకులో ఉన్న సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసేసుకుని, క్రోడీకరించేస్తుంది… అసలు దాని వోటింగ్ పద్ధతే కాస్త డిఫరెంట్… సరే, మనకు నచ్చినా నచ్చకపోయినా, అదొక సర్వే పద్ధతి…
ఆగస్టు-22 నాటికి తెలుగులో పాపులర్ మేల్ స్టార్స్ ఎవరయ్యా అని లెక్క తీసింది… ఆ పది మందిలో అల్లు అర్జున్ మూడో ప్లేసు… రాంచరణ్ నాలుగో ప్లేసు… పవన్ కల్యాణ్ ఆరో ప్లేసు… చిరంజీవి తొమ్మిదో ప్లేసు… పది మందిలో నలుగురూ వాళ్లే… చిరంజీవితోపాటు తన అల్లుడు, తన కొడుకు, తన తమ్ముడు… వకీల్ సాబ్‌తో పవన్, ఆచార్యతో చిరంజీవి, ఆర్ఆర్ఆర్‌తో రాంచరణ్, పుష్పతో బన్నీ ఈమధ్య తెర మీదకొచ్చినవాళ్లే… అజ్ఞాతంలో ఉన్నవాళ్లెవరూ లేరు…
Ads
రాధేశ్యామ్ డిజాస్టర్ అయినా సరే, ఇప్పటికీ ప్రభాసే పాపులర్ నెంబర్ వన్… ఆర్ఆర్ఆర్‌తో జూనియర్ మళ్లీ కాస్త పాపులారిటీ పెంచుకున్నాడు… మహేశ్ బాబు కొన్నాళ్లుగా వార్తల్లో లేడు, తెర మీద లేడు… అంటే సుందరానికి ఫెయిలైనా సరే నాని ఇంకా జనం చర్చల్లో ఉన్నాడు… అలాగే లైగర్ దెబ్బతిన్నా సరే విజయ్ దేవరకొండ పాపులారిటీ కూడా అలాగే ఉంది… రవితేజ గురించి నో కామెంట్… సినిమాల జయాపజయాలతో నిజానికి సంబంధం లేదు… ఎవరు బెటర్ అనే ప్రశ్నకు ఆ పర్టిక్యులర్ మీడియా డేటాలోని నెటిజనం ఏం ఫీలయితే అదే ఈ సర్వే రిజల్ట్‌లో రిఫ్లెక్టవుతుంది… అందుకే ఇది స్థూలంగా ప్రేక్షకుల అభిప్రాయంతో పోలి ఉండాల్సిన అవసరమూ లేదు…
పాపులర్ ఫిమేల్ స్టార్స్ విషయానికొస్తే… సమంత నంబర్ వన్… (తమిళ జాబితాలో నెంబర్ టూ…) చాన్నాళ్లయింది ఆమెను తెర మీద చూసి… కానీ వార్తల్లో ఉంటూనే ఉంది… ప్రేక్షకుల్లో ఆమె పట్ల ఇష్టం ఉంది… అసలు పెళ్లయి, చాన్నాళ్ల క్రితమే ఫీల్డ్ వదిలేసిన కాజల్ రెండో ప్లేసు… అనుష్క శెట్టి తెర మీద కనిపించి చాలా రోజులైంది… ఐనా మూడో ప్లేసు… (తమిళంలో ఎనిమిదో ప్లేసు)… సాయిపల్లవి నాలుగో ప్లేసు… (తమిళ పాపులర్ ఫిమేల్ స్టార్స్‌లో తొమ్మిదో ప్లేసు, గార్గి రీసెంటుగా తనను ఇమేజీ తెర మీద సందడిగా ఉంచుతోంది)…
నెంబర్ వన్ అని బయట మీడియా పదే పదే రాసే పూజా హెగ్డేకు ఈ సర్వేలో అయిదో ప్లేసు… రాధేశ్యామ్, బీస్ట్ ఫ్లాపుల ప్రభావం పడినట్టుంది… కీర్తి సురేష్ ఆరో ప్లేసు… (తమిళంలో నాలుగో ప్లేసు)… తమన్నా ఏడో ప్లేసు… నిజానికి మంచి సక్సెస్‌లతో రష్మిక టాప్ వన్ ప్లేసులో ఉండాలి కదా… కానీ ఎనిమిదో ప్లేసు… నెటిజనం ఇష్టం అది, దానికి పెద్ద రీజన్స్ ఏముంటయ్..? అనుష్కను, కాజల్‌ను ఇప్పటికే ప్రేమిస్తూనే ఉన్నారుగా… కృతిశెట్టి తొమ్మిదో ప్లేసు… ఆమె పట్ల నెటిజనంలో, యూత్‌లో అట్రాక్షన్ ఉంది… పదో ప్లేసులో రాశిఖన్నా… కొన్ని సర్వేలు, ఫలితాలు కాస్త ఇంట్రస్టుగా అనిపిస్తాయని చెప్పుకోవడం కోసమే ఈ కథనం…!!
Share this Article