బిగ్‌బాస్ షో చూసేవాళ్లలో ఎవరు విజేత అనే ఆసక్తి… షణ్ముఖా, సన్నీయా, శ్రీరాంచంద్రా..? ఎవరు..? కొన్ని లీకులు సన్నీయే కప్పు గెలిచాడు అంటున్నయ్, కొన్ని లీకులు శ్రీరాంచంద్ర అంటున్నయ్… హమ్మయ్య, ఆ వెకిలి షన్ను గాడు (గాడు అని ఉద్దేశపూర్వకంగానే రాయబడుతున్నది గమనించగలరు…) విజేత కావడం లేదనేది ఒక రిలీఫ్… ముందే బిగ్‌బాస్ టీంతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనీ, అందుకే ఆ నిద్ర ప్లస్ డర్టీ కేరక్టర్‌ను షోలో ఉంచుతున్నారనీ, నాగార్జున డ్యాష్ డ్యాష్ లేకుండా ప్రతీ వీకెండ్లో నెత్తిన పెట్టుకుని మోస్తూ వస్తున్నాడనీ ఓ విమర్శ ఉంది… ఇక సిరి గురించి చెప్పడానికేముంది..? మరీ చిల్లర..! షన్నూ కోసమే ఆమెను కూడా ప్యాకేజీలో అదనపు బెనిఫిట్ కింద ఇన్నాళ్లూ మోసినట్టుంది బిగ్‌బాస్ టీం…
బిగ్‌బాస్ టీం ఐపీఎల్‌కన్నా పెద్ద ఫిక్సర్ బ్యాచ్ అనిపించుకుంది కదా… మనం చాలాసార్లు చెప్పుకున్నాం… దీనివల్ల, ఈ మైండ్ లెస్ ఎలిమినేషన్లు, మీనింగ్ లెస్ ప్రమోషన్ల వల్ల తెర ముందు కనిపించే నాగార్జున తన ఇజ్జత్ పోగొట్టుకున్నాడని..! అంతేకాదు, ఈసారి బిగ్‌బాస్ పోకడతో ప్రేక్షకులు దూరమయ్యారు… రేటింగ్స్ దారుణంగా దెబ్బతిన్నయ్… మాటీవీకి తలబొప్పి కట్టింది… జనం నుంచి థూ అనే భారీ ఫీడ్ బ్యాక్‌తో మరి ఎవరి బుర్రలు లేటుగా వెలిగాయో గానీ… చక్కదిద్దుకోవడం స్టార్ట్ చేశారు… వోటింగ్ ట్యాంపరింగులో షన్నూ వెనకబడి సన్నీ ముందువరుసలోకి వచ్చాడు… సన్నీ ఓ ఎక్సెంట్రిక్ కేరక్టర్… చైల్డిష్ బిహేవియర్, తనే అంగీకరించాడు, తాను బిగ్‌బాస్ షోలో కనిపిస్తున్న కేరక్టర్ కాదని… కానీ తన భాష, తన దూకుడు, తన బాడీ లాంగ్వేజీ ఓ డిగ్రేడ్ టైప్… సో, విజేత షన్నూ అయినా, సన్నీ అయినా మాటీవీ ప్రేక్షకులకు పెద్దగా ఫరక్ పడదు… ఈ సీజన్ ఎప్పుడో డ్యాష్ డ్యాష్ అయిపోయింది కాబట్టి…
Ads
ప్రేక్షకుల సుడిగాలివానకు ఎలాగూ పంట దెబ్బతింది… కనీసం పరిగె ఏరుకుందాం అనే పనిలో పడ్డట్టుంది బిగ్‌బాస్ టీం… ఎప్పటిలాగే చిరంజీవి వంటి అగ్రనటుల్ని పిలవడం, ఆయన చిత్రవిచిత్ర హావభావాలతో ఓవరాతి యాక్షన్ చేయడంతో ఫాయిదా ఏముంది అనుకున్నట్టుంది… ఏకంగా ఒకే ఫినాలేకు 4 సినిమా ప్రమోషన్లను ప్లాన్ చేసింది… అయినకాడికి దులిపేసుకోవడం అన్నమాట… ఒకటి ఆర్ఆర్ఆర్… రెండు శ్యామ్ సింగరాయ్… మూడు పుష్ప, నాలుగు బ్రహ్మాస్త్ర… (బ్రహ్మాస్త్రలో నాగార్జున కూడా కలడని గమనించ మనవి…) అందుకే ఎస్‌ఎస్‌రాజమౌళి, ఆలియా భట్, రణబీర్, సుకుమార్, రష్మిక, జగ్గూభాయ్, నాని, సాయిపల్లవి, నవీన్ చంద్ర, కృతిశెట్టి, డీఎస్పీ, శ్రియలు ఈ ఫినాలేకు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది… ఈ శ్రియ ఎందుకో తెలియదు… పేరుకు ఫినాలేకు అగ్ర, ఉగ్ర దర్శకనటుల్ని పిలిచినట్టూ ఉంటుంది… వాళ్ల కొత్త సినిమాలకు ప్రమోషనూ జరుగుతుంది… యాడ్స్ కుమ్మేసినట్టూ ఉంటుంది… ఈ తెలివితేటలు షో మీద, నిజాయితీగా షో నడిపించడం మీద చూపిస్తే బాగుండు అని ఓ సగటు బుల్లితెర ప్రేక్షకుడు అనుకుంటే… వాడి తప్పేమీ లేదు..!! అరెరే, పరంపర అనే hotstar సీరీస్ ప్రమోషన్ కూడా ఉంది… ఐదు సినిమాల ప్రమోషన్ అన్నమాట… ప్లస్ చైతూ ద్వారా vivo PRO కబడ్డీ ప్రమోషన్ కూడా… బంగార్రాజులో నటించిన ఫరియాను కూడా ఫినాలేకు రప్పించారు… #BBTeluguGrandFinale
Share this Article