ఆర్… రామోజీరావు ఈనాడు, ఆర్… రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి, ఆర్… రాజగోపాలనాయుడు టీవీ5… ట్రిపుల్ ఆర్… వీళ్లంతా జగన్ వ్యతిరేక శక్తులే… చంద్రబాబు అనుకూల వ్యక్తులే… బయటికి ఏం చెప్పుకోబడినా సరే, ప్రస్తుతం జగన్ అధికారాన్ని కూల్చాలని విశ్వప్రయత్నం చేస్తున్నవారే… అందరి సామాజికవర్గమూ ఒకటే… అందరూ జగన్ ప్రారంభించిన కులసమరంలో ఒకవైపుకు నెట్టేయబడినవారే…
ఈ ట్రిపుల్ ఆర్‌కు మరో ఆర్ జతచేరుతుందా..? అదే సామాజికవర్గం… గతంలో అదే జగన్ వ్యతిరేకత… ఈ ఆర్ పేరు రవిప్రకాష్… టీవీ9 ఫౌండర్… తెలుగు మీడియా చరిత్రలో తనకూ ఓ అధ్యాయం ఉంది… కేసీయార్ ఆగ్రహానికి గురై ఏకంగా టీవీ9 రాజ్యాన్నే కోల్పోయి, అయిదేళ్లుగా పోయినచోటే వెతుక్కోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్న జర్నలిస్టు…
నాలుగో ఆర్ అవుతాడా అనే సందేహానికి ఓ రీజన్ ఉంది… చాన్నాళ్ల తరువాత తన సొంత చానెల్ ఆర్టీవీ తెర మీదకు వచ్చాడు… పాత రవిప్రకాష్ మళ్లీ కనిపించాడు… ఓ సాహసాన్ని ప్రదర్శించాడు… తెలంగాణ, ఏపీల్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయో బద్దలు కొట్టాడు… అవి నిజమవుతాయా లేదానేది వేరే సంగతి… కానీ బీఆర్ఎస్‌కు మరీ జీరో సీట్లు అన్నాడు…
Ads
ఎస్, కేసీయార్ తనను ఎన్ని అవస్థలు పెట్టాడో తనకు తెలుసు… కడుపులో కోపం రగిలిపోతూ ఉండవచ్చు… కానీ నిజంగా బీఆర్ఎస్ జీరో సీట్లకు పరిమితమయ్యేంత ఘోర స్థితికి దిగజారిపోయిందా..? పార్టీ అంతర్గత కుదుపులతో, జనం ఛీత్కారాలతో సతమతం అవుతోంది నిజమే గానీ… ఈరోజుకూ తనకు పట్టున్న ఎంపీ సీట్లున్నయ్, కేసీయార్‌కు తోడు హరీష్, కేటీయార్ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేస్తున్నారు… అనూహ్యమైన పాయింట్లతో బీజేపీని, కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు…
బీజేపీకి 8, కాంగ్రెస్‌కు 8, బీఆర్ఎస్‌కు జీరో, మజ్లిస్ ఒకటి అంటున్నాడు ఆర్పీ… బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తున్న మాట నిజమే గానీ ఓవరాల్‌గా కాంగ్రెస్ ప్లసులో ఉంటుందనే ఓ జనరల్ అంచనా వ్యాపించి ఉంది, బీఆర్ఎస్ కూడా కొంత బెటర్ నంబర్ తెచ్చుకోవచ్చునంటున్నారు… సరే, బీఆర్ఎస్ గనుక మళ్లీ పుంజుకునే పక్షంలో రవిప్రకాష్ టార్గెట్ అవతాడు, అది రవిప్రకాష్‌కు కూడా తెలుసు… ఐనా సరే అంటాడు…
ఏపీ విషయానికివస్తే ఆర్టీవీకి వైసీపీ సహకారం ఉందనే ప్రచారం మాత్రం ఉంది… మరి అలాంటిది రాబోయే ఎన్నికల్లో జగన్ అధికారం కోల్పోయి, యెల్లో కూటమి పవర్‌లోకి వస్తుందనే అంకెల్ని రవిప్రకాష్ వెల్లడించాడు… యెల్లో కూటమి 105, వైసీపీ 69, కాంగ్రెస్ ఒకటి సీట్లు సాధిస్తాయని తన అంచనా… ఈ అంచనాలకు ఏ సర్వే ప్రాతిపదికో గానీ… (టీడీపీ 89, జనసేన 13, బీజేపీ 3)… ఒకవేళ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం…
పైన మనం చెప్పుకున్న ముగ్గురు ఆర్ జర్నలిస్టులకు మరో నాలుగో ఆర్ జర్నలిస్టు తోడయినట్టే… నలుగురూ జగన్ టార్గెట్లే అవుతారు… ఈసారి మరింతగా తన సీరియస్ కోపం చూడాల్సి ఉంటుంది… అందుకే రవిప్రకాష్ ఓ సాహసం చేసినట్టే… సాధారణ జర్నలిస్టు వేరు, రవిప్రకాష్ వేరు కదా… అందుకే ఇలా ప్రత్యేకంగా చెప్పుకోవడం… అంతే…!!
Share this Article