Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లతా, ఎందుకు చేశావీ పని..? గాంధీ మునిమనమరాలు- ఓ ఫ్రాడ్ కేసు..!!

June 17, 2025 by M S R

.

ఈ కేసు మళ్లీ ఎందుకు ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చిందో… ఇదేదో తాజా వార్త అన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎందుకు పబ్లిష్ చేస్తున్నారో తెలియడం లేదు… అది మహాత్మా గాంధీ మునిమనుమరాలు ఆషిష్‌ లత రామ్‌గోబిన్‌ (56)కు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు…

గాంధీ పేరుంటే ఏం చేసినా చల్తా అనుకోవడానికి అది ఇండియా కాదు… ప్రశ్నించే గొంతులపై కత్తి, ప్రతిపక్షంపై రాజకీయ కక్ష అని ఆరోపించడానికీ అక్కడ చాన్స్ ఉండదు… పైగా గాంధీ మునిమనమరాలు ఐనంతమాత్రాన ఆ రక్తంలో ఏవో నైతిక విలువలు పారుతూ ఉంటాయనీ అనుకోవద్దు…

Ads

విషయం ఏమిటంటే..? ‘‘ ప్రముఖ హక్కుల కార్యకర్త ఇలా గాంధీ, దివంగత మెవా రామ్‌గోబిన్‌ల కుమార్తె లత… వ్యాపారవేత్త ఎస్‌ఆర్‌ మహరాజ్‌ను 3.22 కోట్లకు మోసం చేసింది. నేరం రుజువుకావడంతో దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్‌ కోర్టు శిక్ష ఖరారు చేస్తూ, అప్పీలు చేసుకునే అవకాశాన్నీ నిరాకరించింది…

తనకు తాను ఆహింసావాదిగా, హక్కుల కార్యకర్తగా చెప్పుకునే లత రామ్‌గోబిన్‌ను, వ్యాపారవేత్త ఎస్‌ఆర్‌ మహరాజ్‌ 2015లో కలిశారు… ఆయన వస్త్ర, పాదరక్షల వ్యాపారి… ఇతర వ్యాపారవేత్తలకు అవసరమైన నిధులు సమకూరుస్తూ లాభంలో వాటా తీసుకుంటారు…

‘దక్షిణాఫ్రికాలోని ఓ ప్రముఖ ఆసుపత్రి గ్రూప్‌నకు అవసరమైన ‘లైనిన్‌’ ఇండియా నుంచి దిగుమతి చేసుకున్నాను. కస్టమ్స్‌, దిగుమతి సుంకం చెల్లించాలి. ప్రస్తుతం నా దగ్గర అంత పెట్టుబడి లేదు. మీరు సమకూరిస్తే లాభంలో వాటా ఇస్తాను’ అంటూ లత.. మహరాజ్‌తో నమ్మబలికింది. ఏవో ఫోర్జ్‌డ్ ఇన్‌వాయిస్‌లు గట్రా చూపించింది…

gandhi

మహరాజ్‌ పెట్టుబడి సమకూర్చారు. కొద్ది కాలానికే ఆమె మోసం చేసిందని తెలుసుకున్న ఆయన పోలీస్‌ కేసు పెట్టాడు. అసలు ఆమె భారతదేశం నుంచి ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకోలేదని నిర్ధారణ అయింది. ఈ కేసులోనే ఆమెకు ఏడేళ్ల జైలుశిక్ష పడింది…’’

తప్పేముంది..? తగిన శాస్తే జరిగింది, మోసగించి డబ్బు కాజేయడం నేరమే కదా అంటారా..? కరెక్టు… కానీ ఈ శిక్ష ఇప్పటిది కాదు… 2021 జూన్ మొదటివారంలోని వార్త ఇది… అప్పుడే అన్ని పత్రికలూ పబ్లిష్ చేశాయి కూడా… సరిగ్గా నాలుగేళ్ల తరువాత మళ్లీ ఓ తాజా వార్తలాగా తెరపై కనిపిస్తోంది.., అదే విచిత్రం… ఇదుగో నాటి ఇండియాటుడే కథనం లింక్…

https://www.indiatoday.in/world/story/mahatma-gandhi-great-granddaughter-jailed-for-7-years-fraud-case-south-africa-1812236-2021-06-08

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ అక్రమ భవనాలకూ – జన్వాడ ఫామ్‌హౌజుకూ ఏమిటి లింకులు?!
  • మోదీకి ఇండొనేషియా అపూర్వ స్వాగతం – ఎందుకీ ప్రాధాన్యం అంటే?
  • మనకు తెలిస్తేనే నిజం- తెలియకపోతే అబద్ధం అయిపోదు… పునర్జన్మ!!
  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!
  • STOCK MARKET HUMOUR – Sorry, I haven’t verified the Data
  • ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!
  • TGRPDCL @ రైతు డిస్కమ్ – రేవంత్ రెడ్డి సర్కారు భలే ప్లాన్ !!
  • రొనాల్డో శకం ముగిసింది – ఫుట్‌బాల్ సామ్రాట్ కన్నీటి వీడ్కోలు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions