మంచి వార్త… అస్సాం నుంచి… ఎలాగూ 45 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత వేక్సినేషన్ ఖర్చును కేంద్రం భరిస్తోంది కదా… 18 నుంచి 45 ఏళ్ల నడుమ వయస్సున్న ప్రజలందరికీ ఉచితంగా వేక్సినేషన్ చేయించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… కోటి డోసుల్ని సప్లయ్ చేయాల్సిందిగా హైదరాబాద్, భారత్ బయోటెక్ కంపెనీకి ఆర్డర్ కూడా పెట్టింది… చెల్లింపు సామర్థ్యం ఉన్న వాళ్లకు ఎలాగూ ప్రైవేటు రంగంలో అందుబాటులో ఉంచుతున్నారు… కోవిషీల్డ్ ఆల్రెడీ తన ధరల్ని కూడా ప్రకటించింది… వచ్చే ఫస్ట్ తారీఖు నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతివాళ్లూ వేక్సిన్ వేయించుకోవచ్చు… ఎంతసేపూ క్షుద్ర రాజకీయాలతో వాడినీ వీడినీ బదనాం చేయడం తప్ప మరే నిర్మాణాత్మక పాత్ర పోషించలేని ధోరణి కదా మన పార్టీలది… ఎవరూ శుద్ధపూసలు కాదు, అందరూ అందరే.. ఈ స్థితిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం వేక్సినేషన్ పూర్తి బాధ్యతను పోషించడానికి ముందుకు రావడం బాగుంది… అలాగే మరో మంచి వార్త… పంజాబ్‌లో అవసరమైన వెంటిలేటర్స్, పీపీఈ కిట్స్ ఖర్చు భరించడానికి స్వర్ణ దేవాలయ కమిటీ ముందుకొచ్చింది… ఆర్థిక స్థోమత ఉన్న పెద్ద గుళ్లు ఈ విపత్తువేళ మానవసేవకు కదలాల్సిన అవసరాన్ని, కర్తవ్యాన్ని స్వర్ణ దేవాలయం గుర్తుచేసింది… అభినందనీయం…
Assam will give FREE vaccines to everyone from 18-45 years. GOI is giving free vaccines for 45 +.
Funds collected in Assam Arogya Nidhi last year shall be utilized for procurement of vaccines.
Today itself, we’ve placed orders for 1 cr doses with @BharatBiotech.@PMOIndia pic.twitter.com/U6hutOEOhg
— Himanta Biswa Sarma (@himantabiswa) April 20, 2021
Ads
- రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, తన్నుకోవచ్చు, తిట్టుకోవచ్చు… కానీ ఈ విపత్తు వేళ కూడా అవే డర్టీ పాలిటిక్స్ కనిపిస్తున్నయ్…
- వేక్సిన్ రెడీ అవుతూ, మూడో దశ ప్రయోగాలు పూర్తిగాకముందే అర్జెన్సీ పేరిట అనుమతులు ఇస్తే తిట్టిపోశారు, ఆ తిట్టిన గొంతులే ఇప్పుడు వేక్సిన్ అధికంగా ముందుగానే ఉత్పత్తి చేయించాలి కదా అని అరుస్తున్నయ్…
- ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఉచితంగా వేక్సిన్లు వేయించింది ప్రభుత్వమే, కంపెనీలు వేక్సిన్లను యథేచ్ఛగా పొరుగుదేశాలకు అమ్మేసుకోకుండా తను పగ్గాలు పట్టుకుని, కంట్రోల్ చేయసాగింది… 45 ఏళ్ల వయస్సు దాటిన వాళ్లందరికీ ప్రభుత్వరంగంలో ఉచిత వేక్సిన్ అమలు చేస్తోంది… ఐనా తిట్టేవాడు తిడుతూనే ఉన్నాడు… ఇప్పటికే 13 కోట్ల డోసుల వేక్సినేషన్ జరిగింది… రాత్రికిరాత్రి అబ్రకదబ్ర అనగానే తెల్లారేసరికి అందరికీ టీకాలు పడవు… ఏ వేగంతో వెళ్తున్నామనేదే చూసుకోవాలి…
- అధికారంలో ఎవరున్నా సరే, ఏ పార్టీ ఉన్నా సరే… విపత్తుల్ని కోరుకోడు… రోజుకు 3 లక్షల కేసులు అధికారికంగానే నమోదయ్యే ఉధృతిని ఎవరూహిస్తారు..? వెంటిలేటర్లు, ఆక్సిజెన్ కొరత నిజం… ఈ కరోనా వ్యాప్తి తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్ల వచ్చిన సమస్య… ఈ ఎమర్జెన్సీలో సిట్యుయేషన్ ఎలా టాకిల్ చేయాలనేదే ప్రస్తుతం ఆలోచించాలి… ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఆక్సిజెన్ నిల్వల్ని సమీకరిస్తున్నారు… అంతకుమించి గత్యంతరమూ లేదు…
- ఇప్పుడు అందుకోవాల్సింది రాష్ట్రాలు కూడా… 80-90 శాతం కేసుల్ని ఇళ్ల దగ్గరే ట్రీట్ చేయొచ్చు… ఎటొచ్చీ అవసరమైన వైద్యసలహాలు, కిట్లు ఇవ్వగలగాలి… వేక్సినేషన్ బాధ్యతలకు ముందుకు రావాలి… మాస్కు ఒక్కటే పరమౌషధం కాదు, లాక్ డౌన్లు, రాత్రి కర్ఫ్యూలతోనే సరిపోదు… అంతకుమించి చేయాల్సింది చాలా చాలా ఉంది… ప్రత్యేకించి యూపీ, కేరళ, కర్నాటక, మహారాష్ట్రల్లో పరిస్థితులు అదుపు తప్పుతున్నయ్… ఏపీ, తెలంగాణ కూడా తక్కువేమీ కాదు… ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించే.., రోజువారీ సమీక్షలు, సరైన నిర్ణయాలు కావాలిప్పుడు… కానీ… ప్చ్…!!
- కనీసం ఆక్సిజెన్ పరిస్థితిని కోఆర్డినేట్ చేసుకోగలరా, లేక అదీ వదిలేస్తారా..? మహారాష్ట్రలో ఆక్సిజెన్ లీకేజీ సంఘటనలో 22 మంది మరణించిన విషాదం మన ప్రభుత్వ యంత్రాంగాల పనితీరుకు అద్దం పడుతోంది…
- అన్నింటికన్నా ప్రధానంగా…. ఒకవైపు ప్రైవేటు రంగంలో వేక్సినేషన్‌ను ఎంకరేజ్ చేస్తూనే… ఎలాగూ 45 ఏళ్లకు పైబడిన వాళ్లకు వేక్సినేషన్ ఖర్చు భరిస్తున్న కేంద్రమే 18 ఏళ్లకు పైబడిన వాళ్లందరికి కూడా ఉచితంగా వేక్సిన్లు వేయించొచ్చు కదా… యుద్ద ప్రాతిపదికన అమలు చేయొచ్చు కదా… ఓ బృహత్తర యజ్ఞాన్ని చేపట్టవచ్చు కదా… తిట్టే నోళ్లు మూతపడేలా టీకాలు వేయొచ్చు కదా… అసలు ఇంతకుమించిన పాలనవిధి ఇంకేముంది ఇప్పుడు..? ఇదీ విలువైన ప్రశ్నే… మోడీ ఈ సంకల్పం తీసుకోగలడా..?! జనహితానికి ఓ భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోగలడా..?!
Share this Article