మోడీ దుర్మార్గుడు… మోడీ దుష్టుడు అని తిడుతూ కూర్చోవడం కాదు….. మీడియా ముందు కోతలు కోసి, తరువాత నిజంగా అవసరమున్నప్పుడు మొహాలు చాటేయడం కాదు…. తక్షణం తామేం చేయాలో నిర్ణయం తీసుకోవాలి, తమ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులపై నిజమైన సమీక్షలు జరపాలి… జనానికి భరోసాగా నిలవాలి… విపత్తు వేళ పాలకుడు ఎలా ఉండాలో నిరూపించుకోవాలి… ఇప్పుడు కాకపోతే ఇక ప్రభుత్వాలు దేనికట..? తిట్టొచ్చు, మోడీని తిట్టడమే రాజకీయం అనుకుంటే తిట్టడానికి చాలా రీజన్స్ దొరుకుతయ్, బోలెడు టైముంది… ప్రజల్ని మోడీ దయాదాక్షిణ్యాలకు వదిలేయకండి…………….. ఇదే మొన్న ‘ముచ్చట’ రాసింది… దేశంలో నలుగురైదుగురు ముఖ్యమంత్రులు తమ బాధ్యతల్ని సరిగ్గా గుర్తించారు, ఆక్సిజెన్ సప్లయ్స్ విషయంలో గానీ, తక్షణం తాత్కాలిక కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడంలో గానీ ప్రయాసపడుతున్నారు… నిజానికి జగన్ వెంటనే స్పందించాలి కదా ఇలాంటి విషయాల్లో, ఇంకా ఎందుకు స్పందించడం లేదబ్బా అనుకుంటూనే ఉన్నా… చేతల మనిషి కదా… ప్రకటించేశాడు… అభినందనలు జగన్…
వాడిని వీడు తిట్టడం, వీడిని వాడు తిట్టడం… ఒకడి మీద మరొకడు ఏడ్వడం… ఈ క్షుద్రరాజకీయం ఎలాగూ తప్పదు… కానీ జనం తక్షణ అవసరాలు తీరేది ఎలా..? అది ఆలోచించేవాడు మంచి పాలకుడు… యూపీ, ఎంపీ, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల్లాగే జగన్ కూడా ఆ దిశలోనే ఆలోచించాడు… 18 ఏళ్ల వయస్సు దాటిన వాళ్లందరికీ ఉచితంగా వేక్సిన్ వేస్తామని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది… 45 ఏళ్లు దాటిన వాళ్లకు వేక్సినేషన్ ఖర్చు ఎలాగూ కేంద్రమే భరిస్తోంది… ఇప్పుడిక రెండు కోట్ల మంది భారం జగన్ ఎత్తుకున్నాడు… ఎస్, జనానికి మంచి చేయాలనే సంకల్పం ఉండాలి సీఎం కుర్చీ మీద ఉన్నవాడికి…
Ads
సెకండ్ వేవ్ ఉధృతి పెరుగుతుండగానే జవహర్‌రెడ్డిని కమాండ్ కంట్రోల్ ఇన్చార్జిని చేశారు… తాను గతంలో కరోనా విషయంలో మంచి వర్క్ చేసి ఉన్నాడు… జిల్లాల వారీగా కోవిడ్ నోడల్ ఆఫీసర్లను నియమించారు… సెకండ్ డోస్ అందరికీ మస్ట్ అన్నారు, స్టార్ట్ చేశారు… టెస్టుల సంఖ్య పెంచారు… మరి వేక్సిన్..? ఖర్చు ఎంతయినా సరే అనుకుంది ప్రభుత్వం… సీఎం నేరుగా భారత్ బయోటెక్, హెటిరో ముఖ్యులతో మాట్లాడాడు… ఇంకేముంది..? ఉచిత వేక్సిన్ నిర్ణయం జరిగిపోయింది… ‘‘నేను కోతల సీఎంను కాను, నేను చేతల సీఎంను’’ అని చేతల ద్వారానే నిరూపించుకునే ప్రయత్నం అభినందనీయం… ఇదే స్పూర్తి ఆక్సిజెన్ సప్లయ్స్, తక్షణ పడకల ఏర్పాటుపైనా కనబరిస్తే జనానికి పెద్ద రిలీఫ్… జనానికి బాగా కనెక్టయ్యే ఉపయుక్త అంశాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకునే గుణం జగన్‌కు బహుశా తన తండ్రి నుంచి వచ్చి ఉంటుంది… 108, 104, ఆరోగ్యశ్రీ వైఎస్‌కు ఎంత మంచి పేరు తీసుకొచ్చాయో, ఎన్ని వేల ప్రాణాల్ని నిలిపాయో తెలుసు కదా… ఈ స్పిరిట్ కాపాడుకో జగన్…
Share this Article