ఒక రోమన్ తత్వవేత్త ప్రకారం స్నేహితులు 5 రకాలు
1. బెస్ట్ ఫ్రెండ్స్: ప్రతి మనిషికి 1- 2 ఉంటారు. ఈ స్నేహం ఎందుకు ఏర్పడుతుందో, ఎలా ఏర్పడుతుందో తెలియదు కానీ ప్రతి మనిషి జీవితం లో ఒకరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. మన జీవితం అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నా, పరిస్థితులు బాగా లేని స్థితిలో ఉన్నా ఈ స్నేహంలో మార్పు ఉండదు. ఇద్దరికి మించి ఏ ఒక్కరికీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు. మనకు ఉన్న స్నేహితుల్లో ఆ ఒకరిద్దరు ఎవరో తెలుసుకోవాలి. ఆ బెస్ట్ ఫ్రెండ్ భార్య లేదా భర్త అవ్వొచ్చు, సోదరులు/సోదరీమణులు అవ్వొచ్చు, తల్లి తండ్రులు అవ్వొచ్చు, మనతో చదువుకున్నవారు లేదా ఆ తర్వాత పరిచయం అయిన ఎవరైనా అవ్వొచ్చు.
2. క్లోజ్ ఫ్రెండ్స్: ప్రతి మనిషికి 2- 4 క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ స్నేహితులు మనకు అత్యంత సన్నిహితంగా అనిపిస్తారు. అన్నీ బాగుంటే వీళ్ళే ప్రాణ స్నేహితులు అనిపించవచ్చు కానీ పరిస్థితులు మారితే ఈ స్నేహం కూడా మారే అవకాశం ఉంటుంది. క్లోజ్ అని భావించడం తప్ప రియల్ క్లోజ్ నెస్ ఉండకపోవచ్చు. ఈ స్నేహితులు మన జీవితంలో ఆనందాన్నిచ్చినా, పరిస్థితులు మారినప్పుడు ఈ స్నేహంలో కొంత దూరం రావచ్చు.
Ads
3. గుడ్ ఫ్రెండ్స్: ప్రతి మనిషికి 4- 10 మంది గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ స్నేహితులు పూర్తి అవసరాల పునాదిపై ఏర్పడతారు. అత్యధికంగా 12 మంది వరకు ఉండవచ్చు. మనం గొప్ప స్థితిలో ఉన్నప్పుడు ఈ స్నేహితులు మనతో స్నేహంగా ఉంటారు, ఆప్యాయంగా మాట్లాడతారు. అయితే, మనం కష్టాల్లో పడినప్పుడు, లేదా పరిస్థితులు బాగా లేని స్థితిలో ఉన్నప్పుడు, ఈ స్నేహితులు కొన్నిసార్లు దూరంగా ఉండవచ్చు, ఫోన్ చేసినా స్పందించకపోవచ్చు.
4. కాజువల్ ఫ్రెండ్స్: అవతలివారి స్థాయి, డబ్బు, అభిరుచులపై ఆధారపడి, ప్రతి మనిషికి 10- 26 వరకు కాజువల్ ఫ్రెండ్స్ ఉండవచ్చు. ఈ స్నేహితులు మన జీవితంలో ప్రాధాన్యత తక్కువగా ఉండవచ్చు, కానీ ఆప్యాయత, సంతోషం కోసం వీరి సాంగత్యం ఉపయోగపడుతుంది. వీరితో ఏర్పడిన స్నేహం సాధారణంగా గమనీయమైన మార్పులు లేకుండా ఉంటుంది, కానీ ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది.
5 సోషల్ మీడియా ఫ్రెండ్స్: ఈ స్నేహితులు మనం సామాజిక మాధ్యమాల ద్వారా కలుసుకుంటాము. వీరితో మనం ఆన్‌లైన్‌లో చాట్ చేయవచ్చు, అనుభవాలు పంచుకోవచ్చు. ఈ స్నేహం ప్రపంచాన్ని మనకు అందుబాటులో ఉంచుతుంది, వివిధ సంస్కృతులు, మనుషుల గురించి తెలుసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. ఈ స్నేహం ద్వారా మనం సులభంగా కొత్త అనుభవాలు, జ్ఞానాన్ని పొందవచ్చు. అయితే, ఈ స్నేహం గాఢత చాలా సందర్భాలలో తక్కువగా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా లో పరిచయం అయిన వారే బెస్ట్ ఫ్రెండ్స్ లేదా క్లోజ్ ఫ్రెండ్స్ లేదా గుడ్ ఫ్రెండ్స్ లేదా కాజువల్ ఫ్రెండ్స్ అవ్వొచ్చు.
……. స్నేహమేరా జీవితం అని మాట్లాడుకోవడానికి బాగా ఉంటుంది. కానీ ప్రతి స్నేహం లో ఉండేది “అవసరాలు, కోరికలు, గుర్తింపు” మాత్రమే. ఈ మూడు కాకుండా స్నేహం గురించి ఇంకేమి మాట్లాడినా వినేవాడి మూర్ఖత్వన్ని బట్టి చెప్పే వాడి మాటలు ఉంటై.
స్నేహం అంటే ఒక మాయా బజార్. చాలా సార్లు లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు కనిపిస్తుంది. ఇది ఒక భిన్నమైన బంధం. కొన్నిసార్లు నిజం ఉంటుంది, కొన్నిసార్లు అబద్ధం ఉంటుంది. స్నేహంలో క్లారిటీ మరియు బౌండరీలు ఉంటే మంచిది అని ఒక అభిప్రాయం.
మనతో కలిసి పని చేసేవారిని కో-వర్కర్స్ అంటారు కానీ స్నేహితులు అనరు. మనతో కలిసి చదువుకున్నవారిని క్లాస్ మేట్స్ అంటారు కానీ స్నేహితులు అనరు. మన ఇరుగు పొరుగు వారు, బంధువులు, ఇంకా ఎవరైనా, వారికి కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. అందరినీ స్నేహితుల లిస్ట్‌లో పెట్టుకుంటే, ఏదో ఒక రోజు బాధపడటం జరుగుతుంది. అయితే, వీరిలో కొందరు మన అభిరుచులు, వేవ్ లెంగ్త్స్ కలిసినప్పుడు స్నేహితులు అవుతారు. వారితో మాత్రం పరిస్థితులు ఎలా ఉన్నా, స్నేహంగానే ఉండాలి….. [ జగన్నాథ్ గౌడ్ ]
Share this Article