పార్ధసారధి పోట్లూరి……. ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ! ఇప్పుడు ? పెట్రోల్ కోసం కాట్ల కుక్కలలాగా కొట్టుకుంటున్నారు గాస్ స్టేషన్ల దగ్గర. గత వారం రోజులుగా బ్రిటన్ లో పెట్రోల్ కోసం ప్రజలు పెట్రోల్ పంపుల దగ్గర కిలోమీటర్ల కొద్ది వేచి ఉంటున్నారు. పెట్రోల్ కొరత ఏర్పడింది అని మొదట్లో పుకార్లు వ్యాపించడమే మొదటి కారణం అయితే జనాలు పుకార్లని బాగానే నమ్మేసి అందరూ ఒకేసారి పెట్రోల్ కోసం క్యూ కట్టడంతో చాలా వరకు పెట్రోల్ స్టేషన్లు అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్ లు పెట్టేసాయి. ఎప్పుడయితే అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్ లు కనపడడం మొదలుపెట్టాయో జనాలలో అనుమానాలు మొదలయ్యి ముందు జాగ్రత్తగా పెట్రోల్ నిల్వ చేసుకోవడమ్తో పెట్రోల్ కి కొరత ఏర్పడింది.
యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలిగిపోవడం ఒక కారణం అయితే నెలల తరబడి లాక్ డౌన్ లో ఉండడం రెండవ కారణం. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బయటికి వచ్చేశాక యూరోపియన్ యూనియన్ దేశాల నుండి బ్రిటన్ కి రాకపోకల మీద ప్రభావం పడ్డది. బ్రెక్జిట్ కి ముందు EU లోని వివిధ దేశాల ట్రక్కు డ్రైవర్లు బ్రిటన్ లో పనిచేసేవారు. ఎప్పుడయితే బ్రిటన్ EU నుండి బయటికి వచ్చేసిందో మెల్లగా ట్రక్కు డ్రైవర్లు తమ తమ దేశాలకి తిరిగి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఈలోగా కోవిడ్ వల్ల బ్రిటన్ చాలా కాలంగా లాక్ డౌన్ లో ఉండిపోయింది. లాక్ డౌన్ సడలించినప్పుడల్లా ట్రక్కు డ్రైవర్లు తమ తమ దేశాలకి తిరిగి వెళ్లిపోయారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత EU దేశాలకి వెళ్ళిన ట్రక్కు డ్రైవర్లు తిరిగి బ్రిటన్ కి రాలేదు. దాంతో పెట్రోల్ ని సరఫరా చేసే ట్రక్కులు మూలన పడ్డాయి డ్రైవర్లు లేక… బ్రిటన్ కి ఇప్పటికిప్పుడు లక్ష మంది వాలిడ్ లైసెన్స్ ఉన్న హెవీ ట్రక్ డ్రైవర్ల అవసరం ఉంది.
Ads
ట్రక్ డ్రైవర్ల కోసం EU దేశాల నుండి వచ్చే హెవీ ట్రక్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి వీసా నిబంధనలు సడలించింది బ్రిటన్, కానీ రావడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం EU దేశాలలో బ్రిటన్ కంటే ఎక్కువ జీతాలతో పాటు ఇతర సౌకర్యాలు దొరుకుతున్నాయి కాబట్టి వెనక్కి వెళ్ళిన ట్రక్ డ్రైవర్లు రావట్లేదు. చేసేది లేక బ్రిటన్ తన ఆర్మీ డ్రైవర్లని స్టాండ్ బై పెట్టింది. కానీ ఇప్పట్లో బ్రిటన్ కష్టాలు తీరే సూచనలు కనపడట్లేదు. తిక్క తిక్క నిబంధనలు పెట్టి వచ్చే వాళ్ళని తానే ఆపేస్తున్నది బ్రిటన్. మొన్నటి వరకు ఫార్మా సంస్థల ఒత్తిడికి తల వొంచి భారత్ తయారీ కొవీషీల్డ్ వాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి బ్రిటన్ లో ప్రవేశం లేదు అని బోర్డు పెట్టింది. ఇంతకీ ఆస్ట్రాజెనికా ఫార్ములానే కదా భారత్ లోని సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కొవీషీల్డ్ వాక్సిన్… మరి అదే ఆస్ట్రాజెనికా వాళ్ళదే కదా ? ఇలాంటి పిచ్చి నిర్ణయాల వల్ల బ్రిటన్ వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు మరోవైపు ట్రక్ డ్రైవర్ల కొరత పీడిస్తున్నది. ఒక్క పెట్రోల్ స్టేషన్స్ కo కాదు ఫుడ్ చైన్స్, సూపర్ మార్కెట్లకి ట్రక్ డ్రైవర్ల కొరత సెగ తగులుతున్నది. చివరికి హెల్త్ వర్కర్స్ కోసం పెట్రోల్ మిగల్చండి అంటూ హెల్త్ మినిస్టర్ ప్రజలని వేడుకోవడం చూస్తుంటే వీళ్లెంత ప్లాన్డ్ గా ఉన్నారో తెలిసిపోవట్లా! ఉన్నది డ్రైవర్ల కొరతే కానీ పెట్రోల్ కొరత కాదని తెలిసాక కూడా జనాలు పెట్రోల్ స్టేషన్ల మీద ఎగబడి కొనడం ఉంది చూశారు అదే పెద్ద నాగరికత ! భారత్ లోని ఉత్తర ప్రదేశ అంత జనాభా కూడా లేని బ్రిటన్ కి క్రైసిస్ మేనేజ్మెంట్ తెలీదు కానీ భారతీయులకి నాగరికత నేర్పామని గొప్పలు చెప్పుకుంటారు శుంఠలు…
Share this Article