.
ముందుగా అఘోరికి సంబంధించిన ఈ తాజా వార్త చదవండి…
.
Ads
రాష్ట్రంలో సంచలనాన్ని రేకెత్తిస్తున్న అఘోరీ మాత ఆత్మార్పణ కథ సుఖాంతంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుసనపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న అఘోరి మాతను పోలీసులు బుధవారం తెల్లవారుజామున క్షేమంగా తెలంగాణ సరిహద్దులు దాటించి మహారాష్ట్రకు తరలించారు. అఘోరి మాత సరిహద్దులు దాటించన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
కొండగట్టు, వేములవాడ దేవాలయాలను దర్శించుకొని ముత్యాలమ్మ టెంపుల్ కి ఆత్మార్పణ కోసం వెళుతున్న అఘోరి మాతను పోలీసులు సిద్దిపేటలో ఆధీనంలోకి చేసుకొని పోలీస్ ఎస్కార్ట్ మధ్య నెన్నెల మండలం కుసనపల్లిలోని సొంత ఇంటికి తరలించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో అఘోరి మాత వ్యవహారం ఉత్కంఠ రేపింది. అఘోరీ మాతను కాపాడేందుకు పోలీసులు కంటికి రెప్పలా ఇంటి వద్ద కాపలా కాశారు.
అఘోరి మాతను చూడడానికి ప్రజలకు, మీడియాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆమె ఇంటి వద్ద గత మూడు రోజులుగా గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో ఆమె ఇంటి వద్ద ఉత్కంఠ నెలకొంది. అఘోరి మాత ప్రకటించిన ఆత్మార్పణ నుంచి పోలీసులు ఆమెను కాపాడారు.
ఇదే క్రమంలో అఘోరి మాత ఆదేశాల మేరకు ఆమె తల్లిదండ్రులు మీడియా నుంచి ముప్పును నివారించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కలిసి వేడుకున్నారు. మీడియా ముందుకు రావడం అఘోరీ మాత విముఖతచూపింది. దీంతో గత మూడు రోజులుగా గృహనిర్భంధంలో ఉన్న అఘోరీ మాతను వారి తల్లిదండ్రులు, అఘోరి మాత ఇష్టానుసారంతో ఆమెను లిఫ్ట్ చేశారు.
భారీ పోలీస్ ఎస్కార్ట్ మధ్య మీడియా కంట కనబడకుండా మహారాష్ట్రకు తరలించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో నేన్నెల ఎస్సై ప్రసాద్ పోలీసు బలగాలతో అఘోరీ మాత వెంట వెళ్లి మహారాష్ట్రలో విడిచిపెట్టారు. రాష్ట్రంలో గత మూడు రోజులుగా నెలకొన్న టెన్షన్ కు తెరపడింది. అఘోరి మాత కథ సుఖాంతం కావడంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం, తల్లిదండ్రులు ప్రజలు రిలీఫ్ అయ్యారు…
సరే, ఓ న్యూసెన్స్ ప్రహసనానికి పోలీసులు ఎట్టకేలకు తెరవేశారు… అక్కడివరకూ వోకే… కానీ..? నిజానికి ఇంకోరకంగా డీల్ చేయాల్సిందేమో అనిపించింది… (పదే పదే ఆ వార్తలో అఘోరి మాత అంటూ రాయడం ఒక విషాదం..)
- అఘోరి ఆమెనా..? అతడా..? పోలీసులు వైద్యపరీక్షలు చేయించి తేల్చేయాల్సింది… కొద్దిరోజులుగా ఆ కేరక్టర్ వెంటపడి, వందల వీడియోలు చేస్తున్న జర్నలిస్టులు ఫస్ట్ చదివేందుకు వీలుగా ఓ ప్రకటనను రిలీజ్ చేయాల్సింది…
- గృహనిర్బంధంలోనే ఆ కేరక్టర్‌ను తమదైన శైలిలో కాస్త విచారించి… అసలు హఠాత్తుగా ఈ డ్రామాలు ఏమిటో, ఉద్దేశాలు ఏమిటో బయటపెట్టించాల్సి ఉండింది…
- ఆత్మార్పణ అంటే చట్టప్రకారం కేసు నమోదు చేయొచ్చు… ఆత్మహత్య సంకల్పం, ప్రయత్నం…
- నిజానికి అన్నింటికన్నా ముఖ్యంగా ఆ కేరక్టర్‌ను ఏదైనా పిచ్చాసుపత్రిలో చేర్పించి, సరైన సైకియాట్రిస్టులతో చికిత్స ఇప్పించి… స్వస్థత కలిగించి ఉంటే ఇంకా బాగుండేది…
- ఎందుకంటే..? సమస్య మన తెలంగాణకు వదిలిపోవచ్చు, కానీ తిరిగి రాదని ఏమీ లేదు… పోనీ, మహారాష్ట్రలోనే ఉండే పక్షంలో వాళ్లకూ ఓ సమస్యే కదా… అక్కడా ఇలాగే అఘోరిస్తుంది కదా… సో, శాశ్వత చికిత్సే అనుసరణీయం…
చివరగా ఆ వార్తలో బాగా నచ్చిన అంశం ఏమిటంటే..? మీడియా హైప్ వల్ల నష్టమేమిటో చివరకు ఆ కేరక్టర్‌కు కూడా అర్థమైంది… మీడియా ముప్పు నుంచి కాపాడాలని ఆమే వేడుకొంది… ప్రజెంట్ యూట్యూబ్ మీడియా అంటే మజాకా మరి..!!
Share this Article