‘‘…. త్రినేత్రం ఉంది… మన చంద్రశేఖరరావు గారికి కూడా మూడోనేత్రం ఉంది… ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, అన్ని విషయాలూ ఆయన త్రినేత్రంతో గ్రహించగలుగుతారు… కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండల్సిందిగా నాయకులకు సూచనగా చెప్పడం జరుగుతోంది…’’ అంటూ ఓ అయ్యగారు వివరంగా, సీరియస్‌గా చెబుతున్న చిన్న వీడియో బిట్ ఫుల్ వైరల్ ఇప్పుడు… (దిగువన ఆ లింక్ చూడొచ్చు…
https://www.facebook.com/reel/2156932197990704
ఏ ఉగాది పంచాంగ శ్రవణం నాటి వీడియో నుంచో ఆ బిట్ కట్ చేసి ఉంటారు… కాంగ్రెస్ వాళ్లో, బీజేపీ వాళ్లో… సర్క్యులేషన్‌లో పెట్టారు… వాట్సప్, ఫేస్‌బుక్, రీల్స్, షార్ట్స్, ఇన్‌స్టా, యూట్యూబ్… అన్నింటా బాగా వైరల్ అవుతోంది… బహుశా ఈమధ్యకాలంలో ఇంతగా వైరల్ అయిన వీడియో బిట్ మరొకటి లేదేమో… కానీ ఎందుకింత జనం చూస్తున్నారు..? షేర్ చేసుకుంటున్నారు..? (ఫోన్ ట్యాపింగ్ యవ్వారానికి సరిగ్గా ఆప్ట్…)
Ads
ఆ వైరల్ వెనుక కేసీయార్ పట్ల ఇంకా విపరీతమైన వ్యతిరేకత ఉంది… ఎలాంటోడిని నమ్మి ఈ తెలంగాణ పాలనను అప్పగించామో కదా అనే స్వీయసానుభూతి ఉంది… కేసీయార్ పాలనలో జరిగిన అక్రమాలు, ఘోరాల పట్ల ఆవేదన ఉంది… నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన వ్యతిరేకత, ఆగ్రహంకన్నా ఇప్పుడు కేసీయార్ మీద జనానికి కోపం పెరుగుతోంది… కాదు, ఓరకమైన ఏవగింపు…
సచివాలయం పోడు, ఫైళ్లు కదలవు, ఫామ్ హౌజ్ వదలడు… ప్రతి పథకంలోనూ అక్రమాలు… బూతులు, ఏతులు (గొప్పలు), దుర్భాషలు… ప్రశ్నిస్తే బెదిరింపులు… నియంతృత్వం, విపరీతమైన ఆర్జన… ప్రస్తుత సర్కారు తవ్వుతున్న కొద్దీ టన్నుల కొద్దీ పెంకాసులు, బురద, దుర్గంధం… తాజాగా కవిత అరెస్టుకు మించి ఫోన్ ట్యాపింగ్ యవ్వారమే జనంలో ఓరకమైన విభ్రమను కలగజేస్తోంది… ఔనా..? ఇన్ని దారుణాలు చేశారా..?
మనం మొదటి నుంచీ చెప్పుకుంటున్నదే… కేసీయార్ తన స్వార్థం తను చూసుకుంటూ అధికారగణాన్ని అలా జనం మీదకు వదిలేశాడని… ఎమ్మెల్యేలకు, మంత్రులకు జాగీర్లు రాసిచ్చినట్టే… వాళ్లు చెప్పినవాళ్లే అధికారులు… వాళ్లు చెప్పినట్టుగానే పాలన… నయా దేశ్‌ముఖ్‌లు… దోపిడీ… అవకాశవాదం… పీడన… కబ్జాలు, సంపాదన… ఫక్తు రాజకీయ పార్టీ పేరిట ఓ దుర్మార్గమైన నాయకత్వాన్ని తెలంగాణ నెత్తిన రుద్దిన విషాదం ఇది…
ప్రత్యర్థుల కదలికలు, సంభాషణల్ని ట్యాప్ చేయడం, రికార్డ్ చేయడం, పసిగట్టడం ప్రతి రాష్ట్రంలోనూ ఉంది… పెగాసస్‌ను మించి ఎన్నో రెట్ల టెక్నాలజీ వచ్చింది… అసాంఘిక శక్తుల వేటలో దాని అవసరమూ ఉందని సమర్థించుకోవచ్చు… కానీ జరిగింది ఏమిటి..? కొందరు అధికారులు ప్లస్ నాయకులు (కీలక స్థానాల్లో ఉన్నవాళ్లు సైతం) ఫోన్ రికార్డింగుల ఆధారంగా చివరకు హీరోయిన్లను కూడా బెదిరించి లోబరుచుకునే ప్రయత్నాలు చేశారనే వార్తలు (నిజానిజాలు దేవుడికెరుక) విభ్రమను మించి ఓ ఎలపరం కలిగించేవే…
నగల వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ధనిక వర్గాలకూ బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ అట… ఏమో, దొరికిన డిస్కులను జాగ్రత్తగా తెరిచి చూస్తే… అదుపులో ఉన్న పోలీస్ నోళ్లు చేదు నిజాల్ని చెబితే ఇంకెన్ని బాగోతాలు బయటపడతాయో… ఇదా పాలన..? పాలనంటే ఇది కాదు అనే ఓ ఉదాహరణ… బరిబాతల వికటంగా నవ్వుతూ కళ్లెదుట కనిపిస్తున్న ఉదాహరణ… అందుకే ఆ అయ్యగారి వీడియో అంత వైరలైంది… దాని వెనుక నమ్మకద్రోహానికి గురయ్యామన్న తెలంగాణ జనం రోదన ఉంది…!!
Share this Article