.
నిన్న ఒకేరోజు వెండి ధర 20 వేలు పడిపోయింది… (కిలోకు)… మొన్న ఒకేరోజు 20 వేలు పెరిగింది… మైండ్స్ షేక్ అవుతున్నాయి… జస్ట్, కొద్ది నెలల్లోనే 1.20 లక్షల నుంచి 2.50 లక్షల దాకా (ఒక దశలో 2.70 లక్షల దాకా) వెండి ధర పెరుగుతుందని ఎవరూ అనుకోలేదు నిజానికి… ఆ వ్యాపారంలో ఉన్నవారు కూడా అంచనా వేయలేదు…
ఇప్పుడు క్యూలు కట్టి మరీ కొంటున్నారు… నాకు తెలిసిన ఓ సేటు ఏకంగా రెండు క్వింటాళ్ల వెండి కొన్నాడు… సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అట… ఇంకా పెరుగుతందనే ప్రచారం జోరుగా ఉంది… నిజంగా పెరుగుతుందా..? అసలు ఎందుకు పెరుగుతోంది..? ప్రచారంలో ఉన్నట్టు ఫిబ్రవరి దాటేలోపు 3 లక్షలకు చేరుకుంటుందా..?
Ads
ఇది ఒక సీన్… మరో సీన్ బంగారం.., ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు… ఇది కూడా జస్ట్, కొద్ది నెలల్లోనే 70, 80 వేల నుంచి 1.40 లక్షల దాకా (తులం) పెరిగింది… పైన చెప్పిన సేటు గారే కిలో బంగారం కొన్నాడు… హైదరాబాదులోని ఓ బంగారం షాపు దగ్గర క్యూ… కానీ,, ఏమిటీ పెరుగుదల..? ఎన్నాళ్లు..? ఈ జోష్ ఇలాగే ఉంటుందా..? క్రాష్ అవుతుందా..? వెండి, బంగారం లోహాల్లో ఎందులో పెట్టుబడి బెటర్..?
(మార్కెట్ వర్గాల సమాచారాన్ని బట్టి ఈ కథనం... దీన్ని చదివి నిర్ణయాలు తీసుకోవద్దు... సొంత ఆలోచన, విశ్లేషణ మేలు)
ముఖ్యంగా వెండి (Silver) ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి… 2026లో కొత్త శిఖరాలను తాకనుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు…. కానీ ఇంతగా పెరిగింది కాబట్టి క్రాష్ అయ్యే అవకాశాలనూ కొందరు తోసిపుచ్చడం లేదు…
మోతీలాల్ ఓస్వాల్, జేఎం ఫైనాన్షియల్ వంటి సంస్థలు 2.70 నుంచి 2.90 వరకు అంచనా వేస్తున్నాయి… ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు…
-
గ్రీన్ ఎనర్జీ డిమాండ్…: సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), 5G టెక్నాలజీలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది… ఇది కేవలం ఆభరణంగానే కాకుండా ఒక ‘పారిశ్రామిక లోహం’గా మారడమే దీని ధరను పెంచుతోంది…
-
సరఫరా కొరత…: గత కొన్ని ఏళ్లుగా వెండి ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గట్టుగా పెరగడం లేదు… గనుల నుంచి వెండి వెలికితీతలో జాప్యం ధరలకు రెక్కలు తొడుగుతోంది…
-
రూపాయి బలహీనత…: అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల భారత్‌లో వెండి దిగుమతి ఖర్చులు పెరిగి, దేశీయ ధరలపై ప్రభావం చూపుతున్నాయి…
బంగారం vs వెండి..: ఏది సరైన పెట్టుబడి..?
2026లో ఏది ఎక్కువ లాభాలను ఇస్తుంది అనే విషయంలో నిపుణులు రెండు రకాలుగా విశ్లేషిస్తున్నారు…
-
వెండి (High Risk – High Return)…: వెండిలో ధరల మార్పులు (Volatility) చాలా ఎక్కువగా ఉంటాయి… ఒకే రోజులో వేల రూపాయలు పెరగడం లేదా తగ్గడం సాధ్యం. కాబట్టి, సాహసోపేతమైన పెట్టుబడిదారులు దీనిని ఎంచుకోవచ్చు… అంటే రిస్క్ ఉందీ, లాభాలకూ చాన్స్ ఉంది…
-
బంగారం (Safety First)…: బంగారం స్థిరమైన వృద్ధిని ఇస్తుంది… ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు బంగారం ఒక సురక్షితమైన ఆశ్రయంగా ఉంటుంది… 2026 చివరి నాటికి తులం బంగారం ₹1.5 లక్షల నుంచి ₹1.6 లక్షల వరకు చేరవచ్చని అంచనా… ప్రపంచ మార్కెట్‌ను బట్టి తగ్గవచ్చు కూడా…
- గోల్డ్ బాండ్లలో పెడితే… సేఫ్, కొంత ఇంట్రస్టు కూడా వస్తుంది… భౌతికంగా మన దగ్గర లోహం ఉంటే ఎప్పుడంటే అప్పుడు లిక్విడ్ చేసుకోచ్చు… కాకపోతే భద్రత భయం…
- బంగారాన్ని అన్ని దేశాలూ కొంటున్నాయి… కరెన్సీ విలువ క్షీణతకు అడ్డుకట్ట వేయడానికి మన దేశమూ (బ్యాంకులు) బంగారం నిల్వలు పెంచుతున్నాయి…
రేర్ ఎర్త్ మినరల్ పేరిట వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి చైనా వెండి ఎగుమతులు, సరఫరాల మీద ఆంక్షలు పెట్టే అవకాశం ఉన్నట్టు ఒక వార్త… అది జరిగితే మార్కెట్‌లో మరింత కొరత, ధర పెరుగుదల ఉండొచ్చు… వెండితో సత్వర ఛార్జింగ్ బ్యాటరీలను శామ్‌సంగ్ డెవలప్ చేసిందని మరో వార్త… అదీ నిజమైతే వెండికి మరింత గిరాకీ…
అమెరికా బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తే ఆ ప్రభావం బంగారం మీద పడుతుంది… జియోపాలిటిక్స్ ప్రభావం కూడా రాగి, వెండి, బంగారం రేట్ల మీద ఉంటుంది, మధ్యమధ్యలో ప్రాఫిట్ బుకింగులు ఉంటే, ధరలు పడిపోతాయి తాత్కాలికంగా…
ఇలా రకరకాల కారణాలు వెండి, బంగారాల మీద ప్రభావం చూపిస్తాయి… మార్కెట్ నిపుణులు కూడా గత ట్రెండ్స్ బట్టి, మార్కెట్‌లో లభ్యత, గిరాకీలను, ధరల పెరుగుదలను, క్షీణతను అంచనా వేస్తారు తప్ప… సరైన జోస్యం ఎవరూ చెప్పలేరు… కాబట్టి ఏ లోహం మీద పెట్టుబడైనా సరే.., పక్కాగా ఇంత లాభం వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు, పైగా క్రాష్ అయ్యే ప్రమాదాన్ని కూడా తోసిపుచ్చకూడదు… ఏదీ సేఫ్ కాదు, ప్రతిదీ రిస్కే… లాటరీ..!!
నిపుణుల సూచన…: ’70:30′ సూత్రం
పెట్టుబడిదారులు తమ మొత్తం పెట్టుబడిలో 70% బంగారంలో, 30% వెండిలో కేటాయించడం వల్ల రిస్క్ తగ్గుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు… కేవలం ఫిజికల్ (నగలు) రూపంలోనే కాకుండా, Silver ETFs లేదా Digital Gold ద్వారా పెట్టుబడి పెడితే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది…
Share this Article