Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పక్కా టైంపాస్ పల్లీ బఠాణీ సినిమా… జయసుధ ఎందుకు ఒప్పుకుందో…

October 19, 2025 by M S R

.

Subramanyam Dogiparthi….. సినిమా పేరు గాంధీనగర్ రెండవ వీధి…  ఓ నిరుద్యోగి , ఓ బడ్జెట్ పద్మనాభం కష్టాల కధ . చంద్రమోహన్ , రాజేంద్రప్రసాద్ స్నేహితులు . చంద్రమోహన్ తల్లీచెల్లెలుతో బడ్జెట్ బతుకుని లాక్కొచ్చుకుంటూ ఉంటాడు .

పైసా పైసా లెక్కేసి ఖర్చు పెడుతూ ఉంటాడు . మూలిగే నక్క మీద తాటికాయలా స్నేహితుడు రాజేంద్రప్రసాద్ ఊడిపడతాడు . ఎంత వదిలించుకుందామని ప్రయత్నించినా జిడ్డు లాగా వదలడు . నేపాల్ గూర్ఖా అని అబధ్ధమాడి గాంధీనగర్ రెండో వీధి కాలనీలో కాపలా ఉద్యోగం ఇప్పిస్తాడు .

Ads

అతని ఉద్యోగాన్ని రక్షిస్తానికి దొంగలాగా నటించి దెబ్బలు కూడా తింటాడు చంద్రమోహన్ . అక్కడ ఉండలేక వేరే ఊరికి బదిలీ చేయించుకుంటాడు . దానితో చంద్రమోహన్ పాత్ర ముగుస్తుంది .

రాజేంద్రప్రసాద్ మాజీ ప్రేయసి గౌతమి పాత్ర ఎంటరవుతుంది . అదే కాలనీలో టీచరుగా పనిచేసే జయసుధ రాజేంద్రప్రసాదుని తమ్ముడులాగా చూసుకుంటూ ఉంటుంది . కాలనీలో ఖాళీగా ఉండే జనం వాళ్ళిద్దరికీ రంకు అంటకడతారు .

దుబాయి నుండి వచ్చిన జయసుధ భర్త శరత్ బాబు బుర్రని ఖరాబు చేసే ప్రయత్నం రివర్స్ అవుతుంది . శరత్ బాబు , జయసుధ చొరవతో రాజేంద్రప్రసాద్ , గౌతమిల వివాహం జరగడంతో శుభం కార్డు పడుతుంది .

1987 రాజేంద్రప్రసాద్ ఫస్ట్ హీరోగా సెటిలయిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు . ఈ సినిమా టైటిల్సులో ఆతని పేరే మొదటి పేరుగా వేయబడుతుంది . నటి గౌతమికి ఇదే ఫస్ట్ మూవీ . దయామయుడు సినిమాలో ముందు బుక్ అయినా ఈ సినిమాయే ముందు రిలీజయింది . అలాగే సంగీత దర్శకుడు జి ఆనందుకు కూడా సంగీత దర్శకుడిగా ఇదే మొదటి సినిమా .

మళయాళ సినిమా అయిన గాంధీనగర్ సెకండ్ స్ట్రీటుకి రీమేక్ మన తెలుగు సినిమా . మళయాళంలో మోహన్ లాల్ , కార్తీక , సీమ , మమ్ముట్టి నటించారు . తమిళం లోకి Annanagar Mudhal Theru టైటిలుతో రీమేక్ అయింది . తమిళంలో సత్యరాజ్ , అంబిక , రాధ , మనోరమ నటించారు .

ఈ సినిమాకు జంధ్యాల డైలాగులను వ్రాసారు . వినోదాత్మక చిత్రం కావటం వలన జంధ్యాల సంభాషణలు బాగా సెట్టయ్యాయి . ఆత్రేయ , సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటల్ని వ్రాసారు .‌ థియేటర్లో బాగానే ఉన్నాయి . కలకానిది నిజమైనది , తొలిసారి తెలిసింది , ఛాలెంజ్ ఛాలెంజ్ పాటలు .

అప్పటికి ఇంకా డైరెక్ట్ , ఓపెన్ లిప్ లాకులు పాపులర్ కాలేదు . ఆ టైంలో ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ , గౌతమిలకు డైరెక్టుగా పెదవుల మీద ముద్దు పెట్టుకునే సీన్ పెట్టి ధైర్యం చేసారు . బాలసుబ్రమణ్యం , జానకమ్మలు పాటల్ని పాడారు .

జయసుధ , శరత్ బాబు ఉన్నా వాళ్ళవి సపోర్టింగ్ రోల్సే . అయినా జయసుధ నటించటం విశేషమే . ఇతర ప్రధాన పాత్రల్లో రమాప్రభ , కాకినాడ శ్యామల , డబ్బింగ్ జానకి , సుత్తి వీరభద్రరావు , హేమసుందర్ , రంగనాధ్ , ప్రభృతులు నటించారు . పడమట సంధ్యారాగం నిర్మాత అయిన గుమ్మలూరి శాస్త్రి గారు పిచ్చి వాడి పాత్రలో కాసేపు తళుక్కుమంటాడు .

మా గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చదలవాడ గ్రామ వాసి అయిన పి యన్ రామచంద్రరావు ఈ సినిమాకు దర్శకుడు . ఇతని దర్శకత్వంలోనే వచ్చింది చిత్రం భళారే విచిత్రం . ఎబౌ ఏవరేజ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా యూట్యూబులో ఉంది . వినోదాత్మక , కాలక్షేపం బఠాణీ , ఫీల్ గుడ్ మూవీ . చూడబులే . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘కూడు పెడుతున్న’ ఓటీటీకే టోపీ… ఏమిటీ ఆ స్కామ్..? ఎవరు ఆ నిర్మాత..?
  • రివ్యూ అంటే ఇదీ… క్లైమాక్స్ అంటే ఇదీ… దర్శకత్వం అంటే ఇదీ…
  • ఇది స్మార్ట్ వెలుతురు చీకటి కోణం..! గుండెకే గురిపెడుతోంది..!!
  • ఓ నొటోరియస్ హత్యాచారి..!! వీడింకా బతికే ఉన్నాడు… జైలులో విలాసంగా…!!
  • నాది కవితాగానం కాదు… కాలజ్ఞానం… అందెశ్రీ అంతరంగం ఇదీ…
  • హక్..! దశాబ్దాలనాటి ఆ షాబానో కేసు ఈ సినిమా కథకు నేపథ్యం..!
  • బాడీ షేమింగ్..! ఫిలిమ్ జర్నలిస్టులు ఎక్కడైనా అదే తిక్క ధోరణి..!!
  • అందెశ్రీ..! ప్రజా కవి, సహజ కవి, ప్రకృతి కవి… మాయమైపోయాడు..!!
  • శారద పాత్ర ఉంటే చాలు… పరుచూరి బ్రదర్స్ కలాలకు పదును…
  • వయోలినిస్ట్ సుడిగాలి సుధీర్… ఆసక్తికరంగా ఓ టీవీ షో ప్రోమో…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions