తప్పు తప్పే… గాంధీ స్వయంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడం, అక్కడ రాళ్లతో ఇంటి అద్దాలపై దాడి, విధ్వంసం తప్పే… తప్పు అనడానికి కూడా సందేహం, తటపటాయింపు కూడా అక్కర్లేదు…
సబితను అక్క అని సంబోధించినా సరే, అదేదో తెలంగాణ మహిళలందరినీ కించపరిచారు అని ఆందోళనలకు దిగిన బీఆర్ఎస్ ఇక గాంధీ చర్య మీద ఊరుకుంటుందా..? ఏకంగా ఎమ్మెల్యే మీద హత్యాప్రయత్నం అని చిత్రీకరించేసింది… అంతేనా..? దాడికి ప్రతిదాడి తప్పదు అని కూడా అల్టిమేటమ్ జారీ చేసింది…
నిజానికి ఇదంతా ఓ స్క్రిప్టే అన్నట్టుగా సాగుతోంది… కౌశిక్ రెడ్డి భాష తెలుసు కదా… చీరలు, గాజులు అని తిట్టించారు… గాంధీని రెచ్చగొట్టేలా మాట్లాడింపచేశారు… గాంధీ తత్వం తెలుసు కదా, జస్ట్ ఇలా గోకితే చాలు, అలా రెచ్చిపోతాడు… రియాక్షన్ ఉంటుందని… సో, కాంగ్రెస్‌లో చేరలేదు అన్నావుగా, పద, మీ ఇంటికొస్తా, బీఆర్ఎస్ జెండా ఎగరేసి, తెలంగాణభవన్ పోదాం అని కౌశిక్ రెడ్డి అనేసరికి… ఇక అసలు గాంధీ బయటికొచ్చాడు…
Ads
రా, ఇంటికి రా, చూస్తా, నువ్వు రాకపోతే నేనే నీ ఇంటికొస్తా అన్నాడు… ఇక్కడే ఆపేస్తే అయిపోయేది… ఈలోపు పోలీసులు కౌశిక్ రెడ్డిని హౌజ్ అరెస్టు చేశారు… కానీ గాంధీ ఊరుకోలేదు, తనే స్వయంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లాడు… బీఆర్ఎస్ క్యాంపు కోరుకున్న రిజల్ట్ కనిపించింది… గాంధీ సంయమనం కోల్పోయాడు…
ఒకరికొకరు తీసిపోని దుర్భాషలు ఆడుకుంటున్నారు… (గాంధీ వాడిన భాష మరీ గర్హనీయం)… అవన్నీ సరే, ఏపీ రాజకీయాల స్థాయికి మన తెలంగాణ రాజకీయాలు ఎందుకు దిగజారకూడదు అనే పంతం కనిపిస్తోంది గానీ… ఎక్కడి నుంచో వచ్చినవ్, వయస్సు మళ్లింది, నేను యంగ్, ఈటలనే 100 కిలోమీటర్ల లోతులో బొందపెట్టిన తెలంగాణవాడిని అనే మాటలేమిటి కౌశిక్ రెడ్డి నుంచి..?
ఇక్కడ ఈటలను ఇందులోకి లాగడం కరెక్టు కాదు… పైగా గాంధీ ఎక్కడి నుంచో రావడం ఏమిటి..? నువ్వు ఆంధ్రోడివి అంటున్నాడు పరోక్షంగా… మరి తనకు కేసీయారే కదా టికెట్టు ఇచ్చింది…? ఇక్కడ ఉండేవాళ్లంతా తెలంగాణవాళ్లే, కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో పీకుతా అన్నది కేసీయార్ కాదా..? మీ పార్టీలో ఉంటే మనవాడు, లేకపోతే ఆంధ్రోడా..?
ఎస్, గాంధీ వ్యవహారశైలి కాంగ్రెస్‌కు ఖచ్చితంగా ఎంతో కొంత నష్టదాయకమే… దీనికితోడు ఆమధ్య దానం నాగేందర్ సిటీలో తిరగనివ్వను ఏమనుకుంటున్నారో అని తోటి ఎమ్మెల్యేలనే బెదిరించాడు… సో, ఇవన్నీ అటూఇటూ తిరిగి సిటీలో బీజేపీకి ఇంకా ఎక్కువ స్పేస్ క్రియేట్ చేస్తున్నట్టుంది కదూ…!
కాంగ్రెస్‌లో వరుసబెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరతారు అనే ప్రచారం జరిగింది… కానీ ఎక్కడికక్కడ ఆగిపోయింది… ఆల్రెడీ చేరిన వాళ్లను అనర్హులను చేయించాలని బీఆర్ఎస్ పంతంతో ఉంది, మొన్నటి హైకోర్టు తీర్పుతో కాంగ్రెసే కొంత డిఫెన్స్‌లో పడింది… ఈలోపు కాంగ్రెస్‌లో చేరినవాళ్లేమో ఇదుగో ఇలా… మొత్తానికి కాంగ్రెస్ బండి స్పీడ్ బాగా తగ్గింది…!!
ఇక్కడొక ప్రశ్న… కౌశిక్ బయటికి రాకుండా హౌజ్ అరెస్టు చేసి, బయటికి రానివ్వలేదు, కదలనివ్వలేదు కదా… మరి గాంధీని ఎందుకు అక్కడి వరకూ రానిచ్చారు పోలీసులు..? బీఆర్ఎస్ వేసిన ప్రశ్నలో పంచ్ ఉంది… కాంగ్రెస్‌కే జవాబు లేదు..!!
Share this Article