Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘రాముడు – భీముడు’ కథను ఫిమేలీకరిస్తే… అదే ‘గంగ – మంగ’ సినిమా…

June 20, 2024 by M S R

భూమి గుండ్రంగా ఉండును . మన రామానాయుడు రాముడు భీముడు తీసారు . విజయా వారు హిందీలో దానిని రాం ఔర్ శ్యాంగా రీమేక్ చేసారు . మగవారి కోటా అయిపోయింది . ఇంక ఆడవారి వంతు . ఆ సినిమా ఆధారంగా సిప్పీలు సీతా ఔర్ గీతా తీసారు . అంటే ఆ కథను ఫిమేలీకరించారు. దానిని మళ్ళీ మన విజయా వారు గంగ మంగ సినిమాగా తీసారు . ఇదీ ఈ గుండ్రం స్టోరీ …

వాణిశ్రీ జైత్రయాత్రలో గెలవబడిన మరో మైలురాయి 1973 లో వచ్చిన ఈ గంగ మంగ సినిమా . ఇందులో కూడా వాణిశ్రీయే షీరో . శోభన్ బాబు , కృష్ణ ఆమెకు సపోర్టర్స్ . ANR , శోభన్ బాబు , వాణిశ్రీలు నటించిన ఇద్దరు అమ్మాయిలు సినిమా కథాంశం ఈ గుండ్రం సినిమాలకు దగ్గరగానే ఉంటుంది . అందులో కూడా ఆమే షీరో . గంగ మంగ సినిమాకు తాపీ చాణక్య దర్శకుడు . (ఒక లేడీ స్టార్ డబుల్ రోల్ పోషిస్తే ఇద్దరు స్టార్ హీరోలు దాదాపు అనుబంధ పాత్రలు పోషించడం ఈరోజుల్లో ఒకసారి ఊహించుకొండి… సాధ్యమేనా..?)

రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . దాశరధి వ్రాసిన తొలి వలపులలో ఏ చెలికైనా అలక ఉండునని విన్నాను, అది కవుల కల్పనని అనుకున్నాను పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . అలా అలా అలా అలా గాలిలో పైరగాలిలో సాగిపోదామా స్కేటింగ్ పాట బాగుంటుంది . గడసాని , దొరసాని ఒడుపు చూడండి పాటలో వాణిశ్రీ ఒడుపుని చూడాల్సిందే .

Ads

రాం ఔర్ శ్యాంలో దిలీప్ కుమార్ నటించారు . సీతా ఔర్ గీతాలో హేమమాలిని , ధర్మేంద్ర , మనోజ్ కుమార్లు నటించారు . ఈ గంగ మంగలో వాణిశ్రీ , శోభన్ బాబు , కృష్ణ , రేలంగి , సూరేకాంతం , ఛాయాదేవి , చంద్రమోహన్ , పద్మనాభం , వై విజయ , రమాప్రభ ప్రభృతులు నటించారు . చంద్రమోహన్ విలన్ .

రాముడు భీముడు , గంగ మంగ సినిమాలను మా నరసరావుపేట వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . రాం ఔర్ శ్యాం గుంటూరులో నాజ్ లిటిల్ అంటే ఇప్పుడు నాజ్ ఆప్సరలో చూసినట్లు గుర్తు . అప్పట్లో పెద్ద నాజ్ , చిన్న నాజ్ లను నాజ్ లిటిల్ బిగ్ ధియేటర్ అనే వారు . సీతా ఔర్ గీతా సినిమాను గుంటూరు లీలామహల్లో చూసినట్లు గుర్తు . Subject to correction .

రెండు తెలుగు సినిమాలూ రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్టయ్యాయి . గొప్ప విషయం ఏమిటంటే రెండు హిందీ సినిమాలు కూడా హిట్ కావటం . ఒకే కధతో వండబడిన నాలుగు సినిమాలూ హిట్ కావటం గొప్పే . నాలుగూ యూట్యూబులో ఉన్నాయి . నాలుగూ చక్కటి సినిమాలే . హేమమాలిని , వాణిశ్రీలను అందంలో , నటనలో గెలవగల NTR , దిలీప్ కుమార్లు ఉన్నారు . చూడని వారు తప్పక చూడతగ్గ entertaining , feel good movies . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ….. (By డోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!
  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions