హఠాత్తుగా ఈ ప్రచారం ఎందుకు స్టార్టయిందో తెలియదు… గంగవ్వకు రాత్రి గుండెపోటు వచ్చింది బిగ్‌బాస్ హౌజులో… డాక్టర్లు అర్జెంటుగా హౌజులోకి వెళ్లి చికిత్స అందించారు… విష్ణుప్రియ బాగా టెన్షన్ పడింది… హౌజ్‌మేట్లలో కలవరం… ఇదీ సోషల్ మీడియాలో ప్రచారం…
తూచ్… అబ్బే, అది ప్రాంక్ అట అని మళ్లీ ప్రచారం… తీరా లైవ్ చూసినా… ఈరోజు టీవీ ప్రసారం చూసినా ఏమీ లేదు… 1) గంగవ్వకు సింపతీ కోసం హైవిలేజ్‌షో ఈ నాటకం ఆడాల్సిన పనిలేదు… ఆల్రెడీ ఆమెకు బాగా వోట్లు పడుతున్నాయి… పైగా ఆ షో నిర్వాహకులే గుండెపోటు వంటిదేమీ లేదని ఖండిస్తున్నారు… 2) పోనీ, ఆమె మీద నెగెటివిటీ ప్రచారం చేయడానికి, షోకు ఆమె ఆరోగ్యం సహకరించదు అని చెప్పడానికి ఎవరైనా చేశారా..? అదీ అనవసరం… ఆమెకు ఆమే పోటీ, ఎవరికీ పోటీ కాదు…
అసలు విష్ణుప్రియ ఎందుకు టెన్షన్ పడింది… ఎందుకంటే..? గంగవ్వ పదే పదే తనను ఎలిమినేట్ అవుతాను అని చెబుతుంటే విష్ణుప్రియ ఆమె మీద కస్సుమంది… అదేమైనా హార్ట్ చేసి హార్ట్ ఎటాక్‌కు దారి తీసిందా అని విష్ణుప్రియ టెన్షన్ పడిందేమోనని కూడా కొందరు రాసిపారేశారు… సరే, ఇవన్నీ వదిలేస్తే… ఈసారి నిఖిల్, పృథ్వి, మెహబూబ్‌ల మీద హౌజులో బాగా వ్యతిరేకత కనిపించింది…
Ads
చివరకు నామినేషన్ల జాబితాలో వాళ్లతోపాటు నయని పావని, విష్ణుప్రియ, ప్రేరణ ఉన్నారు… హరితేజను మెగాచీఫ్ సేవ్ చేశాడు… ఎప్పటిలాగే పృథ్వి అదే అరుపులు, అదే వితండవాదంతో చిరాకెత్తించాడు… మెహబూబ్ ఫుల్ డిఫెన్సులో పడిపోయాడు… అవినాష్ సుదీర్ఘమైన వాదనలతో బోర్ కొట్టించాడు… కొందరికైతే నామినేట్ చేయడానికి సరైన కారణాలే లేవు… ఏదో అలా కథ నడిపించేశారు…
నిజంగానే రోజురోజుకూ షో నిస్సారంగా తయారవుతోంది… ఏమాత్రం ఆసక్తికరంగా లేదు… అది షో రేటింగ్స్ మీద కూడా ప్రభావం చూపిస్తోంది… ఇక ఇంతకుమించి నిర్వాహకులు కూడా ఏమీ చేయడానికి లేదు… పాత వాళ్లూ అంతే, కొత్త వాళ్లూ అంతే… ఆల్రెడీ 50 రోజులు గడిచిపోయాయి… రాను రాను గౌతమ్, పృథ్వి, నయని సైకిక్ బిహేవియర్ చూడాల్సి రావచ్చు… లేదా వాళ్లు ఎలిమినేటయిపోతే కాస్త ఆట రక్తికడుతుందేమో…
నబీల్ వోకే గానీ మెహబూబ్ మీద హౌజులో వ్యతిరేకత కనిపిస్తోంది… పనిలోపనిగా గంగవ్వను కూడా పంపించేస్తే బెటర్… రాను రాను కంపిటీషన్ ఎక్కువ అవుతుంది… ఆమె ఫిట్ కాలేదు అందులో…! నాగార్జునకు కోపమొస్తుందనేమో… ఎవరూ ఆమెను నామినేట్ చేయరు, ఆమెను టార్గెట్ చేయరు, ఆమె మీద కామెంట్స్ ఉండవు… ఆమధ్య మణికంఠను ఈవారమో, మళ్లీ వారమో పోతావుపో అనేసింది… ఇప్పుడేమో విష్ణుప్రియను… ఆమె అందరినీ అనొచ్చు, కానీ ఆమెను ఎవరూ ఏమీ అనొద్దు… అలా హౌజులో ఉంటుంది, అంతే…
Share this Article