నిజమే కావచ్చుగాక… 2 కోట్లు అనేవి బీఆర్ఎస్ సాధనసంపత్తిలో, ఆ పార్టీ ప్రచారఖర్చులో ఊదిపారేసేంత చాలా చాలా చిన్న మొత్తం కావచ్చుగాక… ఆ పార్టీ సోషల్ మీడియా మీద వెచ్చిస్తున్న ఖర్చులో ఇది ఆప్టరాల్ కావచ్చుగాక… కానీ ఏకంగా 2 కోట్లు ఇచ్చి గంగవ్వతో ఓ వంటల వీడియో, అదీ కేటీయార్ స్వయంగా పార్టిసిపేట్ చేసేంత సీన్ ఉందా..?
కావచ్చు, గంగవ్వతో వంటల వీడియో చేస్తే జనంలోకి విపరీతంగా వెళ్తుందని కేటీయార్ సోషల్ టీం ఆలోచించి ఉండవచ్చు… మైవిలేజ్‌షో యూట్యూబ్ చానెల్‌కు పాపులారిటీ ఉంది, వాళ్ల వీడియోలు జనంలోకి బాగానే వెళ్తాయి… కేటీయార్‌కు ఈ వీడియో ద్వారా మైలేజీ వస్తుందని అనుకుని ఉండవచ్చు… కానీ మరీ 2 కోట్లు ఇచ్చి చేయించుకునేంత సీన్ ఉందా..? నమ్మబుల్‌గా లేదు…
ఈ వీడియో బయటికి వచ్చాక కేటీయార్ సోషల్ మీడియా టీం దీన్ని వైరల్ చేయడానికి ప్రయత్నించింది… నిజానికి ఎన్నికల ప్రచారవేళ నాయకులు హోటళ్లలో దోసెలు వేస్తూ, మిర్చి బజ్జీలు గోలిస్తూ, పిల్లలను ఆడిస్తూ, ఫోటోలు దిగుతారు, మీడియా పబ్లిష్ చేస్తుంది… అదంతా ఓ వృధా లొట్టపీసు ప్రచారం… దాంతో వోట్లు పడేది లేదు, జస్ట్, ఫోటోగ్రాఫర్ల కోసం, పత్రికల్లో పబ్లిష్ చేయడం కోసం… అంతే…
Ads
కేటీయార్ గంగవ్వతో కలిసి చికెన్ కూడ వండిన వీడియోకు కూడా అంతకుమించిన ప్రాధాన్యం ఏమీ ఉండదు… ఏదో కాసేపు ప్రచారం… దాంతో ఏ పాజిటివ్ వైబ్స్ రావు, ఫాయిదా లేదు… మరీ ఈమాత్రం దానికి కేటీయార్ వ్యతిరేక పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఉలిక్కిపడటం దేనికి..? ఈ ఫోటోను బాగా ప్రచారంలోకి తీసుకురావడం దేనికి..?
ఈ వీడియో వైరల్ కాగానే ఓ ఫోటో బయటికి వచ్చింది… గంగవ్వ స్వయంగా రేవంత్‌రెడ్డి దగ్గరకు ఏదో డిష్ తీసుకుపోయినట్టు ఫోటో… నవ్వొచ్చింది… ఇక ఈ ఫేక్ ఫోటో విషయానికి వద్దాం… కేటీయార్‌ను గంగవ్వ టీం రమ్మనలేదట… రమ్మనకపోవచ్చు… కానీ ఆ టీమే మేం రమ్మనగానే కేటీయార్ వచ్చాడని ఫోటోలు రిలీజ్ చేసుకున్నట్టు గుర్తుంది… ఏమో, అదీ ఫేక్ అంటారా..? చెప్పలేం…
సరే, కేటీయార్ టీమే గంగవ్వతో వీడియో చేయడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు… వాళ్లే స్క్రిప్ట్ రాసి ఇవ్వవచ్చు… ముందుగానే 2 కోట్లు ఇచ్చారనే అనుకుందాం డిబేట్ కోసం… 2 కోట్లు తీసుకున్నాక… ‘‘మాకు బీఆర్ఎస్‌తో సంబంధం లేదు, చేయకపోతే ఎక్కడ ఇబ్బంది పెడతారోననే భయంతో చేశాం’’ అనే మాట ఎందుకొస్తుంది..? నిజంగానే భయపెట్టేవాళ్లయితే, అదే భయంతో ఇలా ఫోటో రిలీజ్ కూడా చేసే అవకాశం లేదు కదా… అంటే భయపడేవాళ్లే అయితే, వీళ్లు భయపెట్టేవాళ్లే అయితే… ఈ ఫోటో వివరణ వచ్చే చాన్సే లేదు కదా…
సో, ఈ ఫోటో క్రియేటర్స్ ఎవరో గానీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, ఫేక్ అని ఆ క్యాంపే పరోక్షంగా చెప్పుకున్నట్టయింది… మొత్తమ్మీద పాజిటివో, నెగెటివో కేటీయార్‌కు పబ్లిసిటీ వచ్చింది…!! ఇంకా మూడువారాలుంది… ఆ ఫాక్స్‌కాన్ లేఖలాగా… ఈ గంగవ్వ వివరణ ఫోటోలాగా… ఇంకెన్ని సోషల్ వికారాలు చూడాలో…!!
Share this Article