ఆధ్యాత్మికతకు సంబంధించి… విశ్వాసమే దేవుడు… శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంకా వేలాది మంది దేవుళ్లను నమ్మడం ఆ విశ్వాసమే… ఒక తీర్థస్థలి మీద నమ్మకం ఉండొచ్చు… అంతేకాదు, బతుకంతా ధర్మప్రచారానికి వెచ్చించిన యోగులను కూడా దేవుళ్లుగా భావించడం కూడా ఆ విశ్వాసమే… ఇక గానుగాపూర్ వెళ్దాం పదండి… ఇది కర్నాటకలో, మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే పాత హైదరాబాద్ రాజ్యంలోని ఓ ఆశ్రమం… ముందే చెబుతున్నాను… ఇది సంప్రదాయిక హిందూ దేవుళ్లకు సంబంధించిన గుడి కాదు… మరేమిటి..?
ఇది పూర్వకాలంలో ఓ ఆశ్రమం… అక్కడ దత్తాత్రేయుడు అనే యోగి, ధర్మప్రచారకుడు 23 ఏళ్లపాటు నిర్వహించిన ఓ ఆశ్రమం… తన మహిమల్ని చూపిన స్థలి… తరువాత కాలంలో తన పాదుకలను ఇక్కడ ప్రతిష్టించి, తరువాత శ్రీశైలం వెళ్లి అక్కడే కాలం చేసిన ప్రసిద్ధ యోగిపుంగవుడు… దేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక పరంపరల్లో ఒకటైన నాథ్ సంప్రదాయానికి ఆదిగురువుగా చెబుతారు… ఇంతకీ ఎవరు ఈ దత్తాత్రేయుడు..?
అత్రి అనే మహర్షి గురించి హిందూ చరిత్ర, పురాణాలు చెబుతాయి… సాక్షాత్తూ బ్రహ్మ కుమారుడిగా అభివర్ణిస్తాయి… ఆయన భార్య సతీ అనుసూయ… ఆమె గురించి మనలో చాలామందికి తెలుసు… ఆమె కొడుకుల్లో ఒకరు దత్తాత్రేయుడు… తన మహత్తు ఇప్పటికీ అక్కడ తన భక్తులను, శిష్యులను ప్రభావితం చేస్తుందనీ, మనిషిలో నెగెటివ్ శక్తుల్ని తొలగించి, పాజిటివ్ వైపు తీసుకెళ్తుందనీ ఓ విశ్వాసం… దాంతో దత్తాత్రేయుడే దేవుడైపోయాడు…
Ads
సో, ఇక్కడ గుడిలో ఆయన పాదుకలుంటాయి… ఆయన విగ్రహముంటుంది… తను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమేననే విశ్వాసం కాబట్టి ఆ మూడు మొహాలతో కూడిన విగ్రహం ఉంటుంది… అదీ అన్ని దేవస్థానాల్లోలాగా బహిరంగంగా కనిపించదు…. తిరుమల నేత్రదర్శనం తరహాలో గోడకున్న ఓ కిటికీ వంటి రంధ్రం నుంచి లోపలకు చూడాలి, అక్కడ తన విగ్రహం, పాదుకలు కనిపిస్తాయి.,.
గానుగాపూర్ ఉండేది ఇక్కడ… గూగుల్ మ్యాప్స్… https://www.google.co.in/maps/place/Ganagapur+Dattatreya+Temple+Sri+Kshetra+Ganagapur/@17.1808741,76.5316292,15.86z/data=!4m13!1m7!3m6!1s0x3bc89f42f101ce19:0xb0b4bcb647ddf128!2sGanagapura,+Karnataka!3b1!8m2!3d17.2008563!4d76.5372625!3m4!1s0x3bc89f3ade54e9af:0xfe090b5623dbf531!8m2!3d17.1787841!4d76.534557?hl=en
దత్రాత్రేయ పరంపరలో యోగులుగా ప్రసిద్ధిచెందిన వారెందరో… వాళ్ల సమాధులు కూడా పుణ్యక్షేత్రాలయిపోయాయి… (మంత్రాలయం కూడా సంప్రదాయిక హిందూ ముఖ్యదేవుళ్ల గుడి కాదు… ఆధ్యాత్మిక, ధార్మికప్రచారాల్లో పునీతులైన యోగుల సమాధులే దర్శనీయాలు…) దత్తాత్రేయ పరంపరలో చరితార్థులైన వారి సమాధుల ఎదుట కూడా తాబేలు (శివుడి విగ్రహం ఎదుట నందిలాగా…) కనిపిస్తుంది… మరెందుకు చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఇవన్నీ…?
ఈమధ్య తెలుగు రాష్ట్రాల నుంచి గానుగాపూర్ వెళ్తున్నవారి సంఖ్య బాగా పెరిగింది… చాలామంది అక్కడికి వెళ్లివస్తే తమ కోరికలు ఈడేరాయని చెబుతుండటంతో ఆ మౌత్‌టాక్ బాగా ప్రబలంగా వ్యాపిస్తోంది… నిజానికి అది మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక బోర్డర్… గుల్బర్గా (పాత హైదరాబాద్-కర్నాటక)కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది… చిన్న పట్టణం… కాదు, పెద్ద గ్రామం… గతంలో ఇక్కడికి ఆ పరిసరాలకు చెందిన భక్తులు వచ్చేవాళ్లు… కానీ ఇప్పుడు దూరప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు…
మేం కనెక్టయ్యాం, మాకు మంచి జరిగింది అనే మౌత్ టాక్ కన్నా మించింది ఏముంది..? అన్నింటికీ మించి మానసిక సమస్యలున్నవాళ్లకు (దెయ్యాలు, భూతాలు, చేతబడుల బాధితులుగా చెప్పబడేవాళ్లు) ఇక్కడికి వస్తే స్వస్థత చిక్కుతుందనేది ఎక్కువ ప్రచారం అవుతోంది… గ్రహపీడ ఉన్నవాళ్లు, క్లిష్టసమస్యలతో బాధపడేవాళ్లకు ఓ ఊరట కేంద్రంగా ఇప్పుడు కనిపిస్తోంది ఈ గుడి… ఏడాదిపాటు ప్రతి పౌర్ణమికి వెళ్తే మంచిదనే ప్రచారం ఎలా ప్రారంభమైందో గానీ అలా వెళ్లేవాళ్లు కూడా బోలెడు మంది… అందుకే పౌర్ణమి పూట ఎక్కువ రద్దీ కనిపిస్తుంది… ఇంతకీ ఎలా వెళ్లాలి..? అక్కడ ఏముంది..? తరువాత కథనాల్లో….
Share this Article