Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గానుగాపూర్..! చేరే మార్గమేంటి..? చూడాల్సిందేమిటి..? పార్ట్-2

October 1, 2022 by M S R

గానుగాపూర్… ఎలా వెళ్లాలి..? ఏది కన్వీనియెంట్…? ఇదీ చాలామందికి ఎదురయ్యే ప్రశ్న… హైదరాబాద్ బేస్‌గా చెప్పాలంటే… 270 కిలోమీటర్ల దూరం… హడావుడిగా వెళ్లిరావడం కుదరదు… ట్రెయిన్ కంఫర్టే… 02702 వంటి స్ట్రెయిట్ రైళ్లే గాకుండా కలబురిగి (గుల్బర్గా) రూట్‌లో వెళ్లే రైళ్లను చెక్ చేసుకోవాలి… చౌకగా, వేగంగా వెళ్లడానికి ఇదొక మార్గం… కాకపోతే గానుగాపూర్ రోడ్ అనేది స్టేషన్… అక్కడ దిగాలి… అక్కడ నుంచి గానుగాపూర్ ఊరు, గుడి 20 కిలోమీటర్లు, అంటే అక్కడి నుంచి బస్సు లేదా ఆటో, జీపు చూసుకోవాలి… ట్రెయిన్ ద్వారా వెళ్లాలనుకునేవాళ్లు గుర్తుంచుకోదగిన ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే గానుగాపూర్‌కు నేరుగా రైలు సౌకర్యం లేదు…

బస్సులయితే… హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) నుంచి దాదాపు ప్రతి గంటకూ ఓ బస్సు గుల్బర్గాకు వెళ్తుంది… కేఎస్ఆర్టీసీ లేదా టీఎస్ఆర్టీసీ… ప్రైవేటు బస్సుల్లో రేట్లు మరీ ఎక్కువ… దాదాపు ఐదారు గంటల జర్నీ… గుల్బర్గాకు వెళ్లాక, అక్కడి నుంచి గానుగాపూర్‌ వెళ్లడానికి మళ్లీ వేరే బస్సు పట్టుకోవాలి… దాదాపు గంట జర్నీ… సో, హైదరాబాద్ నుంచి నేరుగా గానుగాపూర్ వెళ్లడానికి నేరుగా బస్సు సౌకర్యం లేనట్టే లెక్క… పూణె, హుబ్లీ, బెల్గాం, ఔరంగాబాద్ ఎయిర్ పోర్టుల వరకూ ఫ్లయిట్లలో వెళ్లినా… మళ్లీ అక్కడి నుంచి గానుగాపూర్ దూరమే…

ganugapur

Ads

కొంచెం బెటర్ ఆప్షన్ మన సొంత వెహికలే… లేదా గ్రూపుగా వెళ్లాలనుకునేవారికి ప్రైవేటు హైర్డ్ వెహికిల్స్… హైదరాబాద్ నుంచి వికారాబాద్ రూట్‌‌లో వెళ్లినా, జహీరాబాద్ రూట్లో వెళ్లినా దాదాపు సేమ్ దూరం… 270 కిలోమీటర్లు… మినిమం ఆరు గంటల జర్నీ… కాకపోతే జహీరాబాద్ రూట్‌లో వెళ్తే రోడ్డు కాస్త బాగుంటుంది… (హైదరాబాద్, సంగారెడ్డి, జహీరాబాద్, హుమ్నాబాద్, గుల్బర్గా, గానుగాపూర్… ఇదీ రూట్…) డ్రైవింగ్ తెలిసినవాళ్లు ఇద్దరుంటే అలసట తెలియదు…

ఈ రూట్ ఎందుకు బెటర్ అంటే..? కొందరు కేవలం గానుగాపూర్ వెళ్లిరావడం గాకుండా చుట్టుపక్కల ఏమైనా దర్శనీయ స్థలాలున్నాయో చూద్దామని అనుకుంటారు… గుల్బర్గా పరిసరాల్లో మీకు ఇంపార్టెంట్ టూరిజం ప్లేసెస్ లేవు… కాకపోతే జహీరాబాద్ నుంచి కాస్త లోపలకు 9, 10 కిలోమీటర్ల దూరంలో సిద్ధివినాయక టెంపుల్ ఉంటుంది… ప్రతి సంకట చతుర్థి (అమావాస్య తరువాత వచ్చే చవితి) రోజున రద్దీ అధికం… మామూలు రోజుల్లో పెద్ద రద్దీ ఉండదు, చిన్న టెంపుల్… ఆ ఏరియాలో మనకు తెలుగు భోజనం దొరకదు కాబట్టి అక్కడ దేవస్థానం ఏర్పాటు చేసే ఫ్రీ లంచ్ తీసుకోవడం బెటర్…

హుమ్నాబాద్‌లో మాణిక్‌ప్రభు టెంపుల్ ఉంటుంది… ఇది సంప్రదాయిక హిందూ ఆర్కిటెక్చర్‌తో ఉండదు… కాస్త భిన్నంగా ఉంటుంది… ఇక్కడ కూడా దత్తాత్రేయ శిష్యపరంపరలో యోగులుగా, ఆ ఆశ్రమ అధిపతులుగా వ్యవహరించిన వాళ్ల సమాధులు ఉంటాయి… ఆసక్తి, నమ్మకం ఉన్నవాళ్లు వెళ్లవచ్చు… రకరకాల ఆర్జితసేవలు, అడ్డగోలు రేట్లు ఉంటాయి… అందులో మెజారిటీ సేవలు మనకు తెలియనే తెలియవు… గుల్బర్గా పెద్దదే… కానీ తెలుగు భోజనం దొరకడం కష్టం…

sangam

జస్ట్, గానుగాపూర్‌లో కేవలం దర్శనం చేసుకుని వచ్చేవాళ్లకయితే గుల్బర్గా నుంచి గానుగాపూర్ బస్సు బెటరే… గానుగాపూర్ బస్‌స్టాండ్‌కు గుడి వాకబుల్ దూరం… రష్ లేకపోతే త్వరత్వరగా దర్శనం చేసుకుని, నేరుగా బస్‌స్టేషన్ చేరుకుని గుల్బర్గా బస్సు ఎక్కేయడమే… కాదు, మేం గానుగాపూర్‌ మొత్తం దర్శించుకునే వెళ్తాం అనుకునేవాళ్లకు… బస్‌స్టేషన్ నుంచి సంగం వద్దకు ఆటోలు దొరుకుతాయి…

3 కిలోమీటర్ల దూరంలోని సంగం దగ్గర బీమా నది… అక్కడ నదీస్నానం చేసి, ఒడ్డున ఉన్న మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవచ్చు… (ఔదుంబర్ ట్రీ)… మళ్లీ గానుగాపూర్ వెళ్లాక కిలోమీటర్ దూరంలోని కల్లేశ్వర్ గుడికి ఆటోలో వెళ్లవచ్చు… అక్కడ శని విగ్రహం ఉంది కాబట్టి సమస్యలతో బాధపడేవాళ్లు ఓసారి దండంపెట్టి, నువ్వులు, నువ్వులనూనెతో అభిషేకం చేసేస్తే బెటర్… అక్కడే దొరుకుతాయి… నల్లటిబట్టతో చేసిన వత్తిదీపం సహా… మిగతా గుళ్లు కూడా కొన్ని ఉంటాయి… కానీ ముఖ్యమైనవి మాత్రం నదీస్నానం, మేడిచెట్లు ప్రదక్షిణ, ప్రధానమైన గుడిలో దత్తాత్రేయుడి పాదుకాదర్శనం… మిగతావి మీ ఓపిక, మీ ఇష్టం… (మరికొంత సమాచారం మూడో భాగంలో…) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions