మెగా కుటుంబానికి దూరంగా అల్లు ఫ్యామిలీ..? మెగా కుటుంబానికి అల్లు ఫ్యామిలీ క్రమంగా దూరమవుతోందనే ఊహాగానాలు సాగుతున్నాయి… ఈ ఎన్నికల్లో YCP అభ్యర్థి ఇంటి కెళ్లి బన్ని మద్దతివ్వడం, ఆ తర్వాత నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేయడం తెలిసిందే… తాజాగా, సాయి ధరమ్ తేజ్ ట్విటర్ లో అల్లు అర్జున్ ను అన్ ఫాలో కొట్టారు… వీటికి తోడు జన సేనాని ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదు… అసలు ఆహ్వానం అందిందో..? లేదో..? తెలియదు.. దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి…
ఇదండీ వాట్సప్ గ్రూపుల్లో బాగా కనిపిస్తున్న ఓ సందేశం… ఎస్, నిజానికి మెగా కుటుంబానికి ఇది మరుపురాని పండుగ వేళ… పవన్ కల్యాణ్ వంటి అస్థిర నాయకుడు ఏకంగా 100 శాతం స్ట్రయిక్ రేట్‌తో గెలుపు సాధించి, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, ఏకంగా మోడీ సాదరంగా వెన్నుతట్టి, నీ వెనుక నేనున్నా బ్రదర్, ఇక దున్నెయ్ అన్నట్టు ప్రేమ చూపించిన స్థితిలో… సదరు మెగా కాంపౌండ్‌లో అత్యంత కీలకమైన అల్లు అరవింద్ సందడి లేదు, ఉనికి లేదు…
Ads
ఎస్, తన వ్యక్తిగత పరిచయం కొద్దీ అల్లు అర్జున్ ఎవరో ఓ వైసీపీ నాయకుడి ప్రచారానికి మద్దతుగా వెళ్లాడు… అది వ్యక్తిగతం, అంతే తప్ప అందులో రాజకీయం లేదు… అల్లు అర్జున్ రాజకీయాల్లోనూ లేడు… నిజం చెప్పాలంటే… మెగా ఫ్యామిలీ అయినంత మాత్రాన పవన్ కల్యాణ్‌కూ జై అనాల్సిన పనీ లేదు… (నిర్మలా సీతారామన్ బీజేపీ మంత్రి, కీలకమైన ఆర్థిక శాఖ, కానీ ఆమె భర్త మోడీ ద్వేషి… ఐతేనేం, ఇలాంటివి సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోకూడదు…)
కానీ మెగా కంపౌండ్ అలా కాదు… ఇష్టమున్నా లేకపోయినా సరే, పవన్ కల్యాణ్‌కు జై కొట్టాల్సిందే అంటుంది… నిజానికి చాన్నాళ్ల క్రితమే పవన్ ఫ్యాన్స్‌కూ బన్నీకి నడుమ దూరం పెరిగింది… ట్రోల్ చేశారు… బన్నీ ఫ్యాన్స్ కౌంటర్ అటాక్స్ చేశారు సోషల్ మీడియాలో… అదలా కొనసాగుతోంది… కానీ తను పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారానికి పోలేదు సరికదా వైసీపీ వైపు నిలబడ్డాడు… అఫ్‌కోర్స్, జగన్ కోసం కాదు, ఓ అభ్యర్థి కోసం…
దానికి నాగబాబు పెద్ద రచ్చ చేశాడు, మనవాళ్లు- పరాయోళ్లు అంటూ పరిణతి లేని ఓ వ్యాఖ్య చేశాడు, తనకు అలవాటే… తరువాత వెనక్కి తగ్గాడు… చిరంజీవి అయితే తన తమ్ముడు ఆహా ఓహో అని సంబరాల్లో మునిగిపోయాడు… సరే, అదంతా ఓ ఫ్యామిలీ, అన్నదమ్ములు… బ్లడ్ ఎమోషన్… తప్పు లేదు… కానీ ఎటొచ్చీ అందరూ తమ వ్యక్తిగత అభిప్రాయాల్ని పాతరేసి పవన్ కల్యాణ్‌ను సపోర్ట్ చేయాలనడంలోనే వస్తుంది సమస్య…
అసలు బన్నీతోనే కాదు, అల్లు అరవింద్‌కే మొదటి నుంచీ పవన్ కల్యాణ్‌తో సరైన టరమ్స్ లేవు, కారణం తెలియదు… ఇక ఇప్పుడు బన్నీ ఇష్యూతో ఆ దూరం మరింత పెరిగింది… చిరంజీవి మొహం అత్యంత ఆనందంతో వెలిగిపోతున్నా సరే, బావమరిది అల్లు అరవింద్ మాత్రం దూరదూరంగానే ఉండిపోయాడు… ఈ దూరం ఇంకా పెరిగే సూచనలే ఉన్నాయి… వేచి చూడాలి..!
ఎందుకంటే… చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను వాడుకునే విషయంలో మోడీకి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి..! అవునూ, ఇకపై మెగా అంటే కేవలం చిరంజీవి ఫ్యామిలీ.., అల్లు ఫ్యామిలీకి మెగా అనే ట్యాగ్ లేదు, కొణిదెల ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీవేరు… అంతేకదా అరవింద్ సారూ..!!
Share this Article